Sharathulu Varthisthai Review: షరతులు వర్తిస్తాయి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు
- DIRECTOR: కుమారస్వామి (అక్షర)
- MUSIC: అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
- PRODUCER: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
Sharathulu Varthisthai Movie Review: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, కీడా కోలా సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ఆయన షరతులు వర్తిస్తాయి అనే సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నపుడు ఈ షరతులు వర్తిస్తాయి లాంటి పదాలు వింటూ ఉంటాం. ఇక అలా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.
కథేంటంటే..
ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి(చైతన్య రావు) నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన పడతాయి. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ చెల్లి, తమ్ముడిని చదివించడానికి కష్టపడుతూ ఉంటాడు. మరోపక్క తన చిన్ననాటి స్నేహితురాలు విజయశాంతి అలియాస్ విజయ(భూమి శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. కష్టకాలం అనుకున్నప్పుడు ఆర్థిక సహాయం చేసి అతనికి తోడుగా నిలిచే ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక చైన్ మార్కెటింగ్ లో ఆ ఏరియా లీడర్ డబ్బు పెట్టమనడంతో చిరంజీవి డబ్బు కట్టి మరో నలుగురిని జాయిన్ చేయిస్తాడు. చిరంజీవికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్ కోసం డబ్బులు కట్టగా రాత్రికి రాత్రే ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. అయితే ఈ క్రమంలో చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు కట్టిన విజయశాంతి ఏం చేసింది? అసలు ఈ డబ్బు కొట్టేసింది ఎవరు? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
Also Read
విశ్లషణ: ముందు నుంచి ప్రమోషన్స్‌లో యూనిట్ చెప్పినట్లుగానే షరతులు వర్తిస్తాయి మధ్యతరగతి కుటుంబాల తీరు, అత్యాశకి పోయి ఇబ్బందులు పడుతూన్న తీరు కళ్ళకు కట్టినట్టు చూపారు. నిజానికి సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. చైన్ మార్కెట్ మోసాలు అనేవి అనునిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటిది మన కుటుంబానికే ఆ సమస్య ఎదురైతే ఏమిటి పరిస్థితి అని ఆలోచనలో పడేసేలా సినిమా ఉంది. డబ్బు ఆశ చూపించి మోసం చేసేందుకు మిడిల్ క్లాస్ వాళ్లను కంపెనీలు ఎలా టార్గెట్ చేస్తాయో సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపారు. కూడబెట్టిన డబ్బు పోగొట్టుకుని కుటుంబాలు పడే బాధను కళ్ళ ముందుకు తెచ్చారు. ఫస్టాఫ్ లో చిరంజీవి, విజయ లవ్ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిస్ క్లాస్ ఫ్యామిలీల కష్టాలని చూపి పెళ్లి తర్వాత అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలతో కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. ఇక అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్ది చెప్పుకోలేక పడే తంటాలు పెళ్ళైన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్ సీన్ కాస్త ఎమోషనల్ అనిపిస్తూనే ఉంటూనే సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. సెకండాఫ్ లో కథ ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. అయితే క్లైమాక్స్ రొటీన్ ఇంకా బాగా రాసుకోవచ్చనిపించేలా ఉంది.
నటీనముల విషయానికి వస్తే మధ్యతరగతి మధ్య వయస్కుడు చిరంజీవి అనే పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. వన్ మ్యాన్ షోలాగా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. మిడిల్ క్లాస్ అమ్మాయిగా, భార్యగా భూమి శెట్టి ఆకట్టుకుంది. నంద కిషోర్, వెంకీ, పెద్దింటి అశోక్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, నేచురల్‌గా అనిపించింది. నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉన్నా పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. కాస్త మలయాళ, తమిళ నాన్ కమర్షియల్ సినిమాల ఫ్లేవర్ లో సినిమా సాగింది.
ఫైనల్ గా షరతులు వర్తిస్తాయి మధ్యతరగతి కుటుంబాల కథ, రొటీన్ కమర్షియల్ హంగులు లేని సినిమా కావడంతో అందరికీ నచ్చకపోవచ్చు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్‌నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!