Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane Gets Bumper Offer In The Place Of Suryakumar Yadav: ఈ ఐపీఎల్ సీజన్‌లో అజింక్యా రహానే చేస్తున్న చమత్కారాలు అన్నీ ఇన్నీ కావు. మునుపెన్నడూ లేని విధంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులతో తాండవం చేశాడు. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, మూడు సిక్సుల సహాయంతో ఆ వ్యక్తిగత స్కోరు చేశాడు. ఆ ఇన్నింగ్స్ ఆడేంతవరకు అతడిలో అంత ఫైర్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంతేకాదు.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇలా అద్భుతంగా రాణించడం వల్లే అతనికి ఒక బంపరాఫర్ దక్కిందని సమాచారం.
Akhilesh Yadav: అసద్ అహ్మద్‌ది బూటకపు ఎన్‌కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..
Also Read
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
- Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన తర్వాత భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జూన్ 7వ తేదీన ఇంగ్లండ్‌లో జరగనుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో, అతని స్థానంలో అజింక్యా రహానేను జట్టులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి.. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయనున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు అతడను ఫామ్‌లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో, అతడి స్థానంలో విదేశీ పిచ్‌లపై మంచి అనుభవం ఉన్న రహానే వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే నిజమైతే.. రహానే పంట పండినట్టే!
Bhoot Jolokia : ఘోస్ట్ పెప్పర్.. ఒక్కటంటే ఒక్క మిర్చి నమిలారో ఇక అంతే
కేవలం ఐపీఎల్‌లోనే కాదండోయ్.. రంజీ సీజన్ 2022-23లోనూ అజింక్యా రహానే అదరగొట్టాడు. రంజీలో 7 మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. కానీ.. సూర్యకుమార్ ప్రస్థానం మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. వరుసగా డకౌట్లు అవుతున్నాడు. ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఓవైపు ఇతర బ్యాటర్లు దుమ్ముదులుపుతుంటే, ఇతను మాత్రం క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి వెనుదిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఛాన్స్ కోల్పోయాడు.
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!