Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Nenu Meeku Baaga Kavalsinavaadini Review

Nenu Meeku Baaga Kavalsinavaadini Review : నేను మీకు బాగా కావలసినవాడిని! రివ్యూ

Published Date :September 16, 2022 , 12:45 pm
By Subbarao N
Nenu Meeku Baaga Kavalsinavaadini Review : నేను మీకు బాగా కావలసినవాడిని! రివ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2 / 5

  • MAIN CAST: Kiran Abbavaram, Sanjana Anand, and Sonu Thakur
  • DIRECTOR: Sridhar Gade
  • MUSIC: Mani Sharma
  • PRODUCER: Kodi Divya Deepthi

‘రాజావారు రాణివారు’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత శ్రీధర్ గాదె దర్శకత్వంలో నటించిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. దాంతో వారిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘నేను మీకు బాగా కావలసిన వాడిని’ చిత్రంపైనా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ కావలసినవాడి కథ విషయానికి వస్తే – కాసేప‌ట్లో పెళ్ళి అన‌గా పెళ్ళికూతురు లేచిపోతుంది. దాంతో ఆమె తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తుంది. వేరే ఊరు చేరిన హీరోయిన్ ఆ త‌రువాత పురుష ద్వేషిగా మారి తాగుడుకి బానిస అవుతుంది. ఓ సారి పబ్ ఓ ఆక‌తాయి ఆమెను టీజ్ చేస్తాడు. వాడితో గొడ‌వ‌ప‌డుతుంది. ఆపై క్యాబ్ డ్రైవ‌ర్ వ‌చ్చి ఆమెను త‌న కారులో తీసుకువెళ‌తాడు. మధ్యలో ఆక‌తాయిగాడు మ‌ళ్ళీ ఆమెను ప‌ట్టుకోబోతే డ్రైవ‌ర్ ర‌క్షిస్తాడు. ఆ లేచిపోయిన అమ్మాయి హీరోయిన్, అమ్మాయిని కాపాడిన డ్రైవ‌ర్ హీరో. ఆ తర్వాత ఒక‌రికొక‌రు త‌మ తమ క‌థ‌లు చెప్పుకుంటారు. ప్రేమించిన వాడు మోసం చేశాడ‌ని ఆమె తన క‌థ చెబుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి అన్నా అని పిలిచి తను ప్రేమించిన వాడిని చేసుకుని వెళ్ళి పోయింద‌ని అత‌ను చెబుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కు న‌చ్చ చెప్పి క‌న్నవారి ద‌గ్గర‌కు వెళ్ళమ‌ని, ఆదరిస్తారని చెబుతాడు. అందుకు అంగీక‌రించిన ఆమెను త‌న కారులోనే దించుతాడు. ఈ నేపథ్యంలో ఒక‌రిపై ఒక‌రికి అభిమానం పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళు ఆద‌రించారని పొంగిపోయి దీనంత‌టికీ కార‌ణమైన హీరోను కలసి ఓ విషయం చెప్పాలని అంటోంది. అత‌నిపై త‌న ప్రేమ‌ను వ్యక్తం చేయాలనుకుంటుంది. అప్పుడే హీరో ఓ విష‌యం రివీల్ చేస్తాడు. అదేమిటి? హీరోయిన్ హీరోకి ఏం చెప్పాలనుకుంటుంది? చివరికి ఏం జరిగిందన్నది ఈ సినిమా.

నటీనటులు విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం తన పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించారు. సంజ‌నా ఆనంద్ ప‌ర‌వాలేద‌నిపించింది. మిగ‌గిలిన పాత్రధారులు త‌మ ప‌రిధి మేర‌కు న‌టించారు. మణిశర్మ బాణీలు మాత్రం ఈ చిత్రానికి బ‌లాన్నిచ్చాయి. నేపథ్యం సంగీతం కూడా బలం చేకూర్చిందనే చెప్పవచ్చు. ప్రథ‌మార్ధంలో హీరో పాత్ర నిడివి చాలా త‌క్కువ‌. క‌థ కూడా స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంది. ద్వితీయార్ధం ఊపందుకున్నా పాత చింత‌కాయ వాస‌నే త‌గులుతుంది. టోట‌ల్ గా క‌థ‌ను పరికించి చూస్తే కృష్ణవంశీ తెర‌కెక్కించిన `శ‌శిరేఖా ప‌రిణ‌యం` గుర్తుకు రాక‌మాన‌దు. కోడిరామకృష్ణ కుమార్తె దీప్తి నిర్మాతగా మారి తీసిన ఈ సినిమా నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. మణిశర్మ పాటల్లో ఐట‌మ్ సాంగ్ మిన‌హా అన్నీ అల‌రించాయి. ‘మ‌న‌సే చిల‌క‌లా…’, ‘మ‌న‌సొక మాట అంది…’, ‘రా… లాయ‌ర్ పోరీ…’, ‘న‌చ్చావ‌బ్బాయి…’ అంటూ సాగే పాట‌లు, వాటి చిత్రీకరణ ఆక‌ట్టుకుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మ‌ణిశ‌ర్మ సంగీతం లేక‌పోతే సినిమాగా చెప్పుకునేది ఏమీలేద‌నే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
– ఆక‌ట్టుకొనే మ‌ణిశ‌ర్మ సంగీతం
– క్లయిమాక్స్ ట్విస్ట్
– నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్:
– కొత్తద‌నం లేని క‌థ‌, క‌థ‌నం
– అల‌రించ‌ని స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు
– ఆక‌ట్టుకోలేక పోయిన పాత్రౌచిత్యం

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్: ఏమాత్రం కావలసినవాడు కాదు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kiran Abbavaram
  • Nenu Meeku Baaga Kavalsinavaadini Rating
  • Nenu Meeku Baaga Kavalsinavaadini Review
  • Sanjana Anand
  • Sridhar Gade

తాజావార్తలు

  • Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

  • US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..

  • Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions