Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: కికు యనమల, కశిష్ ఖాన్, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వైవా రాఘవ తదితరులు.
- DIRECTOR: శుభ సాయి వెంకట్
- MUSIC: శేఖర్ చంద్ర
- PRODUCER: దీప్తి నడిమింటి (కికు ఎంటర్టైన్మెంట్స్)
గుండె కుడివైపు ఉంటే ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్ట్‌తో గతంలో సినిమాలు వచ్చినా, దానికి ఓ సైకో కిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ యాంగిల్ జోడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వచ్చిన సినిమానే ‘కికు చిరంజీవి’. హీరోగా కికు యనమల, హీరోయిన్ గా కశిష్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. మొదట ఈ సినిమాకు ‘చిరంజీవి’ అని టైటిల్ పెట్టినా, అభ్యంతరాల వల్ల ‘కికు చిరంజీవి’గా మార్చారు. ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.
కథ: చిరంజీవి (కికు యనమల) ఒక అనాథ, ఫోటోగ్రాఫర్ గా స్థిరపడిన అతనికి పుట్టుకతోనే ఓ అరుదైన సమస్య ఉంటుంది.. అదేంటంటే అతని గుండె ఎడమ వైపు కాకుండా కుడి వైపు ఉంటుంది. మరోవైపు మను (కశిష్ ఖాన్) కూడా అనాథే. ఆమెను శ్రీకాంత్ అయ్యంగార్ పెంచి పెద్ద చేస్తాడు. పెళ్లి తర్వాత పిల్లలు కనకుండా ఉండటానికి అంగీకరించే అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని మను షరతు పెడుతుంది. ఈ క్రమంలో చాలా సంబంధాలు చెడిపోతాయి. ఫైనల్ గా ఒక వ్యక్తి ఒప్పుకోవడంతో, అతన్ని కలిసేందుకు మను తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి బయలుదేరుతుంది. వీరి టూర్ ని కవర్ చేయడానికి ఫోటోగ్రాఫర్ గా చిరంజీవి కూడా వెళతాడు. అనుకోకుండా మనును పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ తర్వాత టూర్ కి వెళ్లిన వాళ్ళంతా అడవిలో తప్పిపోతారు.
Also Read
కొందరు దుండగులు వీరిని వెంటాడుతుంటారు. ఈ పరిగెత్తే క్రమంలో చిరంజీవికి ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. అప్పుడే తన గుండె కుడి వైపు ఉందని చెబుతాడు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య చిరు, మను అడవిలో ఒంటరిగా మిగిలిపోతారు. ఆ తర్వాత వీరికి కారులో లిఫ్ట్ ఇచ్చిన ఈశ్వరీరావు.. తన తప్పిపోయిన కొడుకే చిరంజీవి అని తెలుసుకుంటుంది. అంతా సెట్ అయిపోయి చిరు, మనులకి పెళ్లి జరుగుతుంది. కానీ ఫస్ట్ నైట్ ఉదయం లేచి చూసేసరికి మనుకి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. కుడి వైపు ఉండాల్సిన చిరు గుండె ఎడమ వైపు కొట్టుకుంటుంది. చిరంజీవిలో అనూహ్యమైన సైకో మార్పులు కనిపిస్తాయి. అసలు ఆ రాత్రి చిరంజీవికి ఏమైంది? గుండె స్థానం ఎలా మారింది? హీరోను చంపాలనుకుంటున్న ఆ మాస్క్ మ్యాన్ ఎవరు? తనికెళ్ల భరణి పాత్ర ఏంటి? వీటన్నింటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, టూర్, ప్రేమకథతో కాస్త నెమ్మదిగా, అక్కడక్కడా సీరియల్ లా సాగుతుంది. హీరోకు ఉన్న బ్రీతింగ్ సమస్య, అడవిలో వెంటాడే సీన్స్ కొంతమేర ఆకట్టుకుంటాయి. కానీ సినిమా అసలు ఊపందుకునేది బీచ్ లో హీరోపై జరిగే అటాక్ తర్వాతే. ఈశ్వరీరావు ఎంట్రీతో ఎమోషనల్ టచ్ వస్తుంది. ఇక హీరోయిన్ కి పెళ్లై ఫస్ట్ నైట్ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేస్తుంది. తాను గడిపింది ఎవరితో? తన భర్త ఎవరు? అని హీరోయిన్ పడే టెన్షన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఓ సైకలాజికల్ థ్రిల్లర్ లా మారుతుంది. హీరో ప్రవర్తనలోని మార్పులు, ఊహించని ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్క్ మ్యాన్ రివీలింగ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్ గా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్, ఫీల్ మిస్ అయినా.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు దాన్ని కవర్ చేశాడు.
నటీనటుల విషయానికి వస్తే తొలి సినిమానే అయినా కికు యనమల బాగా నటించాడు. అమాయకుడిగా, సీరియస్ గా, ఆ తర్వాత సైకో షేడ్స్ లో తనదైన వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. మను పాత్రలో కశిష్ ఖాన్ పర్వాలేదు, కానీ కొన్నిచోట్ల ఆమె నటన కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. కీలకమైన తల్లి పాత్రలో ఈశ్వరీరావు తన అనుభవంతో క్యారీ చేశారు. ఇక తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా థ్రిల్లింగ్ సీన్స్ లో బీజీఎమ్ హైలైట్ గా నిలిచింది. రామకృష్ణ కెమెరా వర్క్, విజువల్స్ బాగున్నాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. దీప్తి నడిమింటి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి, బడ్జెట్ కి వెనుకాడలేదు. దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న పాయింట్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగున్నా.. ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
ఫైనల్లీ కొన్ని తడబాట్లు ఉన్నా.. థ్రిల్లర్ లవర్ కి ‘కికు చిరంజీవి’ నచ్చొచ్చు
తాజావార్తలు
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!