Karmakhya Review: కర్మాఖ్య రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Samaira, Abhirami, Anand Bharathi, Saranya Pradeep, Samudrakhani and others
- DIRECTOR: Abhinav Krishna
- MUSIC: Gyaani
- PRODUCER: Vaninath Vaddepally
ఈ మధ్యకాలంలో అస్సాం రాజధాని గౌహతిలో ఉన్న కామాఖ్య శక్తిపీఠం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపుగా అదే టైటిల్‌తో ‘జబర్దస్త్’ ద్వారా ఫేమ్ సంపాదించిన అభినవ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేయడంతో, ఆ సినిమా మీద అందరి దృష్టి పడింది. కామాఖ్య అమ్మవారి గురించి సినిమా చేస్తున్నారేమో అనే ప్రచారం నేపథ్యంలో… ఆ గుడితో కొంత సంబంధం ఉన్న మాట వాస్తవమే కానీ, అమ్మవారి గురించి సినిమా కాదని అప్పట్లోనే ప్రకటించారు. అయితే సెన్సార్ ఇబ్బందుల కారణంగా ‘కామాఖ్య’ అనే పేరుని ‘కర్మాఖ్య’గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కర్మాఖ్య కథ :
విశాఖపట్నంలో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఒకే గదిలో ఉండే ప్రవళిక(శరణ్య ప్రదీప్), కామాఖ్య (సమీరా) ఎంతో క్లోజ్‌గా ఉంటారు. ఎంత క్లోజ్‌గా ఉంటారంటే, ఒకరి కోసం ఒకరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈ క్రమంలో ప్రవళిక ఓ పెళ్లికి వెళ్లాల్సి రావడంతో, ఆమె స్థానంలో ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఫీల్డ్ విజిట్ కోసం కామాఖ్య వెళుతుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లిన తర్వాత, అక్కడ భార్యాభర్తలు (అభిరామి, ఆనంద్ భారతి) ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు.
అయితే ఒక పది నిమిషాల పని కోసం ఆ ఇంటికి వెళ్లిన కామాఖ్య మళ్లీ వెనక్కి రాకుండా, ఆ భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తారు. అయితే అసలు ఈ భార్యాభర్తలు ఎవరు? ఎందుకు కామాఖ్యను హౌస్ అరెస్ట్ చేశారు? అక్కడికి వెళ్లి చిక్కుకున్న కామాఖ్య కోసం ప్రవళిక వచ్చిందా లేదా? అసలు ఈ కథలో ఎస్సై తిరుపతి (సముద్రఖని) పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే..
Also Read
విశ్లేషణ
‘కామాఖ్య’ అనే పేరు పెట్టినప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకులలో కొంత ఆసక్తి ఏర్పడిన మాట వాస్తవం. అయితే సినిమా కథలో కూడా కామాఖ్య దేవితో కొంతవరకు సంబంధం ఉంది. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు అభి ఈ కథ రాసుకున్నారని గతంలో చెప్పారు. అయితే ఇదేమి కొత్త కథలాగా అనిపించలేదు. ఎందుకంటే, ఇలాంటి మూఢనమ్మకాలతో కూడిన కొన్ని సంఘటనలను మనం వార్తలలో చూస్తూనే వస్తున్నాం.
సైన్స్, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కి, వేరే గ్రహాల్లో సైతం కాపురం ఉండటానికి మానవుడు సిద్ధపడుతున్న ఈ రోజుల్లో… ఇంకా మూఢనమ్మకాల మీద ఆధారపడి పనిచేయకుండా, కోట్లకు కోట్లు కలిసి వస్తాయని కలలుకనే వారు కొందరుంటే, తమ వారి ఆరోగ్యం బాగుపడుతుందని హాస్పిటల్స్‌కి సైతం తీసుకువెళ్లకుండా పూజలు చేయించేవారు మరికొందరు. ఇక అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నట్లుగా అనిపించింది. దానికి కామాఖ్య దేవితో లింక్ పెట్టి రాసుకున్న విధానం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
ఇక ఫస్ట్ ఆఫ్ ఓపెనింగ్‌లోనే కామాఖ్య దేవి, ఆ క్షేత్రంలో జరిపే కొన్ని తంత్ర విద్యల గురించి ప్రస్తావించారు కాబట్టి, సినిమా ఖచ్చితంగా ఆ తంత్ర విద్యల చుట్టూనే తిరుగుతుందని హింట్ ఇచ్చేశారు. పెద్దగా డీటెయిల్స్‌లోకి వెళ్లకుండా హీరోయిన్ చుట్టూనే కొంతవరకు నడిపించారు. ఇక్కడే ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే వాస్తవానికి అదంతా సెకండ్ హాఫ్‌లో జరగబోయే దానికి ఇచ్చిన ప్రిపరేషన్ అని తర్వాత అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, హీరోయిన్ ఒక ఇంట్లోకి వెళ్లి చిక్కుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. చిక్కుకున్న తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటపడడానికి హీరోయిన్ చేసే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే మరొక పార్ట్ కోసం వదులుకున్న లీడ్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. దీనిని థ్రిల్లర్ జానర్లో రాసుకున్నారు కాబట్టి, దానికి తగ్గట్టుగానే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించారు. అవన్నీ స్క్రీన్ మీద వర్కౌట్ అయ్యాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే… ఈ సినిమాలో హీరోయిన్ గా కామాఖ్య పాత్రలో నటించిన సమీరాకి ఇది తొలి సినిమానే అయినా, నటన విషయంలో మాత్రం అలా అనిపించలేదు. పరిణతి ఉన్న నటి లాగే తన సన్నివేశాలలో ఆకట్టుకుంది. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరైనా ఉన్నారా అంటే అది నటి అభిరామి అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలలో ఆమె నటన చూసి అబ్బురపడాల్సిందే. ఇక ఆనంద్ భారతి పాత్ర ఉన్నంతలో ఆకట్టుకుంది. శరణ్య ప్రదీప్‌కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర దక్కింది. సముద్రఖని కనిపించింది కొన్ని సీన్స్ లోనే అయినా ఇంపాక్ట్ ఉంది.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే… ఈ సినిమా సంగీత దర్శకుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని మరో లెవెల్‌కి తీసుకువెళ్లాడనే చెప్పాలి. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఖచ్చితంగా సినిమాకి ఒక అసెట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది, సినిమా మూడ్ క్యారీ చేయడంలో ఉపయోగపడింది. నిడివి కూడా పెద్దగా కంప్లైంట్ చేసేలా అయితే లేదు. AI వాడకం సినిమా బడ్జెట్‌ను కంట్రోల్లో పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే సాధారణ లొకేషన్స్ కూడా పెద్దగా వాడలేదు, తక్కువ లొకేషన్స్‌లోనే ఈ సినిమా షూటింగ్ ముగించారనిపించింది. అయినా కూడా కథ డిమాండ్‌ను బట్టి నిర్మాతలు బానే ఖర్చు పెట్టారు అనిపించేలా అవుట్‌పుట్ ఉంది.
ఫైనల్‌గా… ‘కర్మాఖ్య’ ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!