శ్రీకాకుళంలో అంతర్జాతీయ హోమియోపతి వైద్యం అందుబాటులోకి వచ్చింది. డా॥ కేర్ హోమియోపతి పెయిన్ క్లినిక్ ఇవాళ శ్రీకాకుళంలో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్ధస్త్ యాంకర్ , సినీ నటి అనసూయ భరద్వాజ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం గురించి డా. కేర్ గ్రూప్ CEO డాక్టర్ పి. సృజనా రెడ్డి వివరించారు. డా॥ కేర్ హోమియోపతి పెయిన్ క్లినిక్ నందు దీర్ఘకాలిక ఆస్ట్రియో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రుమటాయిడ్ మరియు గౌటీ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు అత్యాధునిక హోమియో -ద్వారా సంపూర్ణ చికిత్స అందిస్తామన్నారు.
వీటితో పాటు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు పూర్తి చికిత్స అందించబడును. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ హోమియోపతి వైద్య విధానంలో ఎటువంటి వ్యాధులకైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా సంపూర్ణ చికత్స లభిస్తుందని పేర్కొన్నారు. చాలా రకాల జబ్బులకు హోమియోపతి వైద్యం అద్భుతంగా పనిచేస్తుందని, నాకు హోమియోపతి అంటే చాలా అభిమానం అన్నారు. తన కుటుంబ సభ్యులు అంతా కూడా “హోమియోపతి వైద్యం వాడుతున్నామని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి తనకు ఇష్టమైన వైద్యం అని అన్నారు.
Read Also:Top Headlines @9PM: టాప్ న్యూస్
ఈ కార్యక్రమంలో డా॥ కేర్ COO డా. రాజు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కాళ్ళ మరియు కీళ్ళ నొప్పుల నుంచి అన్ని రకాల నొప్పులకు ఈ క్లినిక్ ద్వారా సేవలు ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ కేర్ పెయిన్ క్లినిక్ అందించే సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సేవలను అందించడం మాకు మా వైద్య సిబ్బందికి చాలా గర్వకారణంగా ఉందని, గత 20 సంవత్సరాలుగా హోమియోపతి వైద్యంలో అనుభవం ఉన్న డాక్టర్ కేర్ శ్రీకాకుళంలో డాక్టర్ కేర్ పెయిన్ క్లినిక్ వైద్య సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని డాక్టర్ రాజు తెలిపారు. తాత్కాలిక మరియు దీర్ఘకాలిక వ్యాధులకు మొదటి చాయిస్ హోమియోపతి ఉండాలని హోమియోపతి మందులు -ఇమ్యూనిటీని పెంపొందించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతాయన్నారు. హోమియో మందులు చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయని డా. కేర్ గ్రూప్ CEO డా. సృజన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది ప్రజలకు మరియు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Drone Crash: మెట్రో ట్రాక్‌పై డ్రోన్ క్రాష్.. పోలీసుల హై అలర్ట్..