TRS : సేఫ్ గేమ్ ఆడే నాయకులు ఆ జిల్లాలో యాక్టివ్ అయ్యారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు.
గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు సమాచారం. పినపాకలో ఓడిన టీఆర్ఎస్ నేత పాయం వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నా.. అక్కడ రేగా కాంతారావు పాగా వేసేశారు. పాయానికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. ఆయన అనుచరులు ఇదే గందరగోళంలో ఉన్నారట. పైగా పాయం మాజీ ఎంపీ పొంగులేటికి ముఖ్య అనుచరుల్లో ఒకరు. దీంతో పాయం టీఆర్ఎస్లోనే ఉంటారా.. లేక సీటు కన్ఫామ్ చేసే పార్టీలోకి జంప్ చేస్తారా అనేది పినపాకలో పెద్ద చర్చగా ఉంది.
Also Read
ఇల్లెందులో ఓడిన టీఆర్ఎస్ నేత కోరం కనయ్యది కూడా ఇలాంటి సంకటి స్థితే. కాకపోతే ఎన్నికల్లో ఓడిన కనకయ్యను పార్టీ జడ్పీ ఛైర్మన్‌ను చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు కనకయ్యకు ఇల్లెందులో అస్సలు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కనకయ్య చూస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే జంప్ చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. ఈ మధ్య మాజీ ఎంపీ పొంగులేటితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు కోరం.
గతంలో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడి.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న మట్టా దయానంద్ సైతం పోటీకి తహతహలాడుతున్నారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని సెంటిమెంట్ పండిస్తున్నారు కూడా. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో చేరొచ్చని సత్తుపల్లిలో ప్రచారం జోరందుకుంది. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? మదన్‌లాల్ మాత్రం పోటీ చేయాల్సిందే అని అనుచరులకు చెబుతున్నారట. దాంతో ఈ మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తారనేది కేడర్‌కు అంతుచిక్కడం లేదు. ఇలా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు సేఫ్ ప్లేస్ కోసం జంప్ జిలానీలుగా మారే పనిలో ఉన్నారట. మరి.. తాటి తర్వాత క్యూ కట్టే నాయకులు ఎవరో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!