Epic Review: ఎపిక్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Anand Deverakonda,Vaishnavi Chaitanya, Sivaji, Vasuki, Johannes Imomoh
- DIRECTOR: Aditya Haasan
- MUSIC: Hesham Abdul Wahab
- PRODUCER: Sai Soujanya and Suryadevara Naga Vamsi
Epic Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. వీరిద్దరూ కలిసి ‘బేబీ’ సినిమా చేయడం, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ ‘ఎపిక్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ’90s’ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైరెక్షన్లో నాగవంశీ నిర్మాణంలో ఈ ‘ఎపిక్’ సినిమా రూపొందడంతో ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేశారు. దీంతో సినిమా ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది, సినిమా మీద అంచనాలు కూడా గట్టిగానే పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఎపిక్ కథ:
Also Read
#90స్ కథలో చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) పెరిగి పెద్దయ్యాక ఏ పనీ చేయకుండా, దర్శకుడు అవ్వాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సమయం గడిపేస్తూ ఉంటాడు. ఎవరో ఇచ్చిన సలహా మేరకు మాస్టారు శివాజీ, ఆదిత్యని అప్పు చేసి మరీ లండన్ పై చదువుల కోసం పంపిస్తాడు. తండ్రి బలవంతంతో లండన్ వచ్చిన ఆదిత్య తిట్టుకుంటూనే, అక్కడ పార్ట్‌టైమ్ చేసుకుంటూ చదువుతూ ఇంటికి డబ్బు పంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. వీరిద్దరూ మొదట కులాలు వేరు కావడంతో ఎలాంటి రిలేషన్లోకి వెళ్ళకూడదు అనుకుంటూనే, ఒకరినొకరు విడిచి ఉండలేనంత దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆదిత్య, కడలి ఒకటయ్యారా లేదా? వీరిద్దరూ కలిసి లండన్‌లో ఏం చేశారు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
90s లో చిన్న కుర్రాడు పెరిగి పెద్దయి విదేశాలకు చదువు కోసం వెళితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే కథతోనే ఈ సినిమా చేస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అందులో ఎలాంటి అనుమానం లేకుండానే సినిమా కథ కూడా ఉంది. సినిమా ప్రారంభమైన వెంటనే ఆదిత్య పాత్ర విదేశాలకు వెళ్లడం, అక్కడ ముందు ఇమడడానికి ప్రయత్నిస్తూ ఉండగానే హీరోయిన్‌తో పరిచయం కావడం జరుగుతాయి. ఆ తరువాత వారిద్దరి క్లోజ్‌నెస్ అంత లాజికల్‌గా అనిపించకపోయినా, వారిద్దరి పరిచయం తర్వాత కెమిస్ట్రీ మాత్రం వర్కౌట్ అయింది. ఇప్పటికే ‘బేబీ’లో ఈ జంటని చూసి ఉండడం కొంత ప్లస్ అయింది.
ఇక ఆ తర్వాత ఫస్టాఫ్ అంతా మెలోడ్రామాతోనే నడిపించాడు దర్శకుడు. ఎక్కువ లొకేషన్స్‌కి వెళ్లకుండా కేవలం ఒక గదిలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం, ఎలాంటి ఎమోషనల్ స్ట్రింగ్స్ లేవంటూనే ఒక రిలేషన్లో వీరు పడే స్ట్రగుల్ వంటివి ఆసక్తికరంగా చూపించారు. ఈ రోజుల్లో ఉన్న జెన్‌జీ ఎంత ఈజీగా ప్రేమలో పడుతున్నారు, ప్రేమ వద్దనుకుంటూనే ఫిజికల్ ఇంటిమసీలకు ఎలా లోనవుతున్నారు అనే విషయాలను ఎలాంటి లాజిక్స్ లేకుండా దర్శకుడు రాసుకున్నాడు. ‘నో స్ట్రింగ్స్ అటాచ్డ్’ అంటూనే మొదలైన వీరి ప్రేమ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులకు కారణమైంది అనేది చూపించాలనుకున్నా, అది ఫస్టాఫ్ వరకు బానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్‌లో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుని ఏం చెప్పాడు అనే విషయం మీద కాస్త అవగాహన లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి ఫస్టాఫ్ వరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలానే ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
దానికి తోడు క్లైమాక్స్ ఎందుకో అర్ధాంతరంగా ఏదో ముగించేయాలి కాబట్టి ముగించేస్తున్నట్లు అనిపించింది. ఇంకేదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులు క్లైమాక్స్ విషయంలో మాత్రం నిరాశ చెందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో ఇంకొంత కేర్ తీసుకుని వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, ఈ మొదటి భాగానికి కూడా ఒక మంచి క్లైమాక్స్‌తో ముగించి ఉంటే థియేటర్లో నుంచి బయటికి వచ్చే ప్రేక్షకులు అసంతృప్తి భావనతో బయటికి రాకుండా ఉండేవారేమో. అయితే ముద్దు లేదా బెడ్ సీన్ ఉండడంతో సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడడం కష్టమే. ఫ్రెండ్స్ లేదా లైఫ్ పార్ట్‌నర్స్‌తో మాత్రమే చూడగలిగే సినిమా ఇది. ఇప్పటికే లవ్, రిలేషన్‌కి సంబంధించి ఎన్నో సినిమాలు చూశాం, కానీ ఇది విదేశాలలో చదువుకోడానికి వెళ్లి అక్కడ ఇబ్బంది పడుతున్న ఒక సగటు తెలుగు యువతీ యువకుల కథ. కాకపోతే కులాల ప్రస్తావన, అబ్బాయిలు ఉద్యోగాల పేరుతో ఎదుర్కొంటున్న స్ట్రెస్ తో పాటు అమ్మాయిలు బయోలాజికల్ గా, మెంటల్ గా ఎదుర్కొంటున్న స్ట్రెస్ వంటి అంశాలను కథలో భాగంగా చూపించిన తీరు బావుంది.
నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో ఒక అమాయకపు పాత్రలో ఆకట్టుకున్నాడు. అమ్మాయిలతో మాట్లాడడమే తెలియని అతను, ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉండాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులకు లోనయ్యాడు అనే విషయంలో ఆకట్టుకునేలా నటించాడు. ఇక వైష్ణవి చైతన్య తనకు బాగా కొట్టిన పిండిలాంటి పాత్రలో ఆకట్టుకుంది. ఇలాంటి పాత్రలు ఆమెనే ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నాయి అనేది ఆమెకే తెలియాలి. ఇక శివాజీ, వాసుకిల పాత్రలు చాలా పరిమితమే అయినా, సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ మాత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంది. ‘మ్యాడ్’ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మొదటిసారి స్క్రీన్ మీద కనిపించినా, ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నవ్వించాడు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కరెక్ట్‌గా సెట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసేలా ఉంది. సినిమా అంతా ఎక్కువగా విదేశాల్లోనే జరగగా, అక్కడి అందాలను సైతం ప్రేక్షకులకు చూపించడంలో టీం సక్సెస్ అయింది. ఇక ఆదిత్య హాసన్ దర్శకుడిగా కన్నా రచయితగా ఎక్కువ మార్కులు వేసుకున్నాడు. దర్శకుడిగా సెకండ్ హాఫ్ డీల్ చేయడంలో తడబడ్డ ఆదిత్య, తన సంభాషణలతో మాత్రం ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా తక్కువ బడ్జెట్లోనే సినిమా ముగించిన ఫీలింగ్ వచ్చింది.
ఫైనల్‌గా, ఈ ‘ఎపిక్ సెమిస్టర్ వన్’… జెన్‌జీ లవ్ స్టోరీ విత్ కాంప్లికేటెడ్ క్లైమాక్స్!
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!