Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema Reviews Darja Movie Review

Darja Movie Review : దర్జా రివ్యూ

Published Date :July 22, 2022
By subbarao nagabhiru
Darja Movie Review : దర్జా రివ్యూ

Rating : 1.5 / 5

  • MAIN CAST: Anasuya Bharadwaj, Sunil, Shakalaka Shankar and Naga Mahesh
  • DIRECTOR: Saleem Malik
  • MUSIC: Rap Rock Shakeel
  • PRODUCER: Siva Sankar Paidipati,

Darja Movie Review :

‘ఒక్కో ఆర్టిస్ట్ దీ ఒక్కో టైమ్ నడుస్తుందని, ఆ సమయంలో వాళ్ళు తెర మీద కనిపిస్తే చాలు జనం ఆదరిస్తార’నే భావనలో కొందరు దర్శక నిర్మాతలు ఉంటారు. అలా ఇప్పుడు అనసూయ టైమ్ నడుస్తోందని కొందరి నమ్మకం. ఆమెతో కీ-రోల్ చేయిస్తే, థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే ఆశతో ఆమెను దృష్టిలో పెట్టుకునే కొందరు కథలు రాసుకుని, సినిమాలు తీస్తున్నారు. అలాంటిదే శుక్రవారం జనం ముందుకొచ్చిన ‘దర్జా’ కూడా! ఆ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సునీల్, అనసూయ భార్యా భర్తలుగా నటించారు. అంతేకాదు… కరడుగట్టిన వ్యక్తులుగా తెర మీద వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ఆ కాంబోను రిపీట్ చేస్తే… జనం చూడక పోతారా అనే ఆశతో ‘దర్జా’ను దర్శకుడు సలీమ్ మాలిక్ తీసినట్టు అనిపిస్తోంది. చిత్రం ఏమంటే… ఇందులో వీళ్ళిద్దరూ జంటగా కాకుండా ప్రత్యర్థులుగా నటించారు. ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా కథ బందరులో జరుగుతుంది. ఆ ఊరిలో కనకం ఓ లేడీ గ్యాంగ్ స్టర్. అమ్మాయిల అక్రమ రవాణ, దొంగసారాతో పాటు పలు అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. బందరు కు పోర్ట్ రాబోతున్న నేపథ్యంలో ఆమె కన్ను దాని మీద పడుతుంది. పోర్ట్ ను తన ఆధీనంలో ఉంచుకోవడానికి రకరకాల కుయుక్తులు పన్నుతుంది. ఆమెకు చేదోడు వాదోడుగా కవల సోదరుడైన బైరాగి ఉంటాడు. తనకు అడ్డం వచ్చిన ఎమ్మెల్యేనే కాదు పోలీస్ అధికారులను సైతం అంతం చేస్తుంది కనకం. అదే సమయంలో మూగవాడైన గణేశ్‌, పుష్పను ప్రేమిస్తే, అతని తమ్ముడు రంగ… గంగను ప్రేమిస్తాడు. ఊహించని విధంగా వీళ్ళ జీవితాలు కనకం కబ్జాలోకి వెళ్ళిపోతాయి. ఆమె కబంధ హస్తాల నుండి బయట పడటానికి వీళ్ళు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్ శంకర్ వీళ్ళకు ఎలాంటి సాయం చేశాడు? అతనికి, కనకంకు ఉన్న పాత వైరం ఏమిటీ అనేది మిగతా కథ.

ఆరేళ్ళ క్రితం ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత ‘క్షణం’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ఐటమ్ సాంగ్స్ తో సహా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది. చిత్రం ఏమంటే… ఆమె నటించిన ‘రంగస్థలం, పుష్ప’ వంటి సినిమాల్లోని పాత్రలు పేరు తెచ్చిపెట్టాయి కానీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ‘కథనం, థ్యాంక్ యూ బ్రదర్’ వంటివి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినా… ఆమెతో ప్రయోగాలు చేయడం దర్శక నిర్మాతలు మానలేదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. లేడీ డాన్ కనకంగా అనసూయను కొత్తగా చూపించే ప్రయత్నం దర్శకుడు సలీమ్ మాలిక్ చేశాడు. ఆమె వేషధారణ కాస్తంత భిన్నంగా ఉన్నా, ఈ పాత్రలో అనసూయ నటన ఆకట్టుకోలేకపోయింది. డైలాగ్ డెలివరీ అయితే మరీ దారుణం. ఆమె గొంతులో ఎలాంటి ఫోర్స్ లేదు. ఇక కీలక పాత్ర పోషించిన షమ్ము, అరుణ్ వర్మకు, వారి ప్రియురాళ్ళుగా నటించిన అక్సాఖాన్, శిరీష కు నటనలో పెద్దంత అనుభవం ఉన్నట్టే లేదు. అయితే… అక్సాఖాన్ డాన్స్ పెర్ఫార్మర్ అనేది అర్థమౌతోంది. ఆమె పాత్రను దర్శకుడు సరిగా తెర మీద మలచలేదు కానీ… ద్వితీయార్థంలో ఆమెపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమా ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన సునీల్ అక్కడ నుండి కథను తానే నడిపాడు. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ గతంలో కొన్ని సినిమాల్లో చేశాడు. దాంతో ఇందులో కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆమని, షకలక శంకర్, షఫీ, సమీర్, శేషు, నాగమహేశ్‌, మిర్చి హేమంత్, ‘ఛత్రపతి’శేఖర్ వంటి అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. వారిని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోయాడు. అలానే పృథ్వీపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అస్సలు పండలేదు. రాప్ రాక్ షకీల్ సమకూర్చిన ట్యూన్స్ ఒకటి రెండు బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం మరీ లౌడ్ గా ఉంది. అంజి ఫైట్స్ సోసో. ఇలాంటి కథలు తెలుగువారికి కొత్త కాదు. అయితే లేడీ డాన్ కథతో తీయడమే కాస్తంత కొత్త. ఆ పాత్రకు అనసూయ ఏ రకంగానూ న్యాయం చేకూర్చలేకపోయింది. అలానే మిగిలిన పాత్రల తీరుతెన్నులూ సక్రమంగా లేవు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలా సాగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఓ సినిమాను తీసి, జనం ముందుకు తీసుకు రాగలిగామనే తృప్తి మాత్రమే దర్శక నిర్మాతలకు ‘దర్జా’తో కలుగుతుంది.

రేటింగ్: 1.5 / 5

ప్లస్ పాయింట్స్
పేరున్న ఆర్టిస్టులు నటించడం
ఫైట్స్

మైనెస్ పాయింట్స్
చాలానే ఉన్నాయి!

ట్యాగ్ లైన్: టైమ్ కబ్జా!

  • Tags
  • Anasuya Bharadwaj
  • Darja Movie Rating
  • Darja Movie Review
  • movie review
  • Sunil

WEB STORIES

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

RELATED ARTICLES

Tees Maar Khan: మరో భిన్నమైన పాత్రలో సునీల్!

Rangamarthanda: తగ్గేదే లే అంటున్న అనసూయ!

Wanted Pandugod: శ్రీధర్ సీపానకు టైమొచ్చింది!

Anasuya Bharadwaj: 22న ‘దర్జా’గా థియేటర్లలోకి….

Anasuya : అనసూయ మధురవాణిగా మెప్పిస్తుందా!?

తాజావార్తలు

  • Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఎఫ్ బీ ఐ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం

  • Constable Surendra Case update: కానిస్టేబుల్ సురేంద్ర నిందితుల కోసం గాలింపు

  • Heavy Rainfall in Telangana: 24 గంటల్లో తీవ్ర వాయుగుండం.. నేడు భారీ వర్షాలు

  • Srisailam Dam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం

  • Bihar Politics: బీజేపీతో సీఎం నితీష్ కుమార్ తెగదెంపులేనా.. నేడు జేడీయూ కీలక సమావేశం

ట్రెండింగ్‌

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

  • WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions