Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్
- అనంతపురం జిల్లాలో హాట్ హాట్‌గా చెప్పుల పాలిటిక్స్..
- ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మనసుల్లో ఏముందన్న చర్చలు..
- ఎన్నికలకు ముందు పార్టీ మారిన కొందరు కేతిరెడ్డి అనుచరులు..
- వాళ్లని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే చెప్పుతో కొడతానన్న కేతిరెడ్డి..
- తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ఘాటు వ్యాఖ్యలు..
- సస్పెండ్ అయిన వాళ్లని వెంటేసుకుని తిరిగితే చెప్పుతో కొట్టాలన్న తోపుదుర్తి..
- ఎన్నికల తర్వాత రాప్తాడుకు చెందిన కొందరు వైసీపీ నేతలు సస్పెండ్..
- మాజీలు ఇద్దరూ ఎవర్ని ఉద్దేశించి అలా అన్నారంటూ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పార్టీలో లబ్ది పొంది.. స్వార్థం కోసం ఇంకో చోటికి వెళ్లిపోయి మళ్లీ వస్తామంటే కుదరదు. అలాంటి వాళ్ళని చెప్పు తెగేలా కొడతా…… ఇదీ ఒక మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్. పార్టీలో ఉంటూ నమ్మకం ద్రోహం చేసిన వారిని సస్పెండ్ చేశాం. అలాంటి వారిని వెంటేసుకుని తిరిగే నాయకులను దేంతోకొట్టాలి? వెంటాడి చెప్పు తిరిగేసి కొట్టాలి కదా….? ఇదీ ఇంకో మాజీ ఎమ్మెల్యే సీరియస్ వాయిస్. ఉమ్మడి అనంతపురం పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ ఇద్దరు నాయకులు ఎవర్ని ఉద్దేశించి అలా అంటున్నారు? అసలు వాళ్ళ మనసుల్లో ఏముందంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలు మారడాలు, తిరిగి రావడాలు కామన్ అయినా… ఇద్దరు నేతలు ఎందుకింత సీరియస్ అవుతున్నారు, పర్సనల్‌గా తీసుకుంటున్నారంటూ క్వశ్చన్‌మార్క్ ఫేస్‌లు పెట్టేవాళ్ళు అనంత పాలిటిక్స్‌లో పెరుగుతున్నారు. ఇక విషయానికి వస్తే…. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతోపాటే అంటకాగి… ఆర్థికంగా బలపడి, రాజకీయంగా ఎదిగారట కొందరు.
Read Also: Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..
Also Read
కానీ… సరిగ్గా 2024 ఎన్నికల ముందు వాళ్ళు కేతిరెడ్డికి ఝలక్ ఇచ్చి పార్టీ మారిపోయారు. అది ఆయనకు బాగా హార్టింగ్‌గా అనిపించిందట. అందుకే… తమ స్వార్థం కోసం వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ఇకపై వైసీపీలోకి నో ఏంట్రీ బోర్డ్ పెట్టేశామని ప్రకటించారాయన. అలాంటి వాళ్ళు మళ్లీ రావాలని చూసినా.. వాళ్ళను తీసుకొచ్చేందుకు ఎవరైనా ప్రయత్నించినా….. నా ఇంటి గేటు ముందే చెప్పుతో కొడతానంటూ సీరియస్ కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అయితే…. అది పాత వ్యవహారం. తాజాగా సర్పంచుల సన్మాన సభలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంతకంటే ఘాటుగా కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో నాకు ద్రోహం చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాం. ఇప్పుడు అలాంటి వారిని వెంటేసుకుని తిరుగుతున్న నాయకుల్ని దేంతో కొట్టాలి? తిప్పలాడించి.. చెప్పు తిరగేసి కొట్టాలి కదా…? అంటూ ఆయన మాట్లాడ్డం సంచలనం అయ్యింది. మేము ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేస్తుంటే కొందరు అక్రమ ఆదాయాల కోసం అవతలివారిలో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తోపుదుర్తి.
గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ రాప్తాడు చెందిన వైసీపీ నాయకులు మహానందరెడ్డి, పూలకుంట శివారెడ్డి, బోయ నరేంద్ర, కుంటిమద్ద రమేష్, నసనకోట ముత్యాలును సస్పెండ్ చేశారు. కానీ… వాళ్ళంతా ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నట్టు ఫీలవుతున్నారట. పైగా… ముఖ్య నాయకులు కొందరితో టచ్‌లో ఉంటూ ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారన్నది తోపుదుర్తి అభియోగం. ఆయన ఆ స్థాయిలో మాట్లాడ్డానికి కారణం కూడా అదేనట. అలాంటి వాళ్ళందర్నీ జిల్లా పార్టీలోని కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారన్న కోపంతోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఆ స్థాయిలో సీరియస్ అయినట్టు తెలిసింది. ఆయన అనడం ఓకేగానీ…. ఎవర్ని ఉద్దేశించి అలా మాట్లాడారంటూ జిల్లాలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన మనసులో ఎమున్నా, ఎవర్ని ఉద్దేశించినా…. గతంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే హాటు ఘాటుగా చెప్పుల మాటలు మాట్లాడ్డం మాత్రం సెగలు రేపుతోంది. ఇద్దరు మాట్లాడిన సందర్భాలు వేరైనా, ఉద్దేశ్యాలు ఏవైనా…. వ్యాఖ్యలు మాత్రం పొలిటికల్ పొగలు పుట్టిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?