The Ghost Movie Review: ది ఘోస్ట్ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Akkineni Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran
- DIRECTOR: Praveen Sattaru
- MUSIC: Mark K. Robin, Bharatt-Saurabh
- PRODUCER: Sharrath Marar, Puskur Ram Mohan Rao
The Ghost Movie Review: అక్కినేని నాగార్జునకు అక్టోబర్ 5 ఓ స్పెషల్ డే! ఆయన కెరీర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’ రిలీజ్ డేట్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి అదే రోజున ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున, ప్రవీణ్ సత్తారు ఫస్ట్ కాంబినేషన్ లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ యేడాది ఇప్పటికే ‘బంగార్రాజు, బ్రహ్మాస్త్రం’ చిత్రాలతో జనం ముందుకు వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్’తో ఎలా ఆకట్టుకున్నారో చూద్దాం.
గత యేడాది వచ్చిన ‘వైల్డ్ డాగ్’ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా నటించాడు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. ఈ వయసులోనూ నాగార్జున ఫుల్ ఫిట్ గా ఉన్నారనేది ఆ సినిమా నిరూపించింది. ఇక ఈ యేడాది ప్రారంభంలోనే ‘బంగార్రాజు’గా ఫుల్ రొమాంటిక్ పాత్రను చేసి మాస్ ఆడియెన్స్ ను మెప్పించారు. ‘బ్రహ్మాస్త్రం’లో ఆయన పోషించింది గెస్ట్ రోల్ కావడంతో అక్కినేని అభిమానులు ఒక్కింత నిరాశకు గురయ్యారు. ఆ లోటును భర్తీ చేస్తూ దసరా కానుకగా ‘ది ఘోస్ట్’ మూవీ వచ్చేసింది.
Also Read
- Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. 'ఆపరేషన్ సింధూర్'పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Jr NTR : 'డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
- Fauzi: ప్రభాస్‌కు తల్లిగా అలనాటి అందాల తార.. 'ఫౌజీ'లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
- Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై ప్రీతి జింటా
ఇంటర్ పోల్ ఆఫీసర్స్ విక్రమ్ (నాగార్జున), ప్రియ (సోనాల్ చౌహాన్) మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఈస్ట్ అరేబియాలో ఓ ఆపరేషన్ ను వీళ్ళిద్దరూ సక్సెస్ చేస్తారు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉండే వీరిద్దరూ చేపట్టిన మరో ఆపరేషన్ మాత్రం ఫెయిల్ అవుతుంది. ఇండియన్ ఫ్యామిలీకి చెందిన ఓ పిల్లాడిని ఉగ్రవాదులు దారుణంగా చంపేస్తారు. అప్పటికే మానసికంగా డిస్ట్రబ్ అయి ఉన్న విక్రమ్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అతను తన మాట వినడం లేదనే కోపంతో ప్రియా ముంబైకు వచ్చి ఎన్.సి.బి.లో చేరుతుంది. ఇలా ఐదేళ్ళు గడిచిపోతాయి. ఆ తర్వాత ఓ రోజు ఇండియా నుండి విక్రమ్ కు అను (గుల్ పనాగ్) నుండి ఫోన్ వస్తుంది. తన లైఫ్ రిస్క్ లో ఉందని, తన కూతుర్ని చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని విక్రమ్ కు చెప్పి వాపోతుంది. దాంతో హుటాహుటిన విక్రమ్ ఊటీలో లాండ్ అవుతాడు. అనుకు అండగా నిలబడటంతో పాటు ఆమె కూతురి సెక్యూరిటీ బాధ్యతలను భుజానికెత్తుకుంటాడు. అసలు విక్రమ్ కు అను కు ఉన్న సంబంధం ఏమిటీ? ఆమె కోసం అతను తన లైఫ్ ను ఎందుకు రిస్క్ లో పెట్టుకున్నాడు? కార్పొరేట్ సంస్థలు అండర్ వరల్డ్ తో చేతులు కలిపితే జరిగే పర్యవసానం ఏమిటీ? ఐదేళ్ళ పాటు విక్రమ్ కు దూరంగా ఉన్న ప్రియా మళ్ళీ అతని చెంతకు ఎలా చేరింది? విక్రమ్ ను చూడగానే ఏదో ఘోస్ట్ ను చూసినట్టుగా అరి వర్గాలు ఎందుకు భయపడ్డాయి? వీటన్నింటికీ సమాధానమే ఈ సినిమా!
ముందు చెప్పినట్టు నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘ఆఫీసర్’తో పాటు తాజాగా ‘వైల్డ్ డాగ్’లోనూ నటించాడు. అయితే ఆ రెండు సినిమాల కంటే కూడా ఇది కాస్తంత భిన్నమైంది. ఇందులో కేవలం యాక్షన్ కే ప్రాధాన్యం ఇవ్వకుండా కొద్దిగా రొమాన్స్ ను, ఇంకొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మిక్స్ చేశాడు. అండర్ వరల్డ్ నేపథ్యాన్ని మాత్రమే తీసుకుని ఉంటే ఇది రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ అయిపోయి ఉండేది. అయితే కార్పొరేట్ క్రైమ్ ను దానికి యాడ్ చేయడం బాగుంది. నిజానికి ఈ రెండు అంశాలను ప్రవీణ్ సత్తారు తన గత రెండు ప్రాజెక్ట్స్ లో విడివిడిగా టచ్ చేశాడు. ఐదేళ్ళ క్రితం ‘గరుడవేగ’ను ఎన్.ఐ.ఎ. నేపథ్యంలో తెరకెక్కించిన ప్రవీణ్ లాస్ట్ ఇయర్ కార్పొరేట్ క్రైమ్ నేపథ్యంలోనే ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ తీశాడు. సో.. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ ప్రాజెక్ట్ విషయంలో జస్ట్ కేక్ వాక్ చేశాడంతే. అయితే నాగార్జున బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్స్ ను, అక్కినేని అభిమానులను నిరుత్సాహానికి గురి చేయకుండా రొమాంటిక్ సాంగ్ కు ప్రాధాన్యమిచ్చాడు. దాంతో ఇటు ఫ్యాన్స్, అటు మాస్ ఈ సినిమా విషయంలో ఫుల్ హ్యాపీ ఫీలవుతారు. అలానే ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా సెంటిమెంట్ సీన్స్ ను డిజైన్ చేశాడు. అవీ బాగానే ఉన్నాయి. ఇక క్లయిమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ సంతోష పరుస్తుంది.
విక్రమ్ క్యారెక్టర్ లో నాగార్జున చక్కగా సెట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ లోనూ స్టైలిష్ గా కనిపించాడు. విశేషం ఏమంటే, ఇంతకాలం గ్లామర్ డాల్ ఇమేజ్ ని క్యారీ చేస్తున్న సోనాల్ చౌహాన్ ఇందులో దానితో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. కార్పొరేట్ సంస్థ అధినేత్రిగా గుల్ పనాగ్, ఆమె కూతురుగా అనిఖా సురేంద్రన్ చక్కగా నటించారు. విలన్ మనీశ్ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర ప్రధాన తారాగణంలో జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ మాత్రమే సుపరిచితులు, మిగిలిన వారు తెలుగు తెరకు కొత్త!! భరత్, సౌరభ్ అందించిన రొమాంటిక్ సాంగ్ ట్యూన్ బాగుంది. అలానే మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం, ముఖేష్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేశ్ సుబ్బరాయన్, కేచ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి. బట్.. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్తంత కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో విక్రమ్ భారీ తుపాకీ తీసుకుని విధ్వంసం సృష్టించిన సన్నివేశాలకు ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ ప్రేరణేమో అనిపిస్తుంది. విక్రమ్ ఏమిటనేది అప్పటికే ప్రేక్షకులకు తెలుసు కాబట్టి క్లయిమాక్స్ లో మరీ అంత అరాచకం అక్కర్లేదు.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న బ్యాక్ డ్రాప్
స్టైలిష్ మేకింగ్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
హీరో క్యారెక్టరైజేషన్
రొటీన్ ఫ్లాష్ బ్యాక్
ఓపెనింగ్ సీన్స్
రేటింగ్: 2.5 /5
ట్యాగ్ లైన్: డెడ్లీ యాక్షన్!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!