Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Jai Krishna, Rasha Thadani, Mohan babu and Others
- DIRECTOR: Ajay Bhupathi
- MUSIC: GV Prakash
- PRODUCER: Gemini Kiran, Ashwini Dutt
ఘట్టమనేని కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించడమే కాక, మహేష్ బాబు సహా ఎంతో మంది టాలీవుడ్ హీరోలని పరిచయం చేసిన వైజయంతి మూవీస్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగమై ఉండటమే. దానికి తోడు అనిల్ తడాని, రవీనా టాండన్ కుమార్తె రాశా తడాని ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం కాబోతూ ఉండడంతో అసలు సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా కొంతవరకు వర్కౌట్ కావడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
శ్రీనివాస మంగాపురం రివ్యూ:
Also Read
పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) తిరుపతిలో ఓ పెద్దమనిషి. తన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే అతని కుమార్తె మంగ (రాశా)ను, అప్పుడే తిరుపతికి వచ్చిన (జై కృష్ణ) ప్రేమిస్తూ ఉంటాడు. అయితే మంగ అతన్ని ఏమాత్రం పట్టించుకోదు. ఎలా అయినా మంగను ప్రేమలో పడేయడానికి శ్రీను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి మంగను ఏడిపిస్తున్న సమయంలో శ్రీను, పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్) చేతికి చిక్కుతాడు. అతనికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక గ్యాంగ్ వారి మీద ఎటాక్ చేస్తుంది. అయితే తాను బుద్ధి చెప్పాలనుకున్న శ్రీను, సుబ్బారెడ్డిని కాపాడుతాడు. దీంతో శ్రీనుని పెద్దిరెడ్డి ఇంటికి పిలిపిస్తాడు. అయితే అసలు శ్రీను ఎవరు.? ఎందుకు మంగను ప్రేమించమని వెంటపడుతున్నాడు? అసలు ఈ కథలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
కథగా చూసుకుంటే ఇది కొత్త కథ ఏమీ కాదు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాలలో కనిపిస్తూ వస్తున్న ఒక లవ్ స్టోరీకి కొంత రివెంజ్ డ్రామా జోడించి ఈ కథ రాసుకున్నాడు అజయ్ భూపతి. కాకపోతే ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వారసుడిని దింపుతున్న క్రమంలో, పూర్తిస్థాయిలో కమర్షియల్ హంగులతో సినిమా మొత్తం నింపేశాడు. ఒకరకంగా చెప్పాలంటే కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమాని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ ప్రారంభమైన వెంటనే హీరో గాయపడటం, ఆ తరువాత హీరో హీరోయిన్ వెంటపడుతూ ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఉండడం ఆసక్తికరంగా చూపించారు. అలాగే హీరోయిన్ తండ్రిగా పెద్దిరెడ్డి పాత్రను పరిచయం చేసి ఫస్టాఫ్ అంతా సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే కథ నడిపించారు. సెకండ్ హాఫ్ వచ్చే వరకు కూడా అసలు కథ ఎటు వెళుతుంది అనే విషయం అర్థం కాకుండానే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు అజయ్ భూపతి.
అసలు హీరో హీరోయిన్ వెంట పడుతూ ఉండడంతో ఇదేదో రొటీన్ స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక ఇది కూడా చూసిన కథే అనిపిస్తుంది, కానీ కొంతవరకు ఊహకు అందకుండా కథ రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఈ సినిమా కథ ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ఎందుకంటే సినిమా కోసం ఎంచుకున్న లైన్ కొంతవరకు ప్రేక్షకులకు బాగా అలవాటైన లైన్ కావడం.
ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక దాదాపుగా కథ ఏమిటనేది ప్రేక్షకులకు ఈజీగానే అర్థమైపోతుంది. క్లైమాక్స్ కూడా ఇంకొంత పవర్‌ఫుల్‌గానూ లేదా ప్రేక్షకుల ఊహకు అందకుండా రాసుకుని ఉంటే బాగుండేది, కానీ దర్శకుడు ఎందుకు అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్లడం అనుకున్నాడో ఏమో ఆ ప్రయత్నం అయితే చేయలేదు. దీంతో ఈ సినిమా చూస్తున్నప్పుడు రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలగడం గమనర్హం.
నటీనటుల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రంగప్రవేశం చేస్తున్న ఘట్టమనేని జై కృష్ణకి ఇది ఒక మంచి లాంచింగ్ పాడ్ అని చెప్పాలి. పూర్తిస్థాయి కమర్షియల్ హీరోకి కావలసిన డాన్స్, యాక్షన్ తో పాటు ఎమోషన్స్‌ను సైతం అతను పండిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. డాన్సులు సైతం బాగా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ రాశా కూడా తన పాత్ర వరకు న్యాయం చేసింది. ఒకపక్క అందంతో ఆకట్టుకుంటూనే మరొకపక్క అభినయంతో సైతం ఆమె తనదైన శైలిలో నటించింది.
ఇక మోహన్ బాబు స్క్రీన్ మీద కనిపించినంత సేపు మ్యాజిక్ చేశాడు. అలానే కిక్ శ్యామ్, వాసుకి, శ్రీ తేజ్, అజయ్, కిల్లి క్రాంతి, వడ్లమాని శ్రీనివాస్, బ్రహ్మాజీ వంటి వాళ్లు ఆకట్టుకున్నారు. నరేష్ పాత్ర ఈ సినిమాలో కనిపించిన ప్రతిసారి నవ్వించింది.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. అజయ్ భూపతి దర్శకుడిగా కొంతవరకు పర్వాలేదు అనిపించుకున్నా, ఎందుకో డైలాగ్స్ కొత్తగా ఏమీ అనిపించలేదు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. జీవి ప్రకాష్ పాటల కన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిట్ టేబుల్ మీద మరింత క్రిస్పీగా కట్ చేసుకుని ఉండొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రియల్ లొకేషన్స్‌లో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా షూట్ చేసినట్లు అనిపించింది.
ఓవరాల్‌గా, ‘శ్రీనివాస మంగాపురం’ ఒక రొటీన్ కమర్షియల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!