Bhala Thandanana Movie Review: భళా తందనాన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju, Krishna Murali Posani, Garuda Ram,
- DIRECTOR: Chaitanya Dantuluri
- MUSIC: Manisharma
- PRODUCER: Rajani Korrapati
నటవర్గం: శ్రీవిష్ణు, కేథిరన్ ట్రెసా, పోసాని కృష్ణమురళి, గరుడ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు
నిర్మాత: రజని కొర్రపాటి
దర్శకత్వం: చైతన్య దంతులూరి
కథలు కొత్తగా ఉండవు. అయితే వాటిని జనానికి నచ్చేలా చెప్పడంలోనే ప్రతిభ దాగి ఉంటుంది. యంగ్ హీరో శ్రీవిష్ణు ఈ మధ్య డబ్బు చుట్టూ తిరిగే కథల్లోనే వరుసగా కనిపిస్తూ ఉన్నాడు. `రాజ రాజ చోర`, `అర్జున పల్గుణ` చిత్రాల తరువాత ఇప్పుడు `భళా తందనాన`లోనూ డబ్బు చుట్టూ తిరిగే కథనే. కాకపోతే, మొదట్లో చిల్లర దొంగతనాలు, తరువాత లక్షల్లో ఇప్పుడు ఏకంగా `భళా తందనాన`లో రెండు వేల కోట్ల రూపాయల చుట్టూ తిరిగే కథ! మే 6న `భళా తందనాన` ప్రేక్షకుల ముందు నిలచింది.
Also Read
కథలోకి వస్తే – ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఉన్న శశిరేఖ ఎంతటివారి తప్పునైనా బయట పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడదు. డబ్బుకు కూడా లొంగని నైజం. ఓ అనాథ శరాణలయంలోనూ స్కామ్ జరిగిందని తెలిసి అక్కడకు వెళ్తుంది. ఆమెను ఎలాగైనా మేనేజ్ చేయమని చెబితే అక్కడే అకౌంటెంట్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ వచ్చి ఆమెతో డబ్బులిస్తానని, ఈ న్యూస్ బయటకు రాకుండా చూడమని ప్రాధేయపడతాడు. చివరకు ఆ న్యూస్ బయటకు వస్తే, అనాథలయిన పసిపిల్లలకు ఇకపై ఎవరూ డొనేషన్ ఇవ్వరనీ వేడుకుంటాడు. అలా పరిచయం అవుతుంది వారిద్దరికీ. ఓ కిడ్నాప్ లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవుతారు. వారందరూ సిటీలో పేరు మోసిన హవాలా కింగ్ మనుషులు. వారిని ఎవరు చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు అనే అంశాల్లో పరిశోధన చేస్తున్న శశిరేఖకు ఓ వ్యక్తి వచ్చి, వార్నింగ్ ఇస్తాడు. హవాలా కింగ్ వద్ద రాజకీయ నాయకులు, పేరుమోసిన బ్యూరక్రాట్స్ కు చెందిన రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, చేతనైతే వాటి గురించి రాయమని చెబుతాడు. ఆ వార్తను ఆమె ప్రచురిస్తుంది. దాంతో హవాలా కింగ్ అతని అనుచరులు కంగు తింటారు. ఈ వార్త వెలుగు చూడడం వెనుక ఎవరున్నారో తెలుసుకోమంటాడు వాడు. ఓ లేడీ జర్నలిస్ట్ అని చెబుతాడు ఓ అనుచరుడు. చంద్రశేఖర్, శశిరేఖ వస్తూండంగా రెండు జీపుల్లో వచ్చిన గూండాలు చందుని పట్టుకు పోతారు. హీరోయిన్ కు అయోమయంగా ఉంటుంది. తరువాత ఒక్కో విషయం తెలుస్తూ వస్తుంది. చందునే ఆ రెండువేల కోట్లు కొట్టేసిన వాడు అనీ శశిరేఖకు బోధ పడుతుంది. శశిరేఖ అతని ప్రియురాలు అని, అలాగే అతని రూమ్మేట్ నూ కిడ్నాప్ చేసి విలన్ డెన్ కు తీసుకు వెళతారు. అక్కడ అనుచరులకు కూడా డబ్బు ఎరవేస్తాడు చందు. దాంతో హవాలా కింగ్ నే అతని మనుషులు చంపేస్తారు. తరువాత డబ్బు కోసం ఒకరినొకరు చంపుకుంటూ అందరూ చస్తారు. అసలు చందు హవాలాకింగ్ నే ఎందుకు టార్గెట్ చేశాడు అన్న అనుమానం శశిరేఖకు కలుగుతుంది. దాంతో ఈ కథ ఇంకా కొనసాగనుందంటూ ఓ ముగింపు ఇచ్చారు.
ఈ మధ్య ప్రతీ సినిమాను సీక్వెల్స్ తో ప్లాన్ చేస్తూ ఉండడం కనిపిస్తోంది. ఆ దిశగానే ఈ చిత్రమూ పయనించిందని చెప్పవచ్చు. శ్రీవిష్ణు తన పాత్రకు తగ్గ అభినయంతో సాగిపోయాడు. ఇక కేథిరన్ మునుపటి కన్నా బొద్దుగా తయారయింది. ఆమె నటన సో సోగానే సాగింది. ఇతర పాత్రల్లో కేజీఎఫ్-1లో గరుడగా నటించిన రాజు హవాలా కింగ్ పాత్రలో కనిపించాడే తప్ప అతను పెద్దగా అభినయించిందేమీ లేదు. ఇక ఎప్పటిలాగే కామెడీ పండిస్తూ పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్ రెడ్డి, సత్య నవ్వించారు. తొలి చిత్రం `బాణం`తోనే మంచి దర్శకునిగా పేరొందిన చైతన్య దంతులూరి ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే పలు సన్నివేశాలు పాతగా అనిపిస్తాయి. అందులోనూ నాటకీయత సరిగా పండలేదనే చెప్పాలి. ఇక మణిశర్మ బాణీల్లో రూపొందిన పాటల్లో “మీనాచ్చీ…మీనాచ్చీ…“, “రాశానిలా…“ పాటలు మెలోడీని మిక్స్ చేసుకొని మురిపించాయి. ఐటమ్ సాంగ్ సోదీలోనే లేకుండా పోతుంది. సురేశ్ రగుతు కెమెరా పనితనం కొన్ని చోట్ల కనువిందు చేస్తుంది.
ప్లస్ పాయింట్స్
శ్రీవిష్ణు, కేథరిన్ నటించడం
ద్వితీయార్దంలో కొన్ని ట్విస్టులు
మణిశర్మ సంగీతం
మైనస్ పాయింట్స్
ప్రథమార్ధం పేలవంగా ఉండడం
సాగదీసినట్టుండే కథ, కథనం
రేటింగ్ : 2.25/ 5
ట్యాగ్ లైన్ : `భళా` అనిపించని `తందనాన`
తాజావార్తలు
-
India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!