Off The Record: వైసీపీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోందా? చిరంజీవికి అవమానం విషయంలో ఇప్పుడు లేస్తున్న నోళ్ళన్నీ అప్పుడేమయ్యాయ్? జగన్ నన్ను అవమానించలేదని స్వయంగా చిరంజీవి ప్రకటించేదాకా… వైసీపీ మౌత్ పీస్లన్నీ ఎందుకు సౌండ్ చేయలేక పోయాయి? ఎలాంటి అవమానం జరగలేదని నాడు ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? ఆ వైఖరి వల్లే కాపుల పరంగా వైసీపీకి డ్యామేజ్ జరిగిందా? లెట్స్ వాచ్.
Read Also: Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ పోటీ.. కత్తిపోట్లతో దద్దరిల్లిన విశాఖ..
ఏపీలో ఇప్పుడు ఒకటే టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవి టార్గెట్‌గా బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై మెగా అభిమానులతో పాటు సగటు వైసీపీ కార్యకర్త కూడా ఫైర్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయ్యిందట. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు బాధపడుతున్నారు సరే… ఇదే బాధ అప్పుడెందుకు పడలేదు? ఈ వాయిస్ నాడెందుకు రెయిజ్ అవలేదు? ఇదే పని అప్పుడే చేసి ఉంటే… జరిగిన డ్యామేజ్‌లో ఎంతో కొంత కవర్ అయి ఉండేదికదా అన్న చర్చలు నడుస్తున్నాయట ఫ్యాన్ సర్కిల్స్‌లో. పార్టీలో కీలకంగా ఉన్నవారు తమ వర్షన్‌ను నాడు సరిగా చెప్పుకోలేకపోవటం వల్లే ఓ సామాజిక వర్గం దాదాపుగా దూరం అయిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి వైసీపీలో. నటుడిగా చిరంజీవి అందరి వాడు అయితే కావచ్చుగానీ.. కాపు సామాజిక వర్గం మాత్రం ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గానే చూస్తోంది. ఆయనకు అవమానం జరిగితే తమకు జరిగినట్టేనని భావించే వాళ్ళకు ఆ సామాజికవర్గంలో కొదవలేదు.
Read Also: Off The Record: తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా? ఆగుతాయా?
ఎన్నికలకు ముందు అదే పాయింట్‌ని బేస్ చేసుకుని ప్రచారం చేశారు కూటమి నాయకులు. జగన్ తన అన్నను అవమానించారంటూ.. పవన్ కళ్యాణ్ దాదాపు ప్రతి సభలో ప్రస్తావించారు. అప్పట్లో.. అది ప్రత్యేకించి కాపుల్లో బాగా నాటుకు పోయిందన్నది విశ్లేషకుల మాట. అంత జరుగుతున్నా.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారెవరూ అప్పట్లో ఆ అంశాన్ని లైట్ తీసుకోవటం వల్లే.. భారీ డ్యామేజ్ జరిగిందన్న అంచనాలున్నాయి. తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ టంగ్ స్లిప్ కావటం, దానికి నొచ్చుకున్న చిరంజీవి లేఖ విడుదల చేయటంతో.. అప్పుడు అసలు జరిగింది ఇదీ.. అంటూ వైసీపీ నేతలు కూడా బృందగానం ఆలపిస్తున్నారుగానీ.. ఇవే నోళ్ళు అప్పుడే గట్టిగా మాట్లాడిఉంటే.. ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి వైసీపీ సర్కిల్స్‌లో. నాడు జగన్‌తో సినీ పరిశ్రమ పెద్దల భేటీ సందర్భంగా ఆయనకు చిరంజీవి దండంపెట్టి బతిమాలుకుంటున్న వీడియో హైలైట్ అయింది.
Read Also: Jagtial: ప్రాణం తీసిన ప్రేమ.. యువకుడిని కొట్టి చంపిన ప్రియురాలి కుటుంబీకులు..!
ఈ అంశాన్ని ఉపయోగించుకునే పవన్.. కాపు సామాజిక వర్గాన్ని కూటమికి ఒన్ సైడ్ చేయగలిగారన్న అభిప్రాయాలు కొన్ని వర్గాల్లో ఉన్నాయి. అయితే అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టిన పేర్ని నాని…ఇప్పుడు ఇచ్చిన స్థాయిలో అప్పుడే క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉందట పార్టీ వర్గాల్లో. మరోవైపు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కాపు సామాజిక వర్గ నేతలు కూడా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లి తగిన రెమిడీ ఆలోచించక పోవటం వల్లే ఆ సామాజిక వర్గంతో ఎక్కువ దూరం పెరిగిందని అంచనా వేస్తున్నారు. నాకు ఎలాంటి అవమానం జరగలేదని ఇప్పుడు చిరంజీవి లేఖ రాశాక దాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మేము అప్పుడు చెప్పింది కూడా ఇదేగానీ.. తాము చెప్పిన నిజాల కన్నా.. వాళ్లు చెప్పిన అబద్దాలే ఎక్కువగా జనాల్లోకి వెళ్లాయనేది ఫ్యాన్ పార్టీ వర్షన్. చిరంజీవి లేఖ విడుదల చేసిన తర్వాత ఆర్. నారాయణమూర్తి లాంటి సీనియర్ కూడా రియాక్ట్ కావటం.. ఆ రోజు తమను జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారంటూ.. అప్పటి పరిణామాలను వివరించటంతోనే అసలు విషయాలు బయటకు వచ్చాయిగానీ.. లేకుంటే వైసీపీ ఇప్పటికీ బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదంటున్నారు పరిశీలకులు.
Read Also: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
ఇక, వైసీపీలో బిగ్ సౌండ్ చేయగలిగిన అదే సామాజిక వర్గానికి నేతలు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ లాంటి వాళ్ళంతా.. అప్పుడే ఈ స్థాయిలో నోరు తెరిచి ఉంటే.. కొంత వరకు డ్యామేజ్ తగ్గి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో పాతిక శాతానికి పైగా ఓటు బ్యాంక్ తో బలంగా ఉన్న కాపుల విషయంలో అప్పట్లోనే అలర్ట్‌గా ఉంటే.. ఈ స్థాయి నష్టం జరిగి ఉండేది కాదని వైసీపీ నేతలే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట. సరే… జరిగిందేదో జరిగిపోయింది.. కనీసం చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తారా? నాడు జగన్ చిరంజీవిని అవమానించలేదన్న విషయాన్ని కాపు సామాజికవర్గంలోకి బలంగా తీసుకువెళ్ళగలరా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయట వైసీపీ సర్కిల్స్‌లో.