LIC New Policy: మహిళలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ ఈ ప్రత్యేక బీమా పాలసీని ప్రారంభించింది. ఆ పాలసీ పేరు LIC ఆధార్ శిలా పాలసీ. 8 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలందరూ ఈ పథకం ప్రయోజనం పొందడానికి అర్హులు. ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందాం.
LIC దేశంలోని ప్రతి తరగతి ప్రజల కోసం కొత్త కొత్త పాలసీలను తీసుకువస్తూనే ఉంటుంది. బీమా పాలసీలను కొనుగోలు చేయడంలో మహిళలు చాలా వెనుకబడి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ ప్రత్యేక బీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీలో మహిళలు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. ఈ పాలసీలో ఏ మహిళ అయినా కనీసం రూ.75 వేలు, గరిష్టంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
Read Also: GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే
LIC ఆధార్ శిలా ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. ఆధార్‌శిల పాలసీ అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇందులో 8 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. LIC ఈ పథకం కింద త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద కనీసం 10 సంవత్సరాలు.. గరిష్టంగా 20 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
8 లక్షల ప్రయోజనం ఎలా పొందాలి
మీరు 30 సంవత్సరాల వయస్సులో పథకాన్ని ప్రారంభించారు అనుకుందాం. .. ప్రతిరోజూ రూ. 58 ఆదా చేస్తే మీరు ఒక సంవత్సరంలో రూ. 21,918 అవుతుంది. ఈ మొత్తాన్ని ఎల్‌ఐసి ఆధార్ శిలా యోజనలో డిపాజిట్ చేస్తారు. 20 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ. 4,29,392అవుతుంది.. మెచ్యూరిటీలో మీరు రూ. 7,94,000 రాబడిని పొందుతారు. LIC యొక్క ఆధార్‌శిల ప్లాన్ భద్రత, పొదుపు రెండింటినీ అందిస్తుంది. ఆధార్ కార్డు ఉన్న మహిళలు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ పథకంలో మహిళలు రూ. 3 లక్షల వరకు నాన్-లింక్డ్, పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపు జీవిత బీమా ప్లాన్ నుండి రూ.75,000 హామీని పొందుతారు. దీనితో పాటు ఈ పథకం గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు. పాలసీదారు మరణిస్తే అతని తర్వాత కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది.