Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Allari naresh, Surabhi, Vishnu priya, Rashi Singh, Prisha Singh and others
- DIRECTOR: Chandra Mohan
- MUSIC: Chaitan Bharadwaj
- PRODUCER: Annapurna Studios- Razesh Danda
అల్లరి నరేష్ హీరోగా, సురభి హీరోయిన్గా ‘రంభ ఊర్వశి మేనక’ అనే సినిమా రూపొందింది. ఇందులో రంభ, ఊర్వశి, మేనకలుగా రాశీ సింగ్, త్రిష సింగ్, విష్ణుప్రియ భీమినేని నటించడంతో ఒక్కసారిగా ఈ సినిమా మీద అందరి దృష్టి పడింది. రంభ, ఊర్వశి, మేనకలు భూమికి దిగివస్తే తానే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో హీరోని అంటూ అల్లరి నరేష్ చేసిన ప్రమోషన్స్ కూడా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? అల్లరి నరేష్‌కి ఈ సినిమా హిట్ ఇచ్చిందా లేదా? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రంభ ఊర్వశి మేనక కథ
రాజమండ్రిలో ఉండే సూరిబాబు (అల్లరి నరేష్) తండ్రి హీరో కావాలని కలలు కని, కాలేక కనీసం నాటకాలలోనైనా పేరు తెచ్చుకోవాలని ఒక డ్రామా కంపెనీ మొదలుపెట్టి విజయవంతంగా నడుపుతూ ఉంటాడు. ఇక తన తండ్రి కాలేకపోయిన హీరో తానవుతానంటూ అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచే హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. వీరి ఫ్యామిలీకి ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్ మీద సరైన ప్యాటర్న్ గీస్తే రంభ, ఊర్వశి, మేనక దిగివస్తారని, అడిగిన వరాలు ఇస్తారని తన బాబాయ్ సీనియర్ నరేష్ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకుని, ఏ పనీ చేయకుండా ఆ బుక్ మీద ప్యాటర్న్స్ గీస్తూనే ఉంటాడు సూరిబాబు. తాను చిన్నప్పటి నుంచి ఇష్టపడే చిన్ని (సురభి) అదే ఊరిలో ఉన్న అనాథాశ్రమానికి టీచర్‌గా వచ్చిందని తెలుసుకుని ఆనందపడి, ఆమెతో ప్రేమలో పడగా ఆ ఊరి ఎస్సై ఇతని అప్పుల గురించి చిన్ని తండ్రికి చెప్పి వీరిద్దరి రిలేషన్‌కు అడ్డుగా నిలుస్తాడు. అప్పులు తీరితేనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టడంతో, సూరిబాబు ఆ పని మీద ఉండగానే పదేళ్లుగా తీవ్రమైన ఒక వ్యాధితో బాధపడుతున్న తన తల్లి హాస్పిటల్ పాలవుతుంది. ఆమెకు ఆపరేషన్ చేయించాలన్నా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉండగా ఒక ప్యాటర్న్ కనెక్ట్ అయ్యి రంభ, ఊర్వశి, మేనక భూమికి దిగివస్తారు. వారు వచ్చిన తర్వాత ఏమైంది? సూరిబాబు కష్టాలన్నీ తాను దేవతలుగా భావించే రంభ, ఊర్వశి, మేనక తీర్చారా లేదా? అసలు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
అల్లరి నరేష్ సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ సినిమాలు ఎప్పుడు చేస్తాడని అడుగుతారు, కామెడీ సినిమాలు చేస్తే మళ్లీ సీరియస్ ఎప్పుడు చేస్తాడని అడుగుతూ ఉంటారు. కానీ ఆయన నమ్మి ఒక కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇది ఓవరాల్‌గా చూసుకుంటే కథ ఇప్పటి కథలాగా అనిపించలేదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని లాజికల్‌గా ఆలోచించి సినిమాలు చూస్తున్న నేటి ఓటీటీ యుగంలో లాజిక్స్‌కి అందకుండా ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు.
అయితే నిజానికి ముందుగానే, “మా సినిమా లాజిక్స్‌తో చూడకండి, ఓన్లీ అల్లరి నరేష్ నవ్వుల మ్యాజికే చూడండి” అంటూ సినిమా టీం ప్రమోట్ చేసింది. ఈ రోజుల్లో ఏదో అద్భుతమైన సిచువేషనల్ కామెడీ ఉంటే తప్ప ప్రేక్షకులు కథతో ఏర్పడుతున్న కామెడీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ ఈ సినిమా చూసుకున్నప్పుడు అల్లరి నరేష్‌తో పాటుగా సీనియర్ నరేష్, శ్రీనివాసరెడ్డి కామెడీ ట్రాక్స్ కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడా వీరు చేస్తున్న సిచువేషనల్ కామెడీ వర్కౌట్ అయింది కానీ, అల్లరి నరేష్ హోమ్ గ్రౌండ్ రీఎంట్రీ అన్నట్లుగా చేసిన ప్రచారం ఈ సినిమాకి కొంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చాయి.
అయితే మరీ అంత బాలేదా అంటే అలా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కొన్నిచోట్ల ప్రేక్షకులను నమ్మించేలా ఉన్నా, కొన్నిచోట్ల మాత్రం కథ విషయంలో ఇంకా సీరియస్‌గా రాసుకుని ఉండాల్సింది.
సినిమా అంటేనే ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అని ప్రేక్షకులందరూ నమ్ముతారు, కానీ కొంతవరకైనా లాజిక్స్ ఉండేలా చూసుకుని ఉంటే బాగుండేది. సోషియో ఫాంటసీ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి, దీన్ని కూడా ఒకరకంగా వాటి ప్రేరణతోనే రాసుకున్నట్లు అనిపించింది. ముఖ్యంగా దర్శకుడి మీద ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి వంటి వారి ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. అయితే కామెడీ నుంచి కూడా ఇంకేదో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ తరుణంలో ఈ సినిమా కొన్నిచోట్ల నవ్వించగలిగింది కానీ, పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయింది. అయితే చివరిగా వచ్చిన మదర్ సెంటిమెంట్ కొంతవరకు సినిమాకు కలిసి వచ్చింది.
ఇక ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే, అల్లరి నరేష్‌కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. ఎక్కడా తగ్గకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక వి.కె. నరేష్ కూడా ఈ మధ్య ఇలాంటి తరహా పాత్రలు ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా పెద్దగా కష్టపడ్డాడు అనిపించలేదు. ఇక సురభి పాత్ర చాలా పరిమితం, ఆమెకు నటించే అంత స్కోప్ కూడా దొరకలేదు. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురూ అందంతో ఆకట్టుకున్నారు; ముఖ్యంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అయితే ఇరగదీశారు అని చెప్పాలి. ఇక వెన్నెల కిశోర్, హరితేజ, తారక్ పొన్నప్ప వంటి వాళ్లు ఈ సినిమాలో తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం బావుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా మంచి ప్లజెంట్ ఫీల్ తీసుకువచ్చేలా ఉంది.
ఇక ఫైనల్‌గా ‘రంభ ఊర్వశి మేనక’.. లిమిటెడ్ కామెడీ ఎంటర్టైనర్!
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!