Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing XI vs Afghanistan for Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సోమవారం (సెప్టెంబర్ 28) అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న ఐచి ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్:
భారత జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సర్పంచ్ సాబ్ సహా జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె వంటి సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, యశ్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ జట్టులో ఉన్నారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆటగాడు మాత్రం బుడ్డేడే. అఫ్గానిస్థాన్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.
Also Read
- IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
- Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
మరోసారి ఎదురుచూపులేనా?
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అతడికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆడనున్నారు. ఇషాన్ కిషన్ కూడా జట్టులో అందుబాటులో ఉండటంతో వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించడం టీమ్ మేనేజ్మెంట్కు సవాలుగా మారింది.
తుది జట్టులోకి బుమ్రా:
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి తుది జట్టులోకి రానున్నాడు. జపాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అతడికి టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ కావడంతో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ పేస్ బౌలింగ్‌ను పంచుకోనున్నాడు. యశ్ ఠాకూర్‌కు నిరాశ తప్పదు. అవసరం అనుకుంటే శివమ్ దూ కూడా బౌలింగ్ చేస్తాడు. ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ భారత్‌కు వైవిధ్యాన్ని అందించనున్నారు.
పటిష్టంగానే అఫ్గానిస్థాన్:
అఫ్గానిస్థాన్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టోర్నీలో ఆ జట్టు జపాన్‌పై విజయం సాధించగా.. నేపాల్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పుడు బలమైన భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని అఫ్గానిస్థాన్ భావిస్తోంది. రషీద్ ఖాన్, రహ్మనుల్లా గుర్బాజ్, మహ్మద్ నబి, ఇబ్రహీం జాద్రాన్, ఫజల్హక్ ఫారూఖిలు కీలకం కానున్నారు. అఫ్గానిస్థాన్ కూడా పటిష్టంగానే ఉంది. మరోవైపు భారత్ ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదే జోరును ఏషియన్ గేమ్స్ నాకౌట్ దశలోనూ కొనసాగించాలని చూస్తోంది. సెమీఫైనల్ బెర్త్ కోసం జరిగే ఈ కీలక పోరులో భారత్ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని చూస్తోంది.
హెడ్-టు-హెడ్:
భారత్-అఫ్గానిస్థాన్ టీ20ల్లో మొత్తం 12 మ్యాచ్‌లలో తలపడ్డాయి. భారత్ 11 గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటి కూడా గెలవలేదు. ఓ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.
భారత్-అఫ్గానిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
అఫ్గానిస్థాన్: మొహమ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖిల్, కరీం జనత్, దర్విష్ రసూలీ (కెప్టెన్) నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ ఇషాఖ్ (వికెట్ కీపర్), అబ్దుల్లా అహ్మద్జాయ్, ఇస్మత్ ఆలం, ఫరీదూన్ దావూద్జాయ్, నంగేయాలియా ఖరోతీ, అరబ్ గుల్ మొమాండ్.
తాజావార్తలు
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!