Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- షాజహాన్‌ను మించిన ప్రేమికుడు..
- భార్య కోసం స్పెషల్ ఎస్కలేటర్ డిజైన్ చేసిన శివనారాయణ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Narayana Reddy: “ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టాడు” అనే మాట పాతదైపోయింది. నేటి తరం ప్రేమ కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాదు, భాగస్వామి కష్టాన్ని తీర్చే అద్భుతమైన ఆవిష్కరణగా మారుతోంది. అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త ప్రేమకథ. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక, ఒక భర్త తన సృజనాత్మకతకు పదును పెట్టి ఏకంగా ఆమె కోసమే ఒక ప్రత్యేకమైన ఎస్కలేటర్‌ను డిజైన్ చేసి వైరల్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్తి శివనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈ తన భార్య కోసం ఒక అపూర్వ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.
ఆయన భార్య గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులు సమస్యల వల్ల ఇంట్లోని మెట్లు ఎక్కడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండేవారు. రోజురోజుకూ ఆమె పడుతున్న బాధను చూసి శివనారాయణ రెడ్డి మనసు చలించిపోయింది. ఆమె కష్టాన్ని ఎలాగైనా దూరం చేయాలనుకున్నారు. మార్కెట్లో దొరికే సాధారణ లిఫ్ట్‌లు లేదా కమర్షియల్ ఎస్కలేటర్లు కాకుండా, తన ఇంటి వసతులకు అనుగుణంగా ఉండేలా ఒక కస్టమ్ ఎస్కలేటర్‌ను స్వయంగా రూపొందించాలని నిశ్చయించుకున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, భార్యపై ఉన్న అమితమైన ప్రేమను పెట్టుబడిగా పెట్టి, కేవలం ఆమె కోసమే ప్రత్యేకమైన మెకానిజంతో కూడిన ఎస్కలేటర్‌ను సక్సెస్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆమె ఎటువంటి శ్రమ లేకుండా, నొప్పుల బాధ లేకుండా సులభంగాపై అంతస్తుకు చేరుకోగలుగుతున్నారు. తన భార్యపై ఆ భర్త చూపించిన ఈ అపురూపమైన అనురాగం, ఆయన చేసిన సంచలన ఆవిష్కరణకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ భర్త ఐడియాను, ఆయన ప్రేమను నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
True love doesn't just move mountain – sometimes, it builds escalators. When his wife struggled with the stairs, Satti Siva Narayana Reddy of East Godavari district channeled his devotion into pure innovation, designing a custom escalator just for her. It turns out "to the moon… pic.twitter.com/xxldvgnWP9
— Lokesh Nara (@naralokesh) July 4, 2026
తాజావార్తలు
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!