Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Battery Cycle Even Engineers Cant Work Before Grandfathers Wisdom What A Creativity

Battery Cycle: తాత తెలివి ముందు ఇంజనీర్లు కూడా పనికి రారు.. వాట్ ఏ క్రియేటివిటి..

Published Date :September 13, 2023 , 5:09 pm
By Swathi Maddula
Battery Cycle: తాత తెలివి ముందు ఇంజనీర్లు కూడా పనికి రారు.. వాట్ ఏ క్రియేటివిటి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని నిరూపించాడు ఓ అరవై ఏళ్ల వృద్ధుడు.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సైకిల్ ను మోటారు సైకిల్ గా మార్చి తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. టాలెంటు ఎవరి అబ్బ సొత్తు కాదు అని నిరూపించిన చంద్రం అనే చిరు వ్యాపారిని చూసి నేటి యువత ఆశ్చర్యపోతుంది. అతని గురించి మరిన్ని వివరాలు..

తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక మండలం హబ్బీపూర్ గ్రామానికి చెందిన పబ్బం చంద్రం అనే 60 సంవత్సరాలు వృద్దుడు. తనకు ఉన్న సైకిల్ పై ఊరూరా తిరుగుతూ చిన్నపిల్లలకు సంబంధించిన కురుకురే, బింగో లాంటి తినుబండారాలను కిరాణా షాపులకు వేసి వచ్చిన దాంట్లో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.. గత ముప్పై ఏళ్ల నుంచి ఆయన ఇదే పని చేస్తున్నాడు.. కానీ ప్రస్తుతం వయసు మీద పడడం శరీరం ఆరోగ్యం సహకరించకపోవడంతో, కుటుంబ పరివారం పెరగడంతో కష్టపడలేక పోతున్నాడు. చనిపోయే వరకు తన రెక్కల కష్టంతోనే బ్రతకాలి అన్న ఆయన ఆశయం నుంచి ఒక తెలివైన ఉపాయాన్ని కనుక్కున్నాడు. ఆయన ఆలోచనలో నుంచి వచ్చిందే బ్యాటరీ సైకిల్.. మొదట్లో అందరూ ఇతనిని చూసి నవ్వారు.. కానీ ఇప్పుడు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

తన తెలివితో కేవలం 22వేల రూపాయలతో బ్యాటరీతో నడిచే సైకిల్ ని తయారుచేశాడు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు వెళ్లే లాగా రూపొందించాడు. ప్రస్తుతం అతను ఈ బ్యాటరీ సైకిల్ పై ఊరు తిరుగుతూ తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాడు.. తన కుటుంబ పోషణకు ఇక డోకా లేకుండా చూసుకుంటున్నాడు. అందుకే తెలివి ఎవడి అబ్బా సొత్తు కాదు, తలుచుకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని పెద్దాయన.. ఆర్థిక సాయం అందిస్తే ఇలాంటివి తయారు చేస్తామని ఆ వృద్ధుడు చెబుతున్నాడు.. నిజంగా ఆయన ఆలోచన గ్రేట్ కదా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Battery Cycle
  • inspiration story
  • telangana

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions