JetLee Movie Review: జెట్ లీ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Actors Satya, Rhea Singha, Ajay, Vennela Kishore and others
- DIRECTOR: ritesh rana
- MUSIC: kala Bhairava
- PRODUCER: cherry
JetLee Movie Review: కమెడియన్ సత్య హీరోగా, ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజ్ దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘జెట్ లీ’. ఈ సినిమాలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా నటించగా.. సత్యతో పాటు అజయ్, వెన్నెల కిషోర్, కబీర్ దుల్హన్ సింగ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాని మే డే సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
జెట్ లీ కథ:
ప్రజాపతి (అజయ్) ఒక బిజినెస్ మ్యాన్. ప్రజాపతి పేరుతో బ్యాంకు నిర్వహిస్తూ, ఆ బ్యాంకులో 15 వేల కోట్ల డబ్బులను ఒకచోట ఇన్వెస్ట్ చేసి నష్టపోతాడు. ప్రజలందరూ అతని బ్యాంకు నుంచి డబ్బు ఇప్పించాలని ధర్నాలకు దిగుతున్న క్రమంలో, అతను దుబాయ్ పారిపోతుంటాడు. అయితే, ఈ స్కామ్‌లో ఉన్న మిగతా వ్యక్తులు ప్రజాపతిని చంపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, ఇండియన్ ఏజెంట్స్ అతన్ని పట్టుకుని ఇండియా వచ్చేలా ప్లాన్ చేస్తారు. ఈ మధ్యలో ఎస్కేప్ అవ్వాలనేది అతని ప్లాన్. మరి ప్రజాపతి ప్లాన్ వర్కవుట్ అయిందా? మధ్యలో ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ వేదవ్యాస్( సత్య ) పాత్ర ఏమిటి? మరోపక్క సినీ సుడోకు ఆడుకునే వెన్నెల కిషోర్ పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
శ్రీ సింహా హీరోగా రూపొందించిన ‘మత్తు వదలరా’ సినిమాతో రితేష్ రానాకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వెన్నెల కిషోర్‌తో చేసిన ‘హ్యాపీ బర్త్ డే’ వర్కవుట్ కాకపోయినా, ‘మత్తు వదలరా 2’ బాగానే వర్కవుట్ అయింది. ఇక ఇప్పుడు సత్య హీరోగా రూపొందించిన ఈ సినిమా విషయంలో మాత్రం, దర్శకుడు పూర్తిగా తన స్టైల్ కామెడీ మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. వన్ లైనర్లతో, క్విర్కీ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు.
అది ఫస్టాఫ్ వరకు కొంతవరకు వర్కవుట్ అయింది కానీ, సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కథను అనేక రకాల మలుపులు తిప్పుతూ చేసిన ప్రయోగం బెడిసికొట్టినట్లే అనిపించింది. నిజానికి, ఈ దర్శకుడి సినిమా అంటే ఎలా ఉంటుందో అని వచ్చే ప్రేక్షకులకు తన స్టైల్ చూపించే ప్రయత్నం చేసినా, పూర్తిస్థాయిలో అది వర్కవుట్ కాలేదేమో అనిపించింది. చాలా చోట్ల వన్ లైనర్లు బాగున్నా, అవి కేవలం జెన్-జీ (Gen-Z) లేదా సోషల్ మీడియా ఎక్కువగా వాడే వారికి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎన్నో సినిమాలను, సినిమాల్లోని కొన్ని మేనరిజమ్స్‌ని అనుకరిస్తూ ప్రయత్నం చేసినా, పూర్తిస్థాయిలో నవ్వు మాత్రం తెప్పించలేకపోయారు. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు భావించేలా ఉండడం మైనస్ పాయింట్. ఫస్టాఫ్ కొంతవరకు నవ్విస్తుంది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోదు. కావాలని రాసుకున్న కొన్ని ట్విస్టులు పేలకపోగా, ఎబ్బెట్టుగా అనిపించాయి.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే.. సినిమాలో సత్య తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. ఇక కనిపించిన ప్రతిసారి వెన్నెల కిషోర్ కూడా నవ్వించాడు. అజయ్, హీరోయిన్ రియా సింఘా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఒకరకంగా చెప్పాలంటే, సత్య తనదైన ముఖ కవళికలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు, ఉన్న రెండు పాటలు కూడా ఆకట్టుకునేలా లేవు. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ఏమాత్రం ప్లస్ అవ్వలేదనిపించింది. సెకండ్ హాఫ్ నిడివిని ఇంకా కట్ చేయొచ్చు. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. ఫ్లైట్ ఇన్నర్ పోర్షన్స్‌ను మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి క్రియేట్ చేసింది, అవి చాలా వరకు రియలిస్టిక్‌గానే అనిపించాయి.
ఫైనల్లీ: జెట్ లీ.. నాట్ అప్ టు ది మార్క్.
తాజావార్తలు
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!