Jammalamadugu Politics : ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది..? ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో నాయకులు ఎన్నో అంటూ ఉంటారు. కొందరు సవాళ్లు విసిరితే.. మరికొందరు కౌంటర్లు వేస్తారు. ఎదుటివారిని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలూ ఉంటాయి. ఆ మాటల్లోని మర్మం తెలుసుకోకపోతే ఎవరో ఒకరు ట్రాప్‌లో పడ్డం ఖాయం. ఆ నియోజకవర్గంలోనూ అదే జరిగిందట. ఇంతకీ ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు? లెట్స్ వాచ్..!
ఏపీ రాజకీయాల్లో జమ్మలమడుగు రూటే వేరు. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా అయిన నియోజకవర్గం ఇప్పుడు హాట్ హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రాంతానికి చెందిన కాకలుతీరిన రాజకీయ నాయకులకు టైమ్ రివర్స్‌లో నడుస్తోంది. మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పొలిటికల్ స్క్రీన్‌పై మునుపటిలా సత్తాచాట లేని పరిస్థితి. మరో మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి 2019లో జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి చక్రం తిప్పడం మొదలు పెట్టారు. రాజకీయంగా పూర్వ వైభవం సాధించేందుకు రామసుబ్బారెడ్డి ఫ్యామిలీతోపాటు ఆదినారాయణరెడ్డి కుటుంబం చేయని ప్రయోగాలు లేవు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినా గుర్తింపు లేదనే ఆవేదనలో ఉంటే.. ఆదినారాయణరెడ్డి కుటుంబానిది చెరోదారి అయ్యింది. ఆదినారాయణరెడ్డి బీజేపీలోనూ.. ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలోనూ కొనసాగుతున్నారు. నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ కూడా. రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో క్రమంగా శక్తిని కూడదీసుకునే పనిలో ఉన్నాయి కీలక కుటుంబాలు. ఇది పసిగట్టిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. విరుగుడు మంత్రం వేసే పనిలో పడ్డారట. ఈ క్రమంలో ఆయన పేల్చిన మాటల తూటాలు.. వాటికి వైరిపక్షం వేసిన కౌంటర్లు జమ్మలమడుగులో ఆసక్తికర రాజకీయాలకు తెరతీశాయి.
Also Read
జమ్మలమడుగులో మొదటి నుంచి దేవగుడి కుటుంబానికి అండగా ఉంటోన్న కార్యకర్తలను, అభిమానులను టీడీపీ ఇంఛార్జ్ భూపేష్‌రెడ్డి కలుస్తూ వస్తున్నారు. నారాయణరెడ్డి కుటుంబం అంతా ఒకటే అనే మాటను బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారట. భూపేష్‌రెడ్డి ఎత్తుగడలతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. యువనేత స్పీడ్‌కు బ్రేక్‌లు వేయాలనే ఆలోచనతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్పీడ్ పెంచారు. అక్కడితో ఆగితే బాగోదనుకున్నారో ఏమో.. భూపేష్‌రెడ్డిపైనా.. దేవగుడి కుటుంబంపైనా తనదైన శైలిలో విమర్శలు చేశారు సుధీర్‌రెడ్డి. దేవగుడి కుటుంబం కలిసిపోతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని లెక్కలు వేసుకుని రాజకీయ చెడుగుడుకు తెరతీశారని టాక్.
భూపేష్‌రెడ్డి బాబాయ్‌ల్లో ఆదినారాయణరెడ్డి బీజేపీలోనూ.. శివనాథ్‌రెడ్డి టీడీపీలోనూ కొనసాగుతున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. దమ్ముంటే బాబాయ్, అబ్బాయ్‌లు ఇద్దరూ తనపై పోటీ చేయాలని.. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సవాల్ చేశారు. అసలే ఫ్యాక్షన్ గడ్డ. మాటకు మాట చెప్పకపోతే లెక్కలు తప్పుతాయని అనుకున్నారో ఏమో.. భూపేష్‌రెడ్డితోపాటు.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అంతేస్థాయిలో ఎమ్మెల్యే సవాల్‌కు జవాబిచ్చారు. సుధీర్‌రెడ్డిపై పోటీకి సిద్ధమని ఇద్దరూ ప్రకటించడంతో దేవగుడి అనుచరులు, అభిమానులు డైలమాలో పడ్డారట. టీడీపీ నుంచి భూపేష్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తే.. ఎవరికి సపోర్ట్ చేయాలో తేల్చుకోవడం కష్టమంటున్నారట.
మొత్తానికి దేవగుడి కుటుంబం కలిస్తే ఇబ్బంది అని భావించి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సవాల్ చేస్తే.. బాబాయ్ అబ్బాయ్‌లు ఆ ట్రాప్‌లో పడ్డారని జమ్మలమడుగులో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటే తన గెలుపునకు ఢోకా ఉండబోదనే ఎమ్మెల్యే ఆ స్కెచ్ వేశారని.. అందులో దేవగుడి ఫ్యామిలీ ఇరుక్కుందని అనుకుంటున్నారట. మరి.. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!