మంద్రస్వర గీతాలలో ఆయనే ‘రాజా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎ. ఎం. రాజా 1929 జూలై 1వ తేదీ చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మథరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. పచ్చయప్ప కళాశాల నుండి 1951లో బి. ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మాస్టర్ నటరాజన్ వద్ద సంగీతాభ్యాసం పొందిన ఎ. ఎం రాజా కళాశాలలో చదివేటప్పుడే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను పొందారు. తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ‘సంసారం, సంసారం’ రాజా పాడిన మొట్ట మొదటి సినిమా పాట. తెలుగులో ఆయన పాడిన మొదటి పాటలు ‘ఆకలి’, ‘ఆదర్శం’, ‘సంక్రాంతి’ (1952) చిత్రాలలోవి. కానీ గాయకుడిగా గుర్తింపు పొందింది ‘పక్కింటి అమ్మాయి’ (1953) సినిమాలో పాడిన పాటలతోనే! తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాటలు పాడారు. ఎంజీఆర్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పి.జి. కృష్ణవేణిని (జిక్కీ) చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. అది పెరిగి, పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాములయ్యారు. వారికి నలుగురు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులు.
గాయకుడి ఎ. ఎం. రాజా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ‘ప్రేమలేఖలు’, ‘అమరసందేశం’, ‘విప్రనారాయణ’ చిత్రాలు ఆయనకు చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి. సుశీలతో పాడిన ‘మిస్సమ్మ’ చిత్రంలోని ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే’ వంటి మరపురాని పాటలు అనేకం పాడారాయన. ‘బంగారు పాప, భాగ్యరేఖ’ చిత్రాలలో రాజా పాడిన పాటలు కూడా తీపి గుర్తులే! 1953-57 మధ్య కాలంలో రాజా నక్షత్రంలా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా 1953 – 55 సంవత్సరాలలో ఘంటసాల కంటే రాజా గాత్రానికే నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రాధాన్యతనిచ్చారు. అయితే తొలినుండి రాజాకు సంగీతాన్ని సమకూర్చాలనే కోరిక బలంగా ఉండేది. అది 1958లో ‘శోభ’ మూవీతో తీరింది. అలానే ఆయనకు సంగీత దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘కళ్యాణ పరిశు’. విశేషం ఏమంటే… భార్య జిక్కీ కంటే రాజా చిత్రాలలో ఎక్కువగా పాటలు సుశీల పాడారు. మలయాళ సినీ రంగంలో హీరో సత్యన్‌కు గాత్రదానం ఎక్కువగా చేసింది రాజాయే. మలయాళంలో రాజా సంగీత దర్శకత్వం కూడా చేశారు.
Also Read
- Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్‌తో వైరల్‌గా మారిన సక్సెస్ స్టోరీ!
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్‌డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ఘంటసాల, రాజా ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల పాడారు. తమిళంలోనూ రాజా కంటే ఆ టైమ్ లో పీబీ శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వడం మొదలు పెట్టారు. సంగీత దర్శకుడైన తరువాత మిగిలిన సంగీత దర్శకులు ఆయనతో పాటలు పాడించడం బాగా తగ్గిపోయింది. రాజా లో గాయకుడు, సంగీత దర్శకుడితో పాటు ఓ చక్కని నటుడూ ఉన్నాడు. ‘పక్కింటి అమ్మాయి’ (1953) చిత్రంలో రాజా నటనను అందరూ మెచ్చుకొన్నారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత రాజా, జిక్కీ దేశవిదేశాలలో తమ పాటల కచేరీలు చేశారు. వాటికి మంచి ఆదరణ లభించింది. దురదృష్టం ఏమంటే… 1989 ఏప్రిల్ 7న ఒక కచేరికి వెళ్ళుతున్నప్పుడు పరిగెత్తే రైలు ఎక్కుతూ కాలు జారి పట్టాల కింద పడి రాజా మరణించారు. అదే రైలులో ఆయన భార్య జిక్కీ కూడా ఉన్నారు. వివిధ భాషలలో దాదాపు వెయ్యి పాటలు పాడిన రాజా, సుమారు 30 చిత్రాలకు స్వర రచన చేశారు. నిజానికి తెలుగులో కంటే తమిళంలో రాజాకు ఎనలేని కీర్తి దక్కింది. మంద్ర స్వరంలో శ్రుతి తప్పకుండా పాటలు పాడటంలో రాజా మిన్న అన్నది సంగీత విమర్శకులు చెప్పే మాట.
(ఎ. ఎం. రాజా జయంతి సందర్భంగా)
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..