తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్‌ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్…