Rakasa Review: రాకాస రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Sangeet Sobhan, Nayan Sarika, Getup Srinu and Others
- DIRECTOR: Manasa Sharma
- MUSIC: Anudeep Dev
- PRODUCER: Niharika
నిహారిక నిర్మాతగా మారి చేసిన రెండవ సినిమా ‘రాకాస’. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు సంగీత్ శోభన్ హీరోగా, పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నయన్ సారిక హీరోయిన్‌గా ఈ సినిమాని మానస శర్మ డైరెక్ట్ చేశారు. ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి విపరీతంగా దూసుకువెళ్లిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రాకాస కథ
వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి తన ప్రేయసి (రాధ్య)ని వివాహం చేసుకోవడం కోసం తమ సొంత ఊరికి వస్తాడు. అయితే ఆమె మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటుంది అన్న విషయం తెలిసి, కొన్నాళ్లు తన కుటుంబంతో గడిపి వెళ్లిపోవాలని భావిస్తాడు. అయితే అనుకోకుండా ఆ ఊరి పెద్ద ఒక గొడవ కారణంగా అతని పాస్ పోర్ట్ లాక్కోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే అనూహ్యంగా ఆ ఊరి వారంతా కలిసి అతన్ని, ఆ ఊరి కోటలో ఉన్నాడని భావిస్తున్న బ్రహ్మ రాక్షసుడికి బలిగా పంపిస్తారు. అసలు ఆ ఊరి కోటలో బ్రహ్మ రాక్షసుడు ఎందుకు ఉన్నాడు? లోపలికి వెళ్లిన వీరబాబు రాక్షసుడికి బలయ్యాడా? ఈ కథలో వీరబాబు స్నేహితుడు గెటప్ శ్రీను, వీరబాబు చిన్ననాటి స్నేహితురాలు నయన్ సారిక పాత్రలేమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
నిజానికి తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ దయ్యాలకు సంబంధించిన కథలు లేదా ప్రేతాత్మలకు సంబంధించిన కథలు చెప్పడానికి మేకర్స్ ఎక్కువగా తాపత్రయ పడుతుంటారు. కానీ మానస శర్మ మాత్రం తెలివిగా ఒక బ్రహ్మ రాక్షసుడు చుట్టూ కథ రాసింది. నిజానికి మనం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చందమామ కథల్లో, బాలమిత్ర కథల్లో ఇలా బ్రహ్మ రాక్షసుల గురించి, రాక్షసుల గురించి ఎన్నో కథలు విన్నాం. అలాగే చిన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పే ఎన్నో కథలు విన్నాం. అలాంటి కథలను సినిమాగా చెప్పాలనుకుంటే ఎలా అని ఆసక్తికరమైన రీసెర్చ్ చేసి మానస శర్మ ఈ సినిమా చేసినట్లు అనిపించింది.
సింపుల్ గా చెప్పాలంటే, అనుకోకుండా ఊరికి వచ్చిన ఒక కుర్రాడు, ఆ ఊరి వారందరూ బ్రహ్మ రాక్షసుడు అని భయపడుతున్న ఓ పీడను ఎలా తొలగించాడు అనేదే లైన్. దాన్ని దర్శకురాలు తెలివిగా రాసుకున్నారు. ఒక కోట, కోటలో బ్రహ్మ రాక్షసుడు, అతన్ని చూసి ఊరంతా భయపడటం, సిగ్నల్ వచ్చినప్పుడు అతనికి జంతువులతో పాటు ఒక మనిషిని కూడా బలి ఇవ్వడం లాంటి అంశాలు మనం చిన్నప్పటి నుంచి వినే కథల్లాగానే అనిపించినా, ఫస్టాఫ్ కథలోకి తీసుకువెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఎప్పుడైతే సంగీత్ శోభన్ కోటలోకి ఎంటర్ అవుతాడో, అప్పటి నుంచి సినిమా ఒక రేంజ్ లో ప్రేక్షకులను నవ్వించేలా మానస శర్మ రాసుకుంది. ఆమె రాసుకున్న రాతల కంటే వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్ తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎక్కువగా నవ్వించారని చెప్పొచ్చు. ఒక పక్కన బ్రహ్మ రాక్షసుడు లాంటి ఒక భారీ ఆకారాన్ని నిలబెట్టి, మరో పక్క వీరితో కామెడీ చేయించడం కత్తి మీద సామే అయినా, దాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పొచ్చు.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఇప్పటికే తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తనదైన కామెడీ ఎక్స్‌ప్రెషన్స్‌తో జీవించేశాడు. ఇక ఈ సినిమాలో సంగీత్ తర్వాత అంతగా నవ్వించింది గెటప్ శ్రీను అలాగే వెన్నెల కిషోర్ అనే చెప్పాలి. వారిద్దరూ తమదైన శైలిలో నవ్విస్తూ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించారు. నయన్ సారిక పాత్ర పరిమితంగా ఉన్నా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, దర్శకురాలిగా మానస ఫుల్ మార్క్స్ కొట్టేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కామెడీ చేయిస్తూనే భయపెడుతూ ఆకట్టుకున్నారు. డైలాగ్స్ పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. ఇక సంగీతం పెద్దగా క్యాచీగా లేకపోయినా, సినిమాకి తగ్గట్టుగా నేపథ్య సంగీతం అయితే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా నిడివి కూడా సరిపడా ఉంది. నిహారిక తన నిర్మాణ విలువలతో మరోసారి కచ్చితంగా వార్తల్లోకి ఎక్కడం ఖాయం.
ఫైనల్ వర్డిక్ట్: ఈ ‘రాకాస’ భయపెడుతూనే నవ్విస్తుంది. ముఖ్యంగా అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పే కథలు మిస్ అవుతున్న పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?