భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ తన పవర్ హిట్టింగ్‌తో చేరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో యూఏఈ-ఎపై కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో 144 పరుగులు చేశాడు. ఆపై పాకిస్థాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 45 పరుగులు బాదాడు. వైభవ్ అవుట్ అయ్యాక భారత్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది.…