Thathwam Movie Review: ‘తత్వం’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: దినేష్ తేజ్, దష్విక సుక్కురెడ్డి, ఆనంద్ భారతి, జబర్దస్త్ కృష్ణ, భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు
- DIRECTOR: అర్జున్ కోలా
- MUSIC: చైతన్ భరద్వాజ్
- PRODUCER: శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి
క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లలో తెరకెక్కే సినిమాలకి టాలీవుడ్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. దినేష్ తేజ్ హీరోగా, అర్జున్ కోలా దర్శకత్వంలో రూపొందిన తాజా క్రైమ్ మిస్టరీ మూవీ ‘తత్వం’. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక జంట హత్యల మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు కట్టిపడేసిందో రివ్యూలో తెలుసుకుందాం.
తత్వం కథ
ఏలూరు సమీపంలోని రామాపురం గ్రామంలో మూర్తి (సుక్కు రెడ్డి), నాగమణి అనే దంపతులు దారుణంగా హత్యకు గురవుతారు. మానసిక స్థితి సరిగ్గా లేని వారి కుమారుడు సుధనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్తులు నిర్ధారణకు వచ్చి, అతడిని బంధించి పోలీసులకు సమాచారం ఇస్తారు.
సరిగ్గా అదే రోజు కానిస్టేబుల్ కల్యాణ్ (దినేష్ తేజ్) పెళ్లి చూపుల నిమిత్తం అదే గ్రామానికి వస్తాడు. ప్రాథమిక విచారణ జరిపి రిపోర్ట్ సిద్ధం చేయాల్సిందిగా కల్యాణ్‌ను ఎస్సై ఆదేశిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి చూపుల్లో కల్యాణ్ కలిసిన సౌమ్య (దష్విక), నిందితుడిగా భావిస్తున్న సుధ అమాయకుడని, అతను ఈ హత్యలు చేసి ఉండకపోవచ్చని చెబుతుంది. ఆమె మాటలతో కల్యాణ్ కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ విచారణలో ఎలాంటి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఆ దంపతులను హత్య చేసింది ఎవరు? అమాయకుడైన సుధపై ఎందుకు నింద వేశారు? ఈ చిక్కుముడిని కానిస్టేబుల్ కల్యాణ్ ఎలా విప్పాడు? అన్నదే ప్రధాన కథ.
Also Read
విశ్లేషణ
మూఢనమ్మకం, నమ్మకం మధ్య ఉండే ఓ సున్నితమైన గీతను మూలకథగా ఎంచుకుని దర్శకుడు ఈ మర్డర్ మిస్టరీని తీర్చిదిద్దారు. పెళ్లి చూపుల నేపథ్యంతో మొదలై క్రమంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మారే విధానం, కథన శైలి మలయాళ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల ధోరణిని గుర్తుచేస్తుంది. అసలు హంతకుడు ఎవరనే గుట్టును చివరివరకు దాచిపెట్టి, వీక్షకుల్లో ఉత్కంఠను కొనసాగించడంలో దర్శకుడు కొంత వరకు సఫలమయ్యారు. అయితే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోలీస్ విచారణ సన్నివేశాలు పకడ్బందీగా లేకపోవడంతో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం వేగం పెరుగుతుంది. పల్లెటూరిలోని పలువురు వ్యక్తులపై అనుమానం కలిగేలా సన్నివేశాలు నడపడం, మధ్యలో జంతువుల అక్రమ రవాణా కోణాన్ని జోడించి కథను నడపడం ఆసక్తిని పెంచుతుంది. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్ ఊహకందని విధంగా ఉన్నప్పటికీ, ముగింపు కాస్త రొటీన్ ఫార్ములాలోనే ముగుస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్లను మరింత పకడ్బందీగా, పదునైన స్క్రీన్‌ప్లేతో మలిచి ఉంటే ఈ థ్రిల్లర్ స్థాయి మరింత పెరిగేది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే దినేష్ తేజ్ నిజాయితీగల కానిస్టేబుల్ కల్యాణ్ పాత్రలో హుందాగా నటించారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో, డ్యూటీకి కట్టుబడే కానిస్టేబుల్‌గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. దష్విక సుక్కురెడ్డి: పల్లెటూరి యువతి సౌమ్యగా తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ స్క్రీన్‌పై ఫ్రెష్‌గా కనిపించింది. మానసిక స్థిమితం లేని సుధ పాత్రలో నటించిన అబ్బాయి ప్రతిభ ప్రశంసనీయం. కొన్ని భావోద్వేగ, ఉత్కంఠభరిత సన్నివేశాల్లో భయాన్ని కలిగించేలా మెప్పించాడు. ప్రమోదిని, ఆనంద్ భారతి, జబర్దస్త్ కృష్ణ, సుక్కు రెడ్డి, భోగిరెడ్డి శ్రీనివాస్ తమ తమ పాత్రల పరిధి మేరకు సహజమైన నటనను ప్రదర్శించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే భరత్ పట్టి కెమెరా పనితనం బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని, కథలోని నిశ్శబ్ద వాతావరణాన్ని విజువల్స్‌లో చక్కగా చూపించారు. చైతన్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. విప్లవ్ నైషదం ఎడిటింగ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ముఖ్యంగా మొదటి భాగంలో సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే మరింత మేలయ్యేది. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎఫ్.కె. ప్రొడక్షన్స్ పాటించిన నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. దర్శకుడు అర్జున్ కోలా ఎంచుకున్న పాయింట్ బాగుంది, స్క్రీన్‌ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుంటే చిత్రం మరింత ప్రభావవంతంగా ఉండేది.
ఫైనల్లీ.. మర్డర్ మిస్టరీలు, రూరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘తత్వం’ నచ్చొచ్చు.
తాజావార్తలు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!