Rao Bahadur Review : రావు బహదూర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Satyadev, Vikas Muppala, Deepa Thomas and others
- DIRECTOR: Venkatesh Maha
- MUSIC: Smaran Sai
- PRODUCER: Anurag, Sharath, Gopala Krihsna Reddy
మహేష్ బాబు సమర్పణలో, సత్యదేవ్ హీరోగా, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రావు బహదూర్’. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్, టీజర్ వంటి కంటెంట్ బయటికి వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. ఎట్టకేలకు ఈ సినిమా జూలై మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసుకున్న ఈ సినిమా, ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రావు బహదూర్ కథ:
రావు బహదూర్ రామప్ప (సత్యదేవ్) భువనం రాజ కుటుంబానికి చెందిన వారసుడు. డాక్టర్లు లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని చెప్పినా కూడా, వారి మేధస్సుని చాలెంజ్ చేస్తూ అతను బతికేస్తూ ఉంటాడు. అయితే అతని స్నేహితుడైన డాక్టర్ (వికాస్ ముప్పాల) అనునిత్యం రామప్పని కనిపెట్టుకుంటూ ఉంటాడు. జీవిత చరమాంకంలో కృష్ణా రామా అనుకుంటూ ఉండాల్సిన రామప్ప మాత్రం, తనను వేధిస్తున్న తన చిన్న కొడుకు కుసుమప్ప గురించి తన డాక్టర్ స్నేహితుడికి చెప్పి బాధపడుతూ ఉంటాడు.
Also Read
అయితే రామప్ప చిన్న కొడుకు కుసుమప్పకు ఏమైంది? అతని వల్ల రామప్ప ఎందుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు? చివరికి డాక్టర్ స్నేహితుడి వల్ల రామప్ప తన ఇబ్బందుల నుంచి బయటపడ్డాడా? చివరికి ఏం జరిగింది? అసలు రామప్పను వేధిస్తున్న సమస్యలు ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో బాలకృష్ణ “ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం మాత్రమే కాదు.. పగ! పగ కూడా మనిషిని బతికిస్తుంది” అంటూ ఒక డైలాగ్ చెబుతాడు. సరిగ్గా ఈ సినిమాలో కూడా పగ కాదు కానీ, అనుమానం లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్న మనిషిని బతికిస్తుంది, ఎన్నో మిరాకిల్స్ చేస్తుంది. నిజానికి ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించిన విధంగానే, “అనుమానం పెనుభూతం” అంటూ అనుమానం చుట్టూనే ఈ సినిమా కథ రాసుకున్నాడు వెంకటేష్ మహా.
వాస్తవానికి ఈరోజుల్లో ఏ పేపర్ ఓపెన్ చేసినా, లేదా వెబ్సైట్ ఓపెన్ చేసినా, అంతెందుకు ఏ టీవీలోనో వచ్చే వార్తలను చూసుకున్నా సరే.. ప్రతి 10 వార్తలలో ఒక వార్త అక్రమ సంబంధానికి సంబంధించిందే ఉంటుంది. నిజానికి అక్రమ సంబంధాలు ఉంటున్నాయో, లేక ఉంటున్నాయని భర్తలకు, భార్యలకు అనుమానాలు కలుగుతున్నాయో తెలియదు కానీ, వాటి వల్ల క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ సంఘటన నుంచి ప్రేరణ పొంది ఈ కథ రాసుకున్నట్టు అనిపిస్తుంది.
నిజానికి ఫస్టాఫ్ అంతా సాగిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం అర్థం కావడానికి ఫస్టాఫ్ విరామం వరకు సమయం పడుతుంది. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలైందో, కథనంలో వేగం పెరుగుతుంది. అసలు తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం మీద కొంతవరకు ప్రేక్షకులకు అవగాహన ఏర్పడుతుంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే, సినిమా మొత్తం కూడా చివరి 45 నిమిషాల్లోనే అర్థమయ్యేలా వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అప్పటివరకు ఫస్టాఫ్‌లో జరిగిన విషయాలకు సెకండాఫ్‌లో సెటప్ ఇవ్వడం కాస్త ఆసక్తికర అంశం.
అయితే మహేష్ బాబు రివ్యూ, సుకుమార్ ప్రశంసలు చూసి భారీ అంచనాలతో థియేటర్లకు వెళితే మాత్రం కొంతవరకు నిరాశ తప్పదు.
కానీ ఎలాంటి ఆలోచనలు లేకుండా థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఒకరకంగా ఇది సైకలాజికల్ డ్రామా అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన కుమారుడి జననం మీద ఉన్న అనుమానంతో ఒక రాచరికపు వాసనలతో ఉన్న వ్యక్తి ఏం చేశాడు, చివరికి అతని జీవితం ఎలా మారిపోయింది లాంటి విషయాలను చూపించిన తీరు బాగుంది. అలాగే రంగు, కులం గురించి రాసుకున్న డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని, 60ల కాలం నుంచి 2020ల కాలం వరకు మనిషి రిలేట్ అయ్యేలా వెంకటేష్ మహా డైలాగ్స్ ఉన్నాయి అనడంలో సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే, సత్యదేవ్ ఇప్పటికే నటుడిగా పూర్తిస్థాయిలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి మరోసారి తనలోని నటుడిని సంతృప్తి పరిచే అవకాశం ఇచ్చిన సినిమాగా నిలుస్తుంది. యుక్త వయసు నుంచి వృద్ధాప్యపు ఛాయలు వచ్చేవరకు, వివిధ వయసులలో అతని ట్రాన్స్ఫర్మేషన్ సూట్ అయ్యేలా ఉంది. హీరోయిన్ దీప థామస్‌కి స్క్రీన్ స్పేస్ ఉన్నది తక్కువే అయినా, ఉన్నంతలో ఆమె తన వైపు చూపు తిప్పుకోకుండా నటించడంలో సక్సెస్ అయ్యింది.
ఇక సత్యదేవ్ స్నేహితుడి పాత్రలో నటించిన వికాస్ ముప్పాల గతంలో కొన్ని తెలుగు సినిమాలలో నటించినా, ఇది అతనికి పూర్తిస్థాయి గుర్తింపు తీసుకొచ్చే పాత్రగా నిలిచిపోతుంది. అలాగే పనిమనిషి పాత్రధారి కూడా స్క్రీన్‌లో మెరిసింది. ఇక సత్యదేవ్ పెద్ద కుమారుడు పాత్రధారితో పాటు, చిన్న కుమారుడు పాత్రధారికి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది; వారికి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది.
ఇక టెక్నికల్‌గా మాట్లాడాలంటే, ఈ సినిమా టెక్నికల్‌గా చాలా బాగుంది. ఒకపక్క సంగీతంతో పాటు, మరోపక్క నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరింది. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, విజువల్స్ చాలా న్యాచురల్‌గా అనిపించేలా చూపించారు. ఇక సత్యదేవ్ సహా మిగతా వాళ్ళ కాస్ట్యూమ్స్ అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేసిన తీరు బాగుంది. అయితే నిడివి విషయంలో ఇంకా కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా.. టాలీవుడ్లో ఇప్పటివరకు ట్రై చేయని రియలిజం మ్యాజిక్‌తో కూడిన, ఒక ఎంగేజింగ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు