Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Ante Sundaraniki Review In Telugu

Ante Sundaraniki Review: అంటే సుందరానికీ…

Published Date :June 10, 2022 , 5:46 am
By Subbarao N
Ante Sundaraniki Review: అంటే సుందరానికీ…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Rating : 3 / 5

  • MAIN CAST: Nani, Nazriya Fahadh
  • DIRECTOR: Vivek Athreya
  • MUSIC: Vivek Sagar
  • PRODUCER: Mythri Movie Makers

లాస్ట్ ఇయర్ ‘ఉప్పెన’, ‘పుష్ప’తో వరుస విజయాలను అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ యేడాది ‘సర్కారు వారి పాట’తో హ్యాట్రిక్ అందుకుంది. అదే ఊపుతో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీని జనం ముందుకు తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేశారు. ఇక నాని కెరీర్ గ్రాఫ్ ‘వి’, ‘టక్ జగదీశ్’, శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కాస్తంత డౌన్ అయ్యింది. దాంతో అతని వరకూ ఈ సినిమా లిట్మస్ టెస్ట్ గా మారింది. ఇక ‘మెంటల్ మదిలో…’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయకు మైత్రీ మూవీ మేకర్స్, నాని ఓ మంచి అవకాశం ఇచ్చారనే చెప్పాలి.

కథ విషయానికి వస్తే…. సుందర్ సత్ సంప్రదాయాలను పాటించే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుండి అతని ఇంట్లో ఆచార వ్యవహారాలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకానొక సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుందర్ కి సినిమాల్లో ఛాన్స్ వచ్చి ఫారిన్ వెళ్ళాల్సి ఉండి, చివరి నిమిషంలో తప్పిపోతుంది. దాంతో కొడుకు జాతకంలో ఏదో లోపం ఉందని తండ్రి గ్రహించి, జ్యోతిష్కుడు జోగారావుని ఆశ్రయిస్తాడు. అక్కడ నుండి సుందర్ జీవితమే మారిపోతుంది. ప్రతి చిన్నవిషయానికి దోష పరిహారమంటూ రకరకాల హోమాలు చేయిస్తుంటాడు జోగారావు. వాటిని తప్పించుకోవడానికి సుందర్ సైతం అబద్ధాలు ఆడటం మొదలెడతాడు. తన క్లాస్ మేట్ లీలా థామస్ ను ప్రేమించినా ఆ విషయం ఇంట్లో చెప్పడు. అలానే అమెరికా వెళ్లడానికి ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ రకరకాల అబద్దాలు ఆడతాడు. ఇదే పరిస్థితి అక్కడ లీలా థామస్ ఇంట్లోనూ జరుగుతుంది. హిందువుల ప్రసాదం తీసుకోవడానికే ఇష్టపడని ఆమె తండ్రి, బ్రాహ్మణుడైన సుందర్ కి ఇచ్చి తనను పెళ్ళి చేయడనే విషయం అర్థమైపోతుంది. అందుకే సుందర్ సలహా మేరకు ఆమె ఇంట్లో ఓ అబద్ధం ఆడితే, ఇక్కడ సుందర్ మరో అబద్ధం ఆడతాడు. పెళ్ళి చేసుకోవడం కోసం వాళ్ళు ఆడిన ఆ దారుణమైన అబద్ధాలు వీళ్ళ జీవితాలను ఎలా అల్లకల్లోలం చేశాయన్నదే మిగతా సినిమా!

Also Read

  • 'Gaayapadda Simham' Movie Review: గాయపడ్డ సింహం మూవీ రివ్యూ
  • JetLee Movie Review: జెట్ లీ మూవీ రివ్యూ
  • Dhanush 'Kara' Movie Review: ధనుష్ 'కర' మూవీ రివ్యూ
  • Gedela Raju Review: గేదెల రాజు రివ్యూ
Add as a preferred
source on google

రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకోవడం, ఇంట్లో పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తారనుకున్నప్పుడు ఊరు వదిలి పారిపోవడం, ఆ తర్వాత రకరకాల సమస్యలు ఎదుర్కోవడంపై చాలా సినిమాలూ వచ్చాయి. పరువు హత్యలకు దారి తీసిన సంఘటనల నేపథ్యంలోనూ కొన్ని మూవీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ అబద్దాలు ఆడి, తద్వారా పెద్దల సానుభూతి పొంది, రెండు వేర్వేరు మతాలకు చెందిన ప్రేమికులిద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. నిజానికి ఇటు సుందర్, అటు లీలా కుటుంబ సభ్యులు సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే వారే కానీ పిల్లల మీద కక్షసాధింపుకు దిగి వారి అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు కాదు. కానీ అటువంటి వారిని మభ్య పెట్టాలని వీరు అనుకోవడం, దానికోసం ఘోరమైన అబద్ధాలు ఆడటంతో హీరోహీరోయిన్ల పాత్రలు పలచనైపోయాయి. సుందర్ పట్ల, అతని అగచాట్ల పట్ల అప్పటి వరకూ సానుభూతి చూపిన ప్రేక్షకులు కూడా ‘వీడు సామాన్యుడు కాదు’ అనే అభిప్రాయంలోకి వచ్చేస్తారు. అక్కడ నుండి ఆ పాత్రను ఓన్ చేసుకోవడం మానేసి… అతని పట్ల నెగెటివ్ ఇంప్రషన్ ను క్రియేట్ చేసుకుంటారు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వీరిద్దరూ తప్పు మీద తప్పు చేస్తూ పోతారు. ఒకానొక సమయంలో ఆ తప్పే ఒప్పై వారిని ఇరకాటాన పెట్టినప్పుడు కూడా ప్రేక్షకుల నుండి సానుభూతి లభించదు. అయితే ఆ సమయంలో దర్శకుడు కాస్తంత సెంటిమెంట్ కు చోటు కల్పించి, హీరోలో మానవీయ కోణాన్ని వెలికి తీసి, కథను సుఖాంతం చేశాడు. ఇక హీరో సుందరే ఫేక్ అనుకుంటే హీరోయిన్ లీలా ఇంకా పెద్ద ఫేక్ అని చెప్పడం కొసమెరుపు!

‘అంటే సుందరానికీ…’ అనే పేరును ఈ సినిమాకు పెట్టినప్పుడే ఇదో అడల్ట్ కామెడీ మూవీ అనే భావన చాలా మందికి కలిగింది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి పేరున్న నానితో అలాంటి సినిమాను వివేక్ ఆత్రేయ ఎలా తీస్తాడో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. బట్… ఈ విషయంలో హద్దులు మీరకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గానే వివేక్ ఆత్రేయ తాను రాసుకున్న కథను తెరకెక్కించాడు. అయితే ఇక్కడో చిన్న విషయం ఉంది. సంప్రదాయాన్ని పాటించడం, జ్యోతిష్యాన్ని నమ్మడం, సమస్యల పరిహారార్థం హోమాలు చేయడం అనేది వారి వారి నమ్మకం. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. కానీ ప్రోగ్రెసివ్ థాట్స్ అనే పేరుతో దర్శకులు కొన్నిసందర్భాలలో అవసరం లేకున్నా ఎదుటి వారి నమ్మకాన్ని అవహేళన చేస్తున్నారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. మతం కంటే మానవత్వం గొప్పదని, సాటి మనిషికి సాయం చేయడం కంటే మనం చేసే మంచిపని మరొకటి లేదనే విషయాన్ని దర్శకుడు అంతర్లీనంగా ఈ ప్రేమకథలో చెప్పాడు. అంతేకాకుండా…. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదని, రెండు కుటుంబాల కలయిక అని తెలిపాడు. సంతోషం!!

సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ సంభాషణలతో నవ్వుల పువ్వులు పూయించాడు. ప్రతి సన్నివేశంలో సంభాషణలు చమక్కుమన్నాయి. అయితే సినిమా నిడివి విషయమై దృష్టి పెట్టకపోవడం అతను చేసిన అతి పెద్ద తప్పు. సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. ప్రథమార్ధం మాత్రమే కాదు, ద్వితీయార్థంలోనూ ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వివేక్ సాగర్ తన స్థాయి బాణీలను ఇందులో ఇవ్వలేకపోయాడు. సినిమా చూసిన తర్వాత హమ్ చేయదగ్గ పాట ఒక్కటీ కనిపించదు. బహుశా ఆ లోటును తీర్చుకోవడం కోసమే కావచ్చు, క్యాచీ ట్యూన్ తో డాన్స్ నంబర్ గా ప్రమోషనల్ సాంగ్ ను చివరిలో విడుదల చేశారు. అయితే వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చక్కగా బాగున్నాయి. ఎడిటర్ రవితేజ గురిజాలకు మాత్రం దర్శకుడు ఎక్కడా స్వేచ్చ ఇచ్చినట్టు కనిపించలేదు.

నటీనటుల విషయానికి వస్తే… సుందర్ గా నాని అదరగొట్టేశాడు. అతని క్యారెక్టరైజేషన్ లో లోపం ఉందేమో కానీ నాని నటనను వంక పెట్టడానికి లేదు. ఇక మల్లూవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చిన నజ్రియా… లీలా థామస్ పాత్రను బాగానే పోషించింది. ముఖ్యంగా మొదటి సినిమాలోనే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. బట్ ఎందుకో ఆ పాత్రలో అంత ఫ్రెష్ నెస్ కనిపించలేదు. చిత్రం ఏమంటే నటి అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఆ విషయాన్ని మూవీ టీమ్ ఎందుకో గోప్యంగా ఉంచింది. నిజానికి అంత దాచాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ పక్క సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో ఇలాంటి సహాయ పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు. బహుశా నిర్మాణ సంస్థ మీద ఉన్న అభిమానంతో నటించి ఉండొచ్చు. ఇక హీరో తల్లిదండ్రులుగా రోహిణి, నరేశ్‌, నానమ్మగా అరుణా భిక్షు, హీరోయిన్ తల్లిదండ్రులుగా నదియా, తమిళ నటుడు అళగన్ పెరుమాళ్, అక్కగా మలయాళీ నటి తన్వీ రామ్ నటించారు. వినోదాన్ని అందించే బాధ్యతను అలీ, హర్షవర్థన్, పృథ్వీ, రాహుల్ రామకృష్ణ తమ భుజాల కెత్తుకున్నారు. ఆ మధ్య వచ్చిన ‘స్టాండప్ రాహుల్’లో నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా ఇందులోనూ ఓ పాత్రలో మెరిశాడు. సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు, వారి నుండి చక్కని నటనను వివేక్ ఆత్రేయ రాబట్టుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఖర్చు విషయంలో రాజీ పడలేదనేది తెలుస్తూనే ఉంది. అయితే ఇలాంటి సినిమాలను థియేటర్లో చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయగలరు.

రేటింగ్ : 3 / 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల యాక్టింగ్
డైలాగ్ కామెడీ
సినిమాటోగ్రఫీ, ఆర్.ఆర్.!

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
నిడివి ఎక్కువ కావడం
పండని ఎమోషనల్ సీన్స్

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ante Sundaraniki
  • Ante Sundaraniki Movie Review
  • Ante Sundaraniki Review
  • Ante Sundaraniki Review in Telugu
  • Mythri Movie Makers

తాజావార్తలు

  • Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..

  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..

  • MK Stalin-Rajinikanth: స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions