అమెరికన్ తెలుగు ప్రోగ్రసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా లో వివిధ నగరాలలో డల్లాస్, అట్లాంటా, బే ఏరియా, షార్లెట్, కాపిటల్ ఏరియా లలో శాస్త్రోక్తంగా, ఆట పాటలతో శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 3000 మెంబెర్స్ పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు, ఉగాది పచ్చడి రుచి చూసారు.
ఈ కార్యక్రమాలలో భారతీయ సంస్కృతీ ఉట్టి పడేలా భరతనాట్యం, కూచిపూడి క్లాసికల్ నృత్య ప్రదర్శనలు, మహిళల ముగ్గుల పోటీలు, పతంగులతో కోలా హలంగా చిన్నారులు సందడి చేశారు. ప్రముఖ సంగీత ధర్శకులు మరియు నటులు శ్రీ రఘు కుంచె గారి సంగీత విభావరితో ఆహుతులను అలరించారు
ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా పర్యావరణ సామజిక వేత్త, జనసేన జనరల్ సెక్రటరీ శ్రీ బొలిశెట్టి సత్య, రాష్ట్రపతి చేతులమీదుగా ప్రవాస భారతీయ సన్మాన్ అత్యున్నత పురస్కార గ్రహీత డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ గారు, బోర్డు చైర్ సుబు కోట గారు, వివిధ రాష్ట్రాలనుంచి ఆప్త బోర్డు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ పాల్గొనడం పట్ల ప్రెసిడెంట్ శ్రీ ఉదయ భాస్కర్ కొట్టే గారు హర్షం వ్యక్తం చేశారు..