Tegimpu Review: తెగింపు మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Ajith Kumar, Manju Warrier, Samuthirakani, Ajay, Pavani, John Kokken, Veera, Bucks
- DIRECTOR: H Vinoth
- MUSIC: Ghibran
- PRODUCER: ZEE Studios & Boney Kapoor
Tegimpu Review: ఇటీవల కాలంలో అజిత్ కుమార్ నటించిన సినిమాలు ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. అలా అజిత్ తాజా చిత్రం ఈ సంక్రాంతికి అటు తమిళనాటతో పాటు తెలుగు రాష్ర్టాలలోనూ విడుదలైంది. తమిళంలో ‘తునివు’గాను, తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
కథ విషయానికి వస్తే.. వైజాగ్‌లోని యువర్ బ్యాంక్‌ను దోచుకుని అక్కడ లెక్కలోకి రాని మొత్తం 500 కోట్లను పంచుకోవాలని అసాంఘిక శక్తులతో కలసి ఓ పోలీస్ ఆఫీసర్ పథకం పన్నుతాడు. అలా ప్లాన్ ప్రకారం బ్యాంక్‌లో ఎంటరైన వారికి అక్కడ అజిత్ రూపంలో ప్రతిఘటన ఎదురవుతుంది. అయితే అతను కూడా తన మనుషులలో వీరిని చిత్తుచేసి బ్యాంక్ కస్టమర్లను, ఉద్యోగులను, గూండాలను బందీలుగా చేసుకుంటాడు. అంతే కాదు బ్యాంక్ లో లెక్కకు రాని మొత్తం 500 కోట్లు కాదని 25వేల కోట్లని చెబుతాడు. మరి అంత మొత్తం అక్కడ ఎందుకు ఉంది. అజిత్ ఎందుకు బ్యాంక్ ను దోచుకోవాలనుకుంటాడు? తనకి సాయంగా ఉంది ఎవరు? ఆ డబ్బు ఎవరిది? వీటన్నింటికి సమాధానమే ‘తెగింపు’ సినిమా.
Also Read
బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులు స్టాక్ మార్కెట్ మోసాలను బట్టబయలు చేసే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. కార్పొరేట్ సంస్థలు, దిగ్గజాలు ప్రభుత్వ నిధులను ఎలా దుర్వినియోగం చేస్తున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు సంస్థలు ముదుపు పేరుతో ఎలా మాయం చేస్తున్నారే పాయింట్ ఆసక్తిని రేకెత్తించేదే అయినా దానిని కథగా పకడ్బందీగా అల్లుకోవడంలో విఫలం అయ్యాడు దర్శకుడు వినోద్.
ఆరంభంలోనే బ్యాంకు దోపిడీ అనే సీరియస్ అంశం మరీ పేవలంగా చిత్రీకరించటంతో ఆడియన్స్ సినిమాలో ఇన్ వాల్వ్ కాలేకపోతారు. ప్రత్యేకించి విజువల్ ఎఫెక్ట్ నాసిరకంగా ఉండటంతో మనం అజిత్ సినిమా చూస్తున్నామా అనే సందేహం కలుగుతుంది. న్యూస్ ఛానల్ ఉద్యోగి, అవినీతికి పోలీస్ ఆఫీసర్ మధ్య సంభాషణ కొంత వరకూ హాస్యాన్ని పండించింది. అజిత్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే తన బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీని అందిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఫిజిక్ విషయంలో అజిత్ జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
నిజానికి ఈ సినిమాలో అసలు లాజిక్ లేదు. ఇక ఆరంభంలో బ్యాంక్ దోపిడి ప్రయత్నంతో పాటు చివర్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మరీ పేలవంగా చిత్రీకరించబడ్డాయి. అజిత్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సైతం ఎలాంటి గ్రిప్ లేకుండా సాగింది. సినిమా మొత్తంలో ఎక్కడా ఎమోషన్ కనెక్ట్ అవదు. పాటల గురించి అసలు చెప్పుకోకపోవడమే మంచిది. జిబ్రాన్ రీరికార్డింగ్ సైతం సోసోగానే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఘోరంగా ఉండటంతో వాటి ప్రభావం సినిమాటోగ్రఫీపై కూడా పుడుతుంది. సినిమా చూస్తున్నంత సేపు మన మైండ్ లో హాలీవుడ్ థ్రిల్లర్ మనీ హీస్ట్ తో పాటు పలు చిత్రాలు జ్ఞప్తికి వస్తాయి. ఏది ఏమైనా, ఎంతకు తెగింపు చేసినా సంక్రాంతికి సందడి చేసే చిత్రం మాత్రం కాదు.
ప్లస్ పాయింట్స్
సినిమా మెయిన్ పాయింట్
అజిత్ నటన
ద్వితీయార్థంలో కొంత భాగం
మైనస్ పాయింట్స్
కథ, కథనం
విజువల్ ఎఫెక్ట్స్
ప్రథమార్ధం, క్లయిమాక్స్
దర్శకత్వం
ట్యాగ్ లైన్: తెగించినా ప్రయోజనం లేదు
రేటింగ్: 2.25/5
- Tags
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..