థ్రిల్లింగ్ మ్యాచ్… దక్షిణాఫ్రికాపై ఆసీస్‌దే విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్, కమిన్స్ లైన్ అండ్ లెన్త్కు కట్టుబడ్డారు. దీంతో నిర్ణీత ఓవర్లలో దక్షిణాఫ్రికా 118/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్-40, రబాడ-19, మిల్లర్-16 టాప్ స్కోరర్లుగా నిలిచారు.
Read Also: టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయ్యిందెవరో తెలుసా?
Also Read
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
- Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
- KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
- Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
అనంతరం 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలో దక్షిణాఫ్రికా బౌలర్లు షాకిచ్చారు. ఫించ్ డకౌట్ కాగా మిచెల్ మార్ష్ 11 పరుగులకే అవుటయ్యాడు. వార్నర్ (14) కూడా ఎక్కువసేపు నిలబడలేదు. అయితే స్మిత్ (35), మ్యాక్స్‌వెల్ (18) కుదురుగా ఆడటంతో ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ వీరిద్దరినీ వెంటవెంటనే ప్రొటీస్ బౌలర్లు అవుట్ చేశారు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా స్టాయినీస్ (24 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. వేడ్ 15 పరుగులతో అతడికి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జేకు రెండు వికెట్లు దక్కగా రబాడ, షాంసీ, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!