Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Is Happening In Tcongress

TCongress : ఒకరు ఎడ్డం అంటే ఇంకొకరు తెడ్డం అంటున్నారా.? ఇంతకీ టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

Published Date :June 13, 2022 , 11:29 am
By Premchand Chowdary
TCongress : ఒకరు ఎడ్డం అంటే ఇంకొకరు తెడ్డం అంటున్నారా.? ఇంతకీ టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్‌ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం దీనిపై రేవంత్‌కి భిన్నంగా స్పందించారు.

రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే… అతనిది సొంత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన కోరుకోవడం తప్పన్నారు. అది కాంగ్రెస్‌కే నష్టమన్నారాయన. రాష్ట్రపతి పాలనతో రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ చూస్తుంది ఆరోపించారు జగ్గారెడ్డి. పైగా గవర్నర్ దర్బార్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదన్నారు. దీని వెనుక బీజేపీ ఉందన్నది జగ్గారెడ్డి ఆరోపణ. గవర్నర్‌కి జరిగిన అవమానంపైనే అధికారులపై ఇంత వరకూ చర్యల్లేవని… ఇక మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలుంటాయని ప్రశ్నించారు. .

జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాల్లో కొంత లాజిక్ ఉంది. ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీతో పాటు పోలీసు అధికారులపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు గవర్నర్. దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి అతీగతీ లేదు. ఇక రాజ్‌భవన్‌ వెళ్లే మహిళా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని జగ్గారెడ్డి సందేహించడంలో అర్థం లేకపోలేదు. …
గవర్నర్ తమిళి సై ప్రజాదర్బార్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్‌లో ఇది సహజం కూడా. రేవంత్ వ్యాఖ్యల్ని ఓ వైపు తప్పుబడుతూనే… మరోవైపు… అది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ తనను తాను సమర్థించుకుంటున్నారు జగ్గారెడ్డి. సాధారణంగా ఏ పార్టీకైనా ఒక అంశంపై ఒక విధానం ఉంటుంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే… నేతలంతా దానిని పాటించాల్సి ఉంటుంది. కానీ… గవర్నర్ దర్బార్ విషయలో ఒకే అభిప్రాయం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు జగ్గారెడ్డి. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడకూడదు కానీ… అంశాలపై మాట్లాడినప్పుడు… భిన్నాభిప్రాయాలు సహజమే అంటున్నారాయన. .
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ అంశంపై అయినా ఒక్కో నేతది ఒక్కో అభిప్రాయం అన్నట్టు మారిపోయింది .

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jaggareddy
  • Mahila Darba
  • revanth reddy
  • tcongress
  • Telangana Governor Tamilisai Soundararajan

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions