Bhagavanth Kesari Movie Review: భగవంత్ కేసరి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Nandamuri Balakrishna, Kajal Aggarwal, Sreeleela
- DIRECTOR: Anil Ravipudi
- MUSIC: Thaman S
- PRODUCER: ahu Garapati, Harish Peddi
టైటిల్: భగవంత్ కేసరి
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్ఎస్ థమన్
విడుదల తేది: అక్టోబర్ 19, 2023
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద ఏర్పడ్డ అంచనాలు అమాంతం పెంచేసింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చేసిన నేపథ్యంలో ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
కథ:
ఒక ఊచకోత కేసులో జైలుకు వెళ్లిన అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి( నందమూరి బాలకృష్ణ) అక్కడి జైలర్( శరత్ కుమార్)కు దగ్గరవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో జైలర్ మరణించే క్రమంలో తన బిడ్డ విజ్జి పాప (శ్రీ లీల)ను ఆర్మీలో జాయిన్ చేయమని కోరతాడు. దీంతో జీవితం అంతా వదిలేసుకొని ఆమెను పెంచే పనిలో ఉంటాడు కేసరి. మరోపక్క రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రభుత్వంతో కలిసి చేస్తున్న డ్రగ్స్ దందాను బయటపెట్టడానికి ప్రయత్నించిన డిప్యూటీ సీఎం (శుభలేఖ సుధాకర్)ను చంపి అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెంటాడుతూ ఉంటారు. అయితే విజ్జి పాపను చంపేందుకు సంఘ్వీ ప్రయత్నించడంతో కేసరి రంగంలోకి దిగాడు. సంఘ్వీతో పాత బాకీకి కొత్త బాకీ కలిపి తీర్చేస్తానని కేసరి అంటాడు. అయితే అసలు కేసరికి సంఘ్వీతో ఉన్న పగ ఏంటి? కేసరి అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడు? విజ్జి పాప మిలిటరీ లో జాయిన్ అయిందా? కేసరిని ఇష్టపడిన కాత్యాయని (కాజల్) తన ప్రేమను వ్యక్తం చేసిందా? సంఘ్వీ చివరికి ఏమయ్యాడు? విజ్జి పాపను రక్షించుకోవడం కోసం కేసరి ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపిస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతూ వస్తున్నారు. అన్నట్టుగానే బాలయ్యను మునుపెన్నడూ లేనివిధంగా నేల కొండ భగవంత్ కేసరి అనే పాత్రలో కనిపించారు. జైలు జీవితం గడిపే వ్యక్తిగా నిజాయితీ గల ఒక పోలీసు అధికారిగా ప్రాణంలా పెంచుకునే విజ్జి పాప ను కాపాడుకోవడం కోసం పరితపించే వ్యక్తిగా భిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపించాడు. మొదటి భాగం అంతా భగవంత్ కేసరి జైల్లో జైలర్ ను కలవడం ఆ తరువాత ఆయన కుమార్తెతో బాండింగ్ ఏర్పడడం చూపించారు. తరువాత జైలర్ చనిపోవడంతో విజ్జి పాప బాధ్యత తీసుకుని ఆమెను ఆర్మీలో చేర్చే ప్రయత్నం చేస్తూ ఈ క్రమంలో ఆమె తనను అసహ్యించుకునే స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్లడం వంటి విషయాలు ఆసక్తికరంగా రాసుకున్నా కొన్ని సీన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ లో అప్ టు మార్క్ అనిపించవు. రాహుల్ సంఘ్వీ బిజినెస్, డ్రగ్స్ దందా కోసం ఏకంగా డిప్యూటీ సీఎంను చంపడం కొంచెం. వాస్తవికతకు దూరం అనిపిస్తుంది లాజిక్స్ కి అందదు. ఇక ఇంటర్వల్ బ్లాక్ అయితే అబ్బుర పరిచేలా రాసుకున్నాడు. అలాగే సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ అందించాడు. ఇక సెకండ్ హాఫ్ మొదట్లోనే అసలు సంఘ్వీ తో ఉన్న గొడవ ఏంటి? అనే విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్పేసి అసలు కథలోకి తీసుకు వెళ్లి సంఘ్వీతో కేసరి యుద్ధం మొదలు పెట్టేలా చేయడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. భగవంత్ కేసరి ఎమోషనల్ గా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ కే కథ మీద ఆసక్తి కలుగుతుంది. భగవంత్ కేసరి యాక్షన్ బ్లాక్‌లు, డైలాగ్‌లు, ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా డైరెక్ట్ చేశాడు మెరుగైన మరియు ఆకర్షణీయమైన ద్వితీయార్థాన్ని అందిస్తుంది, ఇది పండుగ సీజన్‌లో ఒకసారి చూసేలా చేస్తుంది. ఇక అనిల్ రావిపూడి మార్క్ కామెడీ పూర్తి స్థాయిలో లేదు కానీ ఉన్నంతలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు అనిల్. అయితే ఈ సినిమాలో అమ్మాయిని సింహం లెక్క పెంచాలి అనే పాయింట్ ను ప్రధానంగా చూపించే ప్రయత్నం చేయడమే కాదు చైల్డ్ అబ్యూజ్ మీద కూడా గట్టి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆడది వంట గదికి మాత్రమే పరిమితం కాదు అని చెబుతూనే తలుచుకుంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయచ్చు అని గట్టి సోషల్ మెసేజ్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే కొత్త కథ అని చెప్పలేం కానీ ఉన్నంతలో బాలకృష్ణను కొత్తగా ప్రెజెంట్ చేసినట్టు అనిపించింది.
ఇక ఎవరెలా చేశారు అంటే ముందు నటీనటుల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ అయితే నేలకొండ భగవంత్ కేసరి అనే పాత్రలో ఒదిగిపోయాడు. మూడు భిన్నమైన గేటప్స్ లో కనిపిస్తూ తనదైన వేరియేషన్స్ చూపించాడు. ముందు నుంచి ఆయన తెలంగాణ యాసలో ఎలా మాట్లాడతాడు? ఒకవేళ త్రోల్ అవుతాడా? అని అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ పాత్రలో లేనమైపోయాడు. కొన్ని ఫోబయాలతో బాధపడుతూ చాలా భయంతో పెరిగిన విజ్జీ పాప అనే పాత్రలో శ్రీలీల కూడా సరిగ్గా నప్పింది. మొదటి భాగం చూసి ఇలాంటి పాత్ర ఎందుకు ఎంచుకుందా? అనే అనుమానం కలుగుతుంది కానీ సెకండ్ హాఫ్ కి తరువాత ఈ పాత్రకు ఆమె సూటబుల్ అని చెప్పొచ్చు. కాజల్ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో ఆమె ఆకట్టుకునేలా నటించింది. కానీ ఆమె పాత్రను ఇరికించినట్టు అనిపించింది. ఇక విలన్ గా అర్జున్ రామ్ పాల్ కూడా తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఇక శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, వీటీవీ నగేష్, మురళీధర్ గౌడ్, రఘుబాబు, జయచిత్ర, రచ్చారవి, శ్రవణ్ రాఘవేంద్ర వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ సినిమాను మలుపులు తిప్పే పాత్రలో కనిపించారు. ఇక టెక్నికల్ టీమ్ విషయనింక్ వస్తె కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అలాగే డైరెక్షన్ కూడా చూసుకున్న అనిల్ రావిపూడి తన జోన్ లో నుంచి బయటకు వచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కమర్షియల్ మసాలా కూడా అంటించే విషయంలో సక్సెస్ అయ్యాడు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మలిచే విషయంలో రైటింగ్ టీం కూడా చాలా సహాయపడినట్టు అనిపించింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. మ్యూజిక్ గురించి మాట్లాడాలి అంటే ఉన్న మూడు పాటలతో ఆకట్టుకున్న తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. తమన్ కి బాలయ్యను చూస్తే పూనకం వస్తుంది ఏమో అనెంతలా ఆయన రెచ్చిపోయి ఆరార్ ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మంచి అందాన్ని తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్పెషల్ గా ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. పరిసరాల్లో ఉన్న వాటినే ఆయుధాలుగా మలిచి బాలకృష్ణ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు విజిల్స్ వేయించెలా ఉన్నాయి.
ఫైనల్లీ: ఈ నేలకొండ ‘భగవంత్ కేసరి’ని పండుగ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు.
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!