YCP: వైసీపీ దూకుడుకు ఆ.. జిల్లాలో సొంత నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారార..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి వర్గపోరు తీవ్రంగానే ఉంది. పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్‌ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయిన్పటికీ పరిస్థితి మొదటికొస్తుంది తప్పితే మార్పు లేదట. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్ నరసింహరాజును ఆ మధ్య ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు. తాజాగా మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో ఉండి వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటోంది కేడర్.
ఉండి వైసీపీ ఇంఛార్జ్‌గా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఉండేవారు. ఆయన 2014లో ఓడిపోవడంతో.. 2019లో సర్రాజును కాదని.. పీవీఎల్ నరసింహారాజును బరిలో దించింది పార్టీ. ఈ మార్పూ వర్కవుట్ కాలేదు. ఉండిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని భావించిన వైసీపీ పెద్దలు నరసింహారాజును తప్పించి.. గోకరాజు రామరాజును ఇంఛార్జ్‌గా నియమించారు. ఏమైందో ఏమో.. రామరాజును తప్పించి మళ్లీ నరసింహరాజును తెరపైకి తీసుకొచ్చింది పార్టీ. అసలే గ్రూపుల గోలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో పీవీఎల్‌కు మళ్లీ ఎందుకు పగ్గాలు అప్పగించారన్నది కేడర్ ప్రశ్న. ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ అదే జరుగుతుందని భయపడుతున్నారట. అసలు ఈ పంచాయితీ మనకెందుకు అని భావిస్తున్న కొందరు నేతలు తాజా పరిణామాలు రుచించక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
వైసీపీ గ్రామ కమిటీలలో పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. తనకు అనుకూలంగా ఉన్నవారికే నరసింహారాజు చోటు కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కమిటీలపై వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా సమాచారం లేదట. ఉండిలో వైసీపీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. పీవీఎల్ నరసింహారాజు DCCB ఛైర్మన్‌ను చేశారు. నియోజకవర్గంలో గోకరాజు రామరాజు కుటుంబానికి పట్టు ఉంది. ఇంతచేసినా ఉండిలో వైసీపీకి తేడా కొట్టడానికి కారణం సమన్వయ లోపమే అన్నది కేడర్ చెప్పే మాట. పదవుల్లో ఉన్న నేతలు కేడర్‌ను చేరదీయకపోవడం.. కేడర్ విశ్వసించేలా పనులు చేపట్టకపోవడం పెద్దలోటుగా చెబుతున్నారు. ఇప్పుడు పాతరాజుగారే మళ్లీ ఇంఛార్జ్‌గా వచ్చారు. మరి.. గతంలోలా వర్గాలను ప్రోత్సహిస్తారో… లేక అందరినీ కలుపుకొని వెళ్తారో చూడాలి.
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!