ఎంపీ పదవికి డీఎస్ రాజీనామా చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ను వీడి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన DS.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పాకే కాంగ్రెస్ కండువా కప్పుకొంటారా? నైతికత కింద రాజీనామా చేస్తారా? ఇంకేదైనా వ్యూహం ఉందా?
రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం చూస్తున్నారా?
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో.. కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు సమ్మతి తీసేసుకున్నారు. అయితే డీఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన తర్వాత డీఎస్‌ను పెద్దల సభకు పంపించారు గులాబీ దళపతి. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టీఆర్ఎస్కు దూరమయ్యారు ఈ సీనియర్ పొలిటీషియన్. డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా అధికారపార్టీ నేతలు డిమాండ్ చేశారు కూడా. కానీ.. డీఎస్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ చురుకైన పాత్ర కోసం చూస్తున్నారు శ్రీనివాస్.
రాజ్యసభ సభ్యుడిగా మరో ఆరు నెలలు పదవీకాలం..!
ఎంపీ పదవికి రాజీనామా చేయకపోతే అనర్హత వేటుకు ఆస్కారం..?
అప్పుడప్పుడూ టీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు డీఎస్. తాజాగా కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ఆయన.. రాజ్యసభ ఎంపీ పదవి విషయంలో ఏం చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీగా ఆయన పదవీకాలం మరో ఆరు నెలలే ఉంది. ఎంపీగా పదవీకాలం పూర్తయ్యాక కాంగ్రెస్‌లో చేరితే వచ్చే విమర్శలు వేరలా ఉంటాయి. ఎలాగూ ఆరునెలలే పదవీకాలం ఉండటంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరితే… రాజకీయంగా పైచెయ్యి సాధించవచ్చన్న ఆలోచనలో డీఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి వచ్చే విమర్శలకు గట్టిగానే కౌంటర్ చేయొచ్చని అనుకుంటున్నారట. ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి వెళ్తే.. డీఎస్‌పై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ కోరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అనర్హత వేటు వేయించుకోవడం కంటే ఎంపీ పదవికి రాజీనామా చేయడమే బెటర్ అని డీఎస్ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోందట.
కాంగ్రెస్‌లోకి డీఎస్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో?
ఆ మధ్య సోనియాగాంధీతో డీఎస్ భేటీ తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ ముఖ్యులకు ఢిల్లీ రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. తర్వాత ఏమైందో ఏమో.. ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ చేరిక.. ఆ సందర్భంగా వచ్చే సాంకేతిక సమస్యలు చర్చించారో లేక.. మంచి తరుణం కోసం వేచి చూస్తున్నారో కానీ.. చేరిక ఎప్పుడున్నది సస్పెన్స్‌లో పెట్టారు. కాంగ్రెస్‌లో నేరుగా హైకమాండ్‌తో సంబంధాలు ఉన్న నేత కావడంతో DSపై పీసీసీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మరి.. కాంగ్రెస్‌లోకి డీఎస్ రీ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో.. టీఆర్ఎస్ నుంచి వెళ్తూ వెళ్తూ.. ఎవరిని కలవరపెడతారో చూడాలి.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్‌పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!