Ace Movie Review: మహారాజా లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఆయన తమిళంలో నటించిన “ఏస్” అనే సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేశారు. రుక్మిణి వసంత్ మొట్టమొదటి చిత్రంగా రూపొందిన ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఏసు కథ: మలేషియాలో ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) అక్కడికి వెళ్తాడు. తన స్నేహితుడి స్నేహితుడైన జ్ఞానానందం (యోగి బాబు) రూమ్‌లో ఉంటూనే, అతను తన ప్రేయసిగా చెప్పుకునే కల్పన (దివ్య పిళ్లై) దగ్గర పనికి చేరతాడు. అయితే, కాశీ అనుకోకుండా బస్సులో పరిచయమైన రుక్కు (రుక్మిణి వసంత్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కోసం పదివేల మలేషియన్ రింగ్గిట్లు సంపాదించడం కోసం పేకాట మొదలుపెట్టి, అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. ఆమెకు తెలియకుండా ఆమె కోసం బ్యాంకుకు కన్నం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, పోలీసులు కాశీని పట్టుకున్నారా? చివరికి రుక్మిణి, కాశీ కలిశారా? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది కేవలం విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పరిచయాలతో సరిపోతుంది. అసలు కథ మొదలు అవ్వడానికి చాలా టైం తీసుకునా ఫస్ట్ హాఫ్‌లో విజయ్ సేతుపతి, యోగిబాబు ట్రాక్.. హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ వంటి సీన్స్ తో సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్‌కు అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ అంతా కూడా అక్కడే తిరిగినట్టు అనిపిసున్నా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బోర్ కొట్టించకుండా రాసుకున్నాడు. ప్రేక్షకుల ఊహకు అందేలానే కథనం సాగుతూ ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణి వసంత్ క్యూట్ నెస్ ఆ లోపాల్ని పెద్దగా గుర్తుంచుకునేలా చేయలేదు. సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా ఉంది. క్లైమాక్స్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆకట్టుకుంటుంది. సీక్వెల్ కు చాన్స్ ఇస్తూ రాసుకున్నారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే
బోల్ట్ కాశీగా విజయ్ సేతుపతి కొత్త తరహా పాత్రలో కనిపించాడు. మొదటి సారి డార్క్ కామెడీ ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఇక యోగి బాబు అయితే ఆద్యంతం నవ్విస్తాడు. చాలా కాలం తర్వాత ఫుల్ లెన్త్ రోల్ పడింది. ఇక రుక్మిణి వసంత్ అందాలతో పాటు క్యూట్ నెస్ అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంది. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర పడింది. బబ్లూకి రెగ్యులర్ రోల్ అయినా ఆకట్టుకునేలా ఉంది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. టెక్నికల్ టీం విషయానికి వస్తే విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.
ఫైనల్లీ : ఈ ఏస్ ఒక టైం పాస్ క్రైమ్ కామెడీ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్