Mandadi Review: మండాడి రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Soori, Mahima Nambiar, Suhas, Krish Hassan
- DIRECTOR: Pugazhendhi Mathimaran
- MUSIC: G.V. Prakash Kumar
- PRODUCER: Elred Kumar
Mandadi Review: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మెప్పించి, అనంతరం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సుహాస్, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచే మండాడి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాతో అదరగొట్టాడనే చెప్పాలి. తమిళ నటుడు సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మండాడి’. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
మండాడి కథ :
Also Read
కళింగపట్నం అనే ఊళ్లో జరిగే సముద్ర పడవల పోటీలు ఎంతో ఫేమస్. ఆ ఊరిని సట్టపులి (సుహాస్) రూల్ చేస్తుంటాడు. తన ‘సునామి రైడర్స్’ టీమ్‌తో 20 ఏళ్లుగా ఆ ఊరిని సట్టపులి గెలిపిస్తుంటాడు. ఇదిలా ఉండగా, శ్రీను (రవీంద్ర విజయ్) కొడుకు మల్లేష్ (మిథున్ జై శంకర్) పడవల పోటీకి సంబంధించిన ఒక వివాదంలో సట్టపులి కొడుకుపై దాడికి ప్రయత్నించి విఫలమవుతాడు. ప్రాణభయంతో ఒక అమ్మాయి సాయంతో హైదరాబాద్ పారిపోయి, అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో పనిచేస్తూ, ఒంటరి జీవితం గడుపుతున్న ముత్తుకాళీ (సూరి) దగ్గర తలదాచుకుంటాడు.
సట్టపులి మనుషులు మల్లేష్‌ను చంపడానికి హైదరాబాద్ రావడంతో, 20 ఏళ్ల తర్వాత ముత్తుకాళీ, మల్లేష్‌ను తీసుకొని తిరిగి ఊరికి వస్తాడు. అక్కడ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించినా, పరిస్థితి చేయి దాటిపోయి పెద్ద గొడవగా మారుతుంది. చివరికి, కళింగపట్నం నుంచి రెండు టీమ్‌లు పడవల పోటీలో పాల్గొనాలని, ఓడిన వారు శాశ్వతంగా ఆటను వదిలేయాలని సవాల్ చేసుకుంటారు. ముత్తుకాళీ తన ‘కళింగ వారియర్స్’ టీమ్‌ను సిద్ధం చేస్తాడు. కానీ, సట్టపులి కుట్రల వల్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ముత్తుకాళీ టీమ్ పడవ బోల్తా పడి సభ్యులు ఆస్పత్రి పాలవుతారు.
మరోవైపు, 20 ఏళ్ల క్రితం ముత్తుకాళీ తన తల్లి ఏంజిల్ (మహిమా నంబియార్)ను ప్రేమించాడని తెలిసి మల్లేష్, ముత్తుకాళీపై కోపంగా ఉంటాడు. అసలు 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఒకప్పటి ప్రాణ స్నేహితులైన సట్టపులి, ముత్తుకాళీ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? ముత్తుకాళీ ప్రేమ ఎందుకు విఫలమైంది? 20 ఏళ్లుగా ముత్తుకాళీ అనుభవిస్తున్న నరకానికి కారణం ఏంటి? ఫైనల్ పడవల పోటీలో ఎవరు గెలిచారు? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
‘మండాడి’ కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం, దాన్ని తెరకెక్కించిన విధానం (మేకింగ్) సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం సూరి, సుహాస్ టీమ్‌ల మధ్య జరిగే పడవల పోటీల చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. వాటర్ సీక్వెన్సెస్, సముద్రంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకు సూరి అనుభవిస్తున్న నరకం, ప్రాయశ్చిత్తం కోసం అతను పడే తపన కథలో ఎమోషనల్ డెప్త్‌ను తీసుకొస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, స్నేహితులు శత్రువులుగా మారే క్రమం రొటీన్‌గా అనిపించినా, నటీనటుల ప్రతిభ దాన్ని కవర్ చేస్తుంది. అయితే, క్లైమాక్స్‌ను మరింత భావోద్వేగంగా, బలంగా డిజైన్ చేసి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. అక్కడక్కడ నెమ్మదించిన స్క్రీన్ ప్లే మినహా, ఓవరాల్‌గా ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా సినిమా సాగుతుంది.కథ పాతదే అయినా, నటీనటుల విశ్వరూపం, అదిరిపోయే వాటర్ సీక్వెన్సెస్, మైండ్‌బ్లోయింగ్ మేకింగ్‌తో థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే మంచి ఎంగేజింగ్ రైడ్!
నటీనటుల పనితీరు విషయానికి వస్తే.. ప్రధాన ఆకర్షణ నటీనటుల పర్ఫార్మెన్స్. సూరి, సుహాస్ ఇద్దరూ స్క్రీన్ పై పోటీ పడి నటించారు. తమ అద్భుతమైన యాక్టింగ్‌తో తోపు అనిపించుకున్నారు. హీరోయిన్ సైతం తన పాత్ర మేర అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక సీనియర్ నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో ఆయన పోషించిన పాత్ర నిడివి చాలా చిన్నదే అయినప్పటికీ.. కథను కీలక మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోయారు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే సాంకేతిక విభాగం ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (బీజీఎమ్) చాలా బాగుంది. సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేయడంలో సంగీతం వంద శాతం సఫలమైంది. విజువల్స్, ముఖ్యంగా వాటర్ సీక్వెన్సెస్‌లో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా అత్యున్నతంగా ఉన్నాయి. మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఒక రొటీన్ కథను కూడా విజువల్ వండర్‌గా మార్చడంలో టెక్నికల్ టీమ్ సక్సెస్ అయింది.
ఫైనల్‌గా ‘మండాడి’ ఎంగేజింగ్ మూవీ విత్ తమిళ్ ఫ్లేవర్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!