Asia Cup: భారత్‌కి ఇంకా ఫైనల్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది.. అదెలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Stills Can Qualify Asia Cup Final If This Wonder Happen: అవును.. సూపర్-4 దశలో భారత్ రెండు పరాజయాలు చవిచూసినప్పటికీ, ఫైనల్‌కి వెళ్లేందుకు ఇంకా ఒక అవకాశం ఉంది. కాకపోతే.. అందుకు అద్భుతాలే జరగాల్సి ఉంటుంది. సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో బుధవారం ఆఫ్ఘనిస్తాన్, అలాగే సెప్టెంబర్ 9న శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఆ రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్ ఓడిపోవాలి. అదే విధంగా.. సెప్టెంబర్ 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్ భారీ పరుగులతో విజయం సాధించాలి. ఇలా జరిగితే.. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా.. భారత్‌కు ఫైనల్లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. కానీ.. ఇది దాదాపు అసాధ్యమే!
ఎందుకంటే.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల కంటే పాకిస్తాన్ చాలా పటిష్టంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ బౌలింగ్ విభాగం ఫెయిలైతే, బ్యాట్‌తో రప్ఫాడించే బ్యాట్స్మన్లు పాక్‌లో ఉన్నారు. లంక, ఆఫ్ఘన్ జట్లు మాత్రం అంత నిలకడగా లేవు. అఫ్కోర్స్.. ఈ టోర్నీలో రెండు జట్లూ దూసుకుపోతున్న మాట వాస్తవమే కానీ, పాక్‌తో పోలిస్తే మాత్రం కాస్త బలహీనమైనవే. కాబట్టి, ఆ రెండు జట్లు పాక్‌ని ఓడించడం అంత సులువు కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు.. అద్భుతాలు జరిగితే తప్ప భారత్ ఫైనల్‌కి చేరుకోలేదు. ఆ రిజల్ట్ ఏంటో, ఈ రోజు పాకిస్తాన్ & ఆఫ్ఘన్ మధ్య జగరనున్న మ్యాచ్‌తో తేలిపోనుంది. ఇప్పుడు భారత్ పరిస్థితి.. దింపుడు కల్లం ఆశలాగా తయారైపోయింది. చనిపోయిన వ్యక్తిని స్మశానంలో పాతిపెట్టడానికి ముందు చూస్తే, తిరిగి లేస్తాడా? లేదు కదా!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్‌ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!