2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ…