Dacoit Review: డెకాయిట్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Adivi Sesh, Mrunal Thakur, Anurag Kashyap, Prakash Raj and Others
- DIRECTOR: Shaniel
- MUSIC: Bheems
- PRODUCER: Supriya, Sunil
డెకాయిట్ రివ్యూ: ఒకే ఏడాది ‘మేజర్’, ‘హిట్ 2’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అడివి శేష్, ఆ తరువాత చాలా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నాడు. అలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన చిన్ననాటి స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ శానిల్ డియోతో కలిసి ‘డెకాయిట్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. శృతి హాసన్‌తో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాని, ఆ తరువాత ఆమె తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్‌తో కొనసాగించారు. అయితే శేష్ తమ కంటెంట్ మీద ఏర్పరచుకున్న నమ్మకంతో, ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి యూఎస్ ప్రీమియర్స్ తో పాటు మీడియాకు కూడా ఒక స్పెషల్ షో వేశారు మేకర్స్. మరి ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది అనేది డెకాయిట్ రివ్యూలో తెలుసుకుందాం.
డెకాయిట్ కథ:
హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్), కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తాను ప్రేమించి, ఆమె చేతిలో మోసపోయిన జూలియట్ అలియాస్ సరస్వతి (మృణాల్ ఠాకూర్) మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావిస్తూ ఉంటాడు. శిక్ష ముగించుకుని బయటకు వెళ్లిన తన జైల్ మేట్ (అతుల్ కులకర్ణి) సహాయంతో జైలు నుంచి తప్పించుకున్న హరి, తాను పగ తీర్చుకోవాలనుకున్న జూలియట్ మీద పగ తీర్చుకున్నాడా? అసలు ప్రాణంగా ప్రేమించిన జూలియట్ హరిని ఎందుకు వదిలేసింది? తన భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాడుతున్న జూలియట్, భర్త ప్రాణాలను దక్కించుకున్నదా? ఆమె మీద పగ తీర్చుకోవడం కోసమే బయటకు వచ్చిన హరి, ఆమె మీద పగ తీర్చుకున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే, దాదాపు అన్ని సినిమాల్లోనూ తనదైన కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అడివి శేష్. ఒక రకంగా చెప్పాలంటే అడివి శేష్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఎక్కువ యువతతో పాటు మాస్ ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసేవారు. అయితే ‘మేజర్’ సినిమాతో కాస్త ఫ్యామిలీస్ కి దగ్గరైన అడివి శేష్, ఈ డెకాయిట్ అనే ప్రేమ కథ సినిమాతో ఆ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని ఆయన ప్రమోషన్స్‌లో కూడా చెప్పుకుంటూ వచ్చాడు.
ఇక సినిమా ఓపెనింగ్ మొదలు, సినిమా మీద ఆసక్తి పెంచుకుంటూ వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా ఊహించని విధంగా కథను ప్రజెంట్ చేయడంలో టీం సక్సెస్ అయింది. వాస్తవానికి కథ మనం ఊహిస్తున్నట్లుగానే అనిపిస్తుంది, కానీ శేష్ సినిమాల్లో ఆశించే ట్విస్టులు ఈ సినిమాలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కథ కొంచెం రొటీన్ అనిపించినా సరే, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయడంలో టీం కొంతవరకు సక్సెస్ అయింది. అయితే శేష్ గత సినిమాలతో పోలిస్తే పూర్తి స్థాయిలో ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. కానీ ఈ సినిమాలో టెక్నికల్ టీం మాత్రం అదరగొట్టింది. ఎడిటర్‌తో పాటు సినిమాటోగ్రాఫర్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సంగీత దర్శకుడు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
వాస్తవానికి అడివి శేష్ ఇప్పటివరకు పూర్తిగా భిన్నమైన సినిమాలే చేస్తూ వచ్చాడు, కానీ తొలిసారిగా కమర్షియల్ సినిమా ప్రయత్నమే ఈ డెకాయిట్. ఫస్ట్ హాఫ్ తరువాత ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగా కథ నడిపించి, ఒక ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంక్‌తో సెకండ్ హాఫ్ మీద మరింత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేశారు. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథలోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అప్పటివరకు హీరోయిన్ మీద పగ పట్టిన హీరో యాంగిల్‌ను చూసిన ప్రేక్షకులకు, క్లైమాక్స్‌తో మాత్రం కన్నీరు పెట్టించే ప్రయత్నం చేశాడు శేష్. నిజానికి రొటీన్ కథను ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది టీం. టెక్నికల్ గా మాత్రం టాప్ నాచ్ ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా నడిపించినా, సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది, కానీ క్లైమాక్స్‌తో ఒక్కసారిగా ప్రేక్షకులందరికీ కంటతడి పెట్టించేశారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో మదనపల్లి కుర్రాడిగా అడివి శేష్ అదరగొట్టాడు. మొదటిసారిగా రాయలసీమ యాస ప్రయత్నించడం కొంత తడబాటు అనిపించినా, యాక్షన్ పార్ట్ తో పాటు నటన అదరగొట్టాడు. కానీ ఈ డైలాగ్స్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. మృణాల్ ఠాకూర్, అడివి శేష్ మధ్య వచ్చే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మృణాల్ ఠాకూర్ ఎప్పటిలాగే తనదైన పాత్రలో మెరిసింది. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు స్వయానా సినిమాటోగ్రాఫర్ కావడంతో ఒక రేంజ్ విజువల్స్ చూపించారు. ఆ విజువల్స్ కి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ కావడంతో, ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఎడిటింగ్ కట్స్ కూడా అదే స్థాయిలో మ్యాచ్ చేయడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు. కథ ఎప్పటిలాగే అనిపించినా, స్క్రీన్ ప్లే మాత్రం శేష్ సినిమాల స్క్రీన్ ప్లే తో చాలా వరకు మ్యాచ్ అయింది. టెక్నికల్ గా ఎక్కడా వంకలు పెట్టకుండా ఉండేలా టీం చూసుకుంది.
ఫైనల్లీ.. ఈ డెకాయిట్ యాక్షన్‌తో అలరిస్తూ, ఎమోషన్‌తో ఏడిపిస్తాడు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..