TG Cabinet : తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రి మండలి పరిశీలించనుంది. అలాగే, ఈ ఎన్నికల్లో అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను రద్దు చేయడానికి ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశముందని సమాచారం.
Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!
అదనంగా, SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లు, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం, మున్నేరు వాగు రిటైనింగ్ వాల్, పంచాయతీరాజ్ మరియు ఆర్‌అండ్‌బీ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఇక SRSP స్టేజ్–2 ప్రాజెక్టుకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును ఖరారు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా, నేటి కేబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ
