అధికారులు బదిలీపై వెళ్తే.. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే, కలెక్టర్, లేదా మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాత్రం పూర్తి డిఫరెంట్. ఇక్కడికి ఎవరొచ్చినా.. ఏం జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యే సోదరులను కలవాలట. ఇక్కడ ఎమ్మెల్యే మొన్నటి వరకు మంత్రిగా చేసిన శంకర నారాయణ. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా.. 2019లోనే కేబినెట్‌లో చోటు కొట్టేశారు. ఇందుకు సామాజికవర్గం సమీకరణాలు కలిసొచ్చాయి. శంకర నారాయణ ఎమ్మెల్యే కాకముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో…