Haiku Review: హైకు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Aegan, Sridevi, Femina and others
- DIRECTOR: Yuvaraj Chinnasamy
- MUSIC: Siddhu Kumar
- PRODUCER: Dr. D. Arulanandhu and Mathewo Arulanandhu
సినిమాలల్లో “లవ్ స్టోరీస్” అనేది ఒక నెవర్ ఎండింగ్, అలానే నెవర్ ఫెయిల్డ్ కాన్సెప్ట్. ఆ లవ్ సినిమా ఏ మాత్రం బాగున్నా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తారు. అందుకే, ఎక్కువగా మేకర్స్ లవ్ స్టోరీస్ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమిళ వ్యాపారవేత్త కుమారుడు ఏగన్ హీరోగా, తెలుగమ్మాయి శ్రీదేవి, తమిళ అమ్మాయి ఫెమీనా హీరోయిన్లుగా హైకూ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మీడియా కోసం సినిమా టీమ్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది. ఈ లవ్ స్టోరీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
హైకూ కథ :
మనోహర్ (ఏగన్) చెన్నైలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతని వద్ద ట్రైనీగా వచ్చిన నివి(ఫెమీనా), ఒకరోజు మనోహర్ గతం గురించి అడుగుతుంది. ఈ క్రమంలో, మనోహర్ తాను గతంలో ప్రేమించిన తన కాలేజీ మేట్ పావలకుడి (శ్రీదేవి) గురించి, వారి ప్రేమకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటాడు. అయితే, తామెందుకు విడిపోయామనే విషయాన్ని కూడా చెప్పాక, ఇద్దరూ కాస్త దగ్గరవుతారు. ఆ సాన్నిహిత్యం మరింత పెరిగి, నివి, మనోహర్ కూడా ప్రేమలో పడతారు. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో, నివి మనోహర్‌లో కొన్ని షాకింగ్ అంశాలను గమనిస్తుంది. దీంతో, ఆమె పావలకుడిని కలిసి ఆమె సలహా తీసుకోవాలని భావిస్తుంది. అలా కలవడం వీరిద్దరి జీవితాలను ఏమి చేసింది? వీరిద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభించారా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
సాధారణంగా లవ్ స్టోరీ అనగానే బ్రేకప్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఈ సినిమా విషయంలో, తాను ట్రెయినింగ్ తీసుకుంటున్న టీం లీడ్ స్టోరీ తెలుసుకునే అమ్మాయిగా, ఫెమీనా యాంగిల్ నుంచి కథ మొదలవుతుంది. సినిమా కథ మొదలయ్యాక మనోహర్ పాత్రను పరిచయం చేస్తూ, ఆ తర్వాత కథ మనోహర్ యాంగిల్ లోకి డైవర్ట్ అవుతుంది. మనోహర్ కాలేజ్, మనోహర్ చదువు, మనోహర్ స్నేహితులతో అల్లరి చిల్లరిగా తిరగడం అంటూ, ఒక కాలేజ్ నుంచి రస్టిగేట్ అయ్యి పూర్తిగా అమ్మాయిలే ఉన్న ఒక కాలేజ్‌లో ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఆసక్తికరంగా మారతాయి. కథ ఆ తర్వాత కాస్త ఫన్నీగా సాగుతూనే, శ్రీదేవి పాత్ర ఎంట్రీతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఆ తర్వాత శ్రీదేవి పాత్ర ఎంట్రీ ఇచ్చాక, ఇదంతా రొటీన్ స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కాసేపు అక్కడక్కడే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఫీలింగ్ తీసుకొచ్చాక, కొత్తగా మనోహర్, నివి మధ్య ప్రేమతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆ తర్వాత వచ్చే కొన్ని ట్విస్ట్స్ Gen Z ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిగిలిన వాళ్లకు, ఇదేంటి రొటీన్, ఇంకేం చెప్పాలనుకున్నాడు దర్శకుడు, అసలు ఏం చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాడు అనే అనుమానాలు కలిగిస్తాయి. కానీ చివరికి, ప్రేమ ఎప్పుడు, ఎందుకు, ఎవరి మీద, ఎలా పుడుతుందో తెలియదు. అలాగే తమ పాస్ట్ లో ఉన్న ప్రేమను బట్టి ప్రస్తుతం ఉన్న ప్రేమికులతో లేదా పార్టనర్స్‌తో బిహేవ్ చేయడం ఎంత అనర్థమో ఈ సినిమాలో డిస్కస్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, రొటీన్ అనే ఫీలింగ్ కలిగించినా, తీసుకున్న పాయింట్ మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. అక్కడి వరకూ ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు.
ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే, మనోహర్ అనే పాత్రలో నటించిన ఏగన్కి ఇది మొదటి తెలుగు సినిమానే అయినా, ఎక్కడా ఆ ఫీలింగ్ అయితే కలిగించలేదు. చాలా పరిణితి ఉన్న నటుడిలా, ఏగన్ ఈ పాత్రలో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఒదిగిపోయాడు. ఇక శ్రీదేవి ఎప్పట్లాగే తనదైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమెకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. మరోసారి అలానే కనిపించింది. ఇక ఈ సినిమాలో తెలుగు వాళ్లకి సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫెమినా. ఆమె తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం లేదు, కానీ ఈ సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. నటనతో ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రల్లో నటించిన వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడికి ఇది మొదటి సినిమానే అయినా, ఎక్కడా ఆ ఫీలింగ్ అయితే కలగలేదు. చాలా సింపుల్‌గా, ఒక ఫ్లోలో సినిమా మొత్తాన్ని తీసుకెళ్లాడు. అయితే ఇలాంటి స్టోరీస్ తీసుకున్నప్పుడు ఇంకా కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు ఇష్టపడేవారు. కానీ ఎక్కువగా సాగతీయకుండా, ఎక్కువ బుర్రకు పదును పెట్టే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అది చాలా వరకు వర్కౌట్ అయ్యే ఫార్ములా ఈ రోజుల్లో అయితే కాదు. ఇక డైలాగ్స్ అయితే తెలుగు వారికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. పాటలు కూడా ఒకటి రెండు ప్రేక్షకులకు హం చేసేలా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేశాడు. ఇక నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫి బాగుంది. నిడివి ఇంకాస్త కంట్రోల్లో ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా, ఈ హైకు… జెన్‌జీ లవ్ స్టోరీ.
తాజావార్తలు
-
Vidadala Rajini: విడదల రజినీ ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!