YCP : అక్కడికి కొత్త అధికారులు వస్తే పెద్ద సారుకు సెల్యూట్ కొట్టాల్సిందే! |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారులు బదిలీపై వెళ్తే.. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే, కలెక్టర్, లేదా మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాత్రం పూర్తి డిఫరెంట్. ఇక్కడికి ఎవరొచ్చినా.. ఏం జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యే సోదరులను కలవాలట. ఇక్కడ ఎమ్మెల్యే మొన్నటి వరకు మంత్రిగా చేసిన శంకర నారాయణ. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా.. 2019లోనే కేబినెట్లో చోటు కొట్టేశారు. ఇందుకు సామాజికవర్గం సమీకరణాలు కలిసొచ్చాయి. శంకర నారాయణ ఎమ్మెల్యే కాకముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో పెద్దగా చర్చల్లో ఉండేవారు కాదు శంకర నారాయణ. కానీ.. మంత్రి అయ్యాక వివాదాలు గట్టిగానే ముసురుకున్నాయి. సొంత పార్టీవాళ్లే ఆయనపై తిరుగుబాటు చేసేంతగా పరిణామాలు మారిపోయాయి. తాడేపల్లి వరకు ఫిర్యాదులు వెళ్లాయి.
ఇక్కడో సంగతి ప్రత్యేకంగా చెప్పుకొంటాయి పార్టీ వర్గాలు. పెనుకొండలోని వైసీపీ నేతలు, కార్యకర్తల కోపం శంకర నారాయణపై కాదట. ఆగ్రహం అంతా ఆయన సోదరులపై అని ఓపెన్‌గానే చెబుతారు. మాజీ మంత్రికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఒకరు రవి.. ఇంకొకరు మల్లికార్జున్. శంకర నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఫుల్ బిజీ. ఆ టైమ్‌లో పెనుకొండలో పెత్తనం ఆయన సోదరులదే. వారిలో రవి మరీ దూకుడుగా వెళ్లేవారట. కేవలం రాజకీయ కార్యకలాపాలకే కాకుండా.. అధికారికంగా శంకర నారాయణ చేయాల్సిన పనుల్లోనూ జోక్యం చేసుకునేవారట తమ్ముళం వారు. ఆ విధంగా నియోజకవర్గంలో మొత్తం పట్టు సాధించారని టాక్. పెనుకొండలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పని జరగాలన్నా శంకర నారాయణ సోదరులకు తెలియాల్సిందేనట. ఈ వైఖరి కొత్తలో బాగానే ఉన్నా.. రాన్రానూ శ్రుతిమించినట్టు చెబుతున్నారు. ఫలితంగా వైసీపీ లోకల్ లీడర్సే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది.
Also Read
శంకర నారాయణ మంత్రిగా ఉన్నంతకాలం ఉగ్గబెట్టుకుని ఉన్న అసంతృప్తి నేతలు.. ఆయన కేబినెట్లో చోటు కోల్పోగానే బయటకొచ్చారు. ఆయన వ్యతిరేకులంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అది నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. తాజాగా ఒక ఉద్యోగిని విషయంలో మాజీ మంత్రి సోదరులు వ్యవహరించిన తీరు చర్చగా మారింది. పెనుకొండ MPDO ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక ఉద్యోగిని బదిలీపై పరిగి మండలానికి వచ్చారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోతుంటే.. అక్కడి ఎంపీడీవో షాక్ ఇచ్చారట. ముందుగా వెళ్లి శంకర నారాయణ సోదరుల పర్మిషన్ తీసుకోవాలని.. ఆ తర్వాత డ్యూటీలో చేరాలని సెలవిచ్చారట. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఆ మహిళా ఉద్యోగి భర్త వైసీపీ నాయకుడు. ఆయన శంకర నారాయణ వ్యతిరేకవర్గం కావడంతోనే అలా చేశారని నియోజవర్గంలో గుప్పుమంది. ఆ వర్గపోరు కారణంగా ఆ ఉద్యోగినికి అక్కడ పోస్టింగ్ క్యాన్సిల్ చేసి మడకశిర పంపేశారట.
పెనుకొండలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయన్నది వైసీపీ అసంతృప్తులు చెప్పేమాట. శంకర నారాయణ ఇద్దరు సోదరుల్లో రవి వైఖరిపైనే పార్టీ వర్గాలకు ఎక్కువ అభ్యంతరాలు ఉన్నాయట. ఆయన లక్ష్యంగానే సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నట్టు టాక్. తమ్ముడు.. కుమ్ముడు అని గట్టిగానే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఇదంతా తెలిసినా మాజీ మంత్రి శంకర నారాయణ ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే కేడర్‌కు అర్థం కావడం లేదట.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!