Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..
- మామిడి పండ్ల సీజన్ మొదలైంది
- నిషేధిత రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను కృత్రిమంగా పండిస్తున్నారు
- హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం వచ్చేసింది. మామిడి పండ్ల సీజన్ మొదలైంది. రుచికరమైన, తీపి మామిడి పండ్లు అందరికీ ఇష్టం. కానీ హైదరాబాద్ మార్కెట్లలో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు కాల్షియం కార్బైడ్ (CaC₂) వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇలాంటి పండ్లు బయట నుంచి నిగనిగలాడుతూ, ఆకర్షణీయంగా కనిపించినా, లోపల పచ్చిగా ఉండి ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయి.
Also Read:Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాం పై హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడిపండ్లను “ఇథలీన్” (Ethylene) అనే రసాయనంతో కృత్రిమంగా మక్కపెడుతున్నారనే సమాచారంతో ఈ రైడ్ చేపట్టినట్లు హెచ్ ఫాస్ట్ సీఐ రంజిత్ తెలిపారు. దాడుల్లో మొత్తం సుమారు 7 టన్నుల మామిడిపండ్లు గుర్తించారు. ఈ పండ్లను బాటాసింగారం మార్కెట్ నుండి కొనుగోలు చేసి, గోదాంలో నిల్వ ఉంచి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో గోదాం నిర్వాహకులు జమీల్, ఫరీద్‌పై కేసు నమోదు చేసి, గోదామును సీజ్ చేశారు. దాడుల సమయంలో సుమారు 350 ట్రేలను పోలీసులు గుర్తించారు. ఒక్కో ట్రేలో దాదాపు 20 కిలోల పండ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్ పుర, లాల్ దర్వాజా ప్రాంతాలలో చార్మినార్ టాస్క్ ఫోర్స్ జోన్ పోలీసుల దాడులు నిర్వహించారు. ప్రమాదకరమైన కెమికల్స్ తో మామిడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాములపై దాడులు చేసి టన్నులకొద్ది మామిడిపండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మామిడి కాయలను కేవలం 5 రోజుల్లోనే పండ్లు గా మారుస్తున్న నిర్వాహకులు.. ఇథనాల్ ను 10 కిలోల మామిడి కాయలు ఉండే ట్రే లో కేవలం 2 ఇథనాల్ ప్యాకెట్స్ ఉంచాలి. అది కూడా కాంటాక్ట్ లెస్ గా.. కానీ.. ఒక్కో ట్రే లో 7, 8 ఇథనాల్ ప్యాకెట్లు.. అది కూడా నేరుగా ఉంచుతున్నారు. ప్యాకెట్ నుంచి వెలువడే హానికర గ్యాస్ ద్వారా కేవలం మూడు రోజుల్లోనే కాయ పూర్తిగా మగ్గుతోంది. ఈ మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.. పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది.
Also Read:Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
కల్తీ మామిడిని ఎలా గుర్తించాలి
రంగు: సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు. ఆకుపచ్చ + పసుపు మిశ్రమం ఉంటుంది. కల్తీ పండు పైన ఏకరీతి పసుపు-పచ్చగా, లోపల పచ్చిగా ఉంటుంది.
వాసన: సహజ పండుకు తీపి, సువాసన ఉంటుంది. కల్తీ పండుకు వాసన తక్కువ లేదా రసాయన వాసన వస్తుంది.
నీటి పరీక్ష: ఒక బకెట్ నీటిలో వేయండి. సహజ పండు బరువుగా మునుగుతుంది. కల్తీ పండు తేలికగా తేలుతుంది.
ముట్టుకోవడం: కల్తీ పండ్లు త్వరగా మెత్తబడతాయి లేదా బ్లాక్ స్పాట్స్ వస్తాయి. చర్మం మీద బర్న్ లాంటి మచ్చలు కనిపించవచ్చు.
రుచి: లోపల తీపి తక్కువగా, పచ్చి రుచి ఉంటుంది.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?