Site icon NTV Telugu

Off The Record: లోకేష్ రాజమండ్రి టూర్ రద్దు వెనక బలమైన కారణాలే ఉన్నాయా?

Lokesh

Lokesh

Off The Record: మంత్రి నారా లోకేష్‌ రాజమండ్రి టూర్‌ తరచూ ఎందుకు వాయిదా పడుతోంది? ఇప్పటికి మూడు సార్లు ముహూర్తాలు పెట్టి కూడా ఎందుకు క్యాన్సిల్‌ చేసుకున్నారు? పైకి చెబుతున్న రొటీన్‌ బిజీ డైలాగేనా? లేక అంతకు మించినవి ఉన్నాయా? నిజంగానే బిజీ రీజన్‌ అయితే… ఆయన షెడ్యూల్‌ గురించి తెలియకుండానే టూర్‌ ప్రోగ్రామ్‌ ఫిక్స్‌ చేస్తారా? వాయిదా పర్వం వెనక ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ కూడా ఉన్నాయన్నది నిజమేనా? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి?

Read Also: Alcohol Sprinkling: మద్యం తాగే ముందు చేసే ఈ చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలుసా..?

ఏపీ మినిస్టర్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి పర్యటన ఒకసారి కాదు.. ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. లోకల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ సబ్జెక్ట్‌. ఎలాంటి బలమైన కారణం లేకుండా.. ఆ స్థాయి నాయకుడి పర్యటనను ఏకంగా మూడు సార్లు ఫిక్స్‌ చేసి వెంటనే ఎందుకు కేన్సిల్‌ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడులు కోసం చేస్తున్న టూర్స్‌ కారణంగా ఆయన రాజమండ్రి రాలేకపోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నా… అంతకు మించిన బలమైన కారణాలే ఉన్నాయన్నది విస్తృతాభిప్రాయం. ఇదే అదనుగా.. స్థానిక టీడీపీ నేతల అవినీతి, అరాచకాలే అందుకు కారణం అంటూ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రవేశ ద్వారం, నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు, విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Read Also: Seediri Appalaraju: ఇంగ్లీష్ మీడియం తెచ్చింది మేము.. ఆపింది మీరు!

కానీ, ఈ ప్రోగ్రామ్‌ రెండు నెలల్లో మూడుసార్లు వాయిదా పడింది. ప్రతిసారి మూడు సార్లు డేట్స్‌ ఫిక్స్ చేయడం, తర్వాత మంత్రి పర్యటన రద్దు కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వైసీపీ విమర్శల సంగతి ఎలా ఉన్నా… వాయిదా పర్వానికి ప్రత్యేక కారణాలు ఉండి ఉండవచ్చని టీడీపీ కేడర్‌లోనే చర్చ జరుగుతోందట. ఇటీవల లోకల్‌గా పార్టీకి సంబంధించి పలు అంశాలు రచ్చకెక్కాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబును నియమించారు. ప్రమాణస్వీకారం కూడా చేయకముందే… మద్యం సిండికేట్ కార్యకలాపాలు, అందులో ఆయన ప్రమేయానికి సంబంధించిన ఆడియో టేపులు విడుదలై దుమారం రేపాయి. ఇదే విషయానికి సంబంధించి మరో కీలక నాయకుడు కిలపర్తి శ్రీనివాస్‌ ఆడియో టేపులు కూడా కలకలం సృష్టించాయి. వాటితో మాకు సంబంధం లేదు, అదంతా ఏఐ క్రియేటెడ్‌ అని టీడీపీ నేతలు వివరణలు ఇచ్చుకున్నా… మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకు బలమైన కారణం కూడా ఉందండోయ్‌.

Read Also: China: పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏం చెబుతోంది..

అసలా వాయిస్‌ రికార్డింగ్స్‌ని బయట పెట్టింది కూడా తెలుగుదేశం నాయకుడే కావడంతో… జనంలో కూడా అనుమానాలు బలపడ్డాయట. మరోవైపు ఇటీవల దేవాదాయ శాఖకు సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్స్‌ నియామకం వివాదంగా మారింది. రాజమండ్రిలో పేకాట క్లబ్బుల నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొయ్యల రమణకు దక్షిణ కాశీగా చెప్పుకునే ఉమా కోటి లింగేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్‌లోని ఓ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న మళ్ళ వెంకట్రాజును ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమించారు. గతంలో రౌడీ షీటర్‌గా ఉన్న టిడిపి సిటీ మాజీ అధ్యక్షులు రెడ్డి మణిని పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం చైర్మన్‌గా నియమించారు. వీరితో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు కూడా వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే.

Read Also: Modi’s gifts to Putin: ‘‘భగవద్గీత, కాశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాం టీ’’.. పుతిన్‌కు మోడీ గిఫ్టులు ఇవే..

ఇందుకు సంబంధించిన అన్ని వివరాలతో ఇంటిలిజెన్స్‌ రిపోర్టులు ప్రభుత్వానికి చేరాయట. ఈ ట్రస్ట్ బోర్డ్ కమిటీల్లో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టిగా వాదించే బీజేపీ నేతలు ఆ సంగతి మర్చిపోయి ట్రస్ట్ బోర్డ్ పదవులు ఎలా తీసుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రకరకాల వివాదాలు, బలమైన కారణాలతోనే లోకేష్ పర్యటన ఎప్పటికప్పుడు రద్దవుతున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే ఎవరికి వారు గుసగుసలాడుకుంటున్నారు తప్ప… ఎక్కడా కన్ఫర్మేషన్‌ లేకపోవడంతో… అదే కారణమా? లేక యాదృచ్చికమా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. కానీ… మంత్రి లోకేష్‌ ముఖాముఖి, ప్రారంభోత్సవాల కోసం రాజమండ్రి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Exit mobile version