NTV Telugu Site icon

Baak Movie Review: బాక్ మూవీ రివ్యూ

Bsk

Bsk

మనకు బాగా తెలిసిన హీరోయిన్ ఖుష్బూ భర్త తమిళంలో డైరెక్టర్. ఆయన గతంలో చేసిన అరుణ్మై అనే సినిమా సూపర్ హిట్ కావడంతో అదే పేరుతో సిరీస్ ప్రారంభించి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు అదే సిరీస్లో నాలుగో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో దానికి బాక్ అనే టైటిల్ పెట్టారు. తమన్నా, రాశి ఖన్నా, కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ వంటి వాళ్ళు నటించడంతో ఈ సినిమా మీద ప్రకటించినప్పటి నుంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులలో మరిన్ని అంచనాల పెంచేశాయి. మరి ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

బాక్ కథ:
శివ శంకర్ (సుందర్ సి) ఒక లాభ ఆపేక్ష లేని లాయర్. తన చెల్లి శివాని (తమన్నా భాటియా) ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఆమె దగ్గరకు వెళ్లలేక అలా అని మరిచిపోలేక సతమతమవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బాక్ అనే దుష్టశక్తి కారణంగా శివాని, ఆమె భర్త చనిపోతారు. అయితే పోలీసులు మాత్రం శివాని తన భర్త గుండెపోటుతో చనిపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెబుతారు.. కానీ తన చెల్లి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని భావించిన శివశంకర్ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే అసలు ఈ బాక్ ఎవరు ?, ఈ దుష్ట శక్తి ఎందుకు శివాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది?, పిల్లలను చనిపోయిన శివాని ఎలా కాపాడింది ?, మరోవైపు శివ శంకర్ తన చెల్లి పిల్లల కోసం ఏం చేశాడు ?, ఆ బాక్ ను ఏం చేశాడు ?, ఈ మొత్తం వ్యవహారంలో మాయ (రాశి ఖన్నా) ఏం చేస్తుంది ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది ? అనేది మీరు బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
ఒక మాటలో చెప్పాలంటే ఇది కొత్త కథ ఏమీ కాదు. సంతోషంగా గడుపుతున్న ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఒక దుష్ట ఆత్మను హీరో ఎలా అంతమొందించాడు అనే కాన్సెప్ట్ తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇదే డైరెక్టర్ హీరోగా చేసిన అరణ్మై సిరీస్ సినిమాలు కూడా దాదాపుగా ఇలాంటి కోవలోనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో కొత్తగా ఏమీ యాడ్ చేశారంటే దుష్టశక్తిని నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి ఒక దుష్ట శక్తి సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న కుటుంబాలను ఎలా నాశనం చేసింది? అసలు ఆ దుష్ట శక్తి ఏమిటి? అ దుష్ట శక్తి కారణంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. లాంటి విషయాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకులలో అనేక ప్రశ్నలను రేకెత్తించారు. ఇక ఇంటర్వెల్ సమయానికి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించి సెకండ్ హాఫ్ మొత్తం మరింత ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే సినిమాటిక్ లిబర్టీ అనుకున్నారో ఏమో చాలా వరకు లాజిక్స్ పక్కన పెట్టేసినట్లు అనిపించింది. అయితే ఓవరాల్ గా సినిమాలో చాలా కామెడీ ఎలిమెంట్స్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. లాజిక్స్ తీసి పక్కన పెడితే చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేసేటట్టు కొన్ని సీన్స్ రాసుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చాలా క్రింజ్ సీన్స్ ఇబ్బంది పెడతాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే దర్శకుడు హీరో కావడంతో రెండు విషయాల మీద ఫోకస్ చేయలేక పోయినట్లు అనిపించింది. అయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా నటించారు. తమన్నా మాత్రం సినిమాలో ఒక రేంజిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రాశి కన్నా పాత్ర కూడా పర్వాలేదు కానీ పెద్దగా నటించేస్కోప్ దక్కలేదు. కోవై సరళ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ వంటి వాళ్లు ఎప్పటిలాగే రెచ్చిపోయి కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. కేజిఎఫ్ గరుడ, జయప్రకాష్ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఆసక్తికరంగా ఉంది. వి ఎఫ్ ఎక్స్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. రొటీన్ స్టోరీ, కొన్ని క్రింజ్ కామెడీ సీన్స్ పక్కన పెడితే ఈ సినిమా అలరిస్తుంది.

ఫైనల్లీ బాక్ ఎ రొటీన్ హారర్ థ్రిల్లర్..కానీ అరణ్మై సిరీస్ ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ మూవీ.