Abhishek Sharma: ఫిట్‌నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?

  • నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు
  • కట్ చేస్తే పాకిస్థాన్ మ్యాచ్‌కు సంజూ దూరం
  • అందుకే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
Abhishek Sharma

Abhishek Sharma

టీ20 ప్రపంచకప్‌ 2026లో చోటుచేసుకున్న కొన్ని టీమ్ ఎంపికల నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా అవకాశం దక్కించుకున్న సంజూ.. నమీబియాపై కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ అనంతరం అతడు జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో సంజూ బాగా ఆడితే.. అభిషేక్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన మేనేజ్‌మెంట్‌లో మెదిలినట్లు చర్చ సాగుతోంది.

సంజూ శాంసన్ పాకిస్థాన్ మ్యాచ్‌లో కూడా రాణిస్తే.. అతడిని డ్రాప్ చేయడం కష్టమవుతుందని టీమ్ మేనేజ్‌మెంట్‌ భావించిందట. అందుకే పూర్తిగా ఫిట్ కాకపోయినా అభిషేక్ శర్మనే పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై ఆడించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ డకౌట్ కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి. ‘డకౌట్ స్టార్’ అని ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ లేని అభిషేక్ ఆడడం చూస్తుంటే.. కావాలనే సంజూను పక్కనపెట్టినట్లు అర్ధమవుతోంది.

Also Read: Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!

ఇలాంటి పరిస్థితి గతంలో శుభ్‌మ‌న్ గిల్ విషయంలో కూడా ఎదురైంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అతడిని వరుసగా ఆడించగా.. ఆశించిన ఫలితాలు రాలేదు. చివరకు అతడిని తప్పించాల్సి వచ్చింది. తర్వాతే ఇతరులకు అవకాశాలు లభించాయి. ఈ రెండు సంఘటనలు జట్టు ఎంపికలో ఫిట్‌నెస్ ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి. గాయాలు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న ఆటగాళ్లను బలవంతంగా ఆడించడం తాత్కాలికంగా సరైన నిర్ణయం అనిపించినా.. దీర్ఘకాలంలో అది ఆటగాడికీ జట్టుకీ నష్టమే అని చెప్పొచ్చు. సరైన సమయంలో సరైన ఆటగాడికి అవకాశం ఇవ్వడం టీమ్ బ్యాలెన్స్‌కు అత్యంత ముఖ్యం అని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.