India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan All Out for 57 vs India in Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతోంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆతిథ్య జపాన్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. తెలుగు అమ్మాయి శ్రీ చరణి నాలుగు వికెట్స్, ఓపెనర్ షఫాలీ వర్మ రెండు వికెట్స్ పడగొట్టడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ముందు 58 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది.
జపాన్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో తెలుగు అమ్మాయి శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది. నాలుగు ఓవర్లు వేసిన చరణి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆమె స్పిన్ ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మ్యాచ్ ఆరంభంలో జపాన్ బ్యాటర్లు భారత బౌలర్లను బాగా ఎదుర్కొన్నారు. పవర్‌ప్లేలో వికెట్లు కాపాడుకుంటూ జపాన్ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. అయితే భారత స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చరణి నేతృత్వంలో బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి జపాన్‌పై ఒత్తిడి పెంచారు.
Also Read
- Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
- Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
- Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
- Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పేసర్లు క్రాంతి గౌడ్, నందిని శర్మలు వికెట్స్ తీయకున్నా.. పరుగులు కట్టడి చేశారు. స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, షఫాలీ వర్మలు బంతిని తిప్పేశారు. వీరి బౌలింగ్ ముందు పసికూన జపాన్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. వరుసగా వికెట్స్ పడడడంతో ఆతిథ్య జట్టు ఆలౌట్ అయింది. చివరి వికెట్ 20వ ఓవర్లో పడింది. నోనోహా యసుమోటోను క్లీన్ బౌల్డ్ చేసింది. శ్రేయాంక పాటిల్ తన తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్ అయింది. జపాన్ బ్యాటర్లలో అయకా కటో (25) టాప్ స్కోరర్. అయకా సహా హరున ఇవాసాకి (10) మాత్రమే రెండంకెల స్కోరు అందుకుంది. మై యనగిడ (0), అహ్లియా చందెల్ (0), ఎరికా టోగుచి (0), నొనొహ యసుమోటో (0) డకౌట్ అయ్యారు. ఎరిక ఓడా (5), షిమాకో కటో (3), అకరి కనో (2), హినాసె గోటో (1), అయుమి (4) సింగిల్ డిజిట్ స్కోర్ చేశారు.
తాజావార్తలు
-
India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?