Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన “తెలుసుకదా” మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతూ, సిద్దుకు తన కెరీర్‌లో మరో మైలురాయి సక్సెస్‌ని అందించింది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేయగా.. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా సిద్దు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Janhvi Kapoor: కేవలం గ్లామర్ కాదు, పర్ఫార్మెన్స్ కూడా – కొత్త ట్రాక్‌లో జాన్వీ కపూర్!
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఆయన చెప్పిన ప్రకారం.. “తెలుసు కదా” సినిమాలో ఫస్ట్ ఛాన్స్ నాకేం రాలేదు. ఈ కథ మొదట నితిన్‌గారికి వెళ్లింది. కథ మొత్తం విన్న నితిన్, రాత్రి నాకు ఫోన్ చేసి – ‘ఇదో మంచి కథ ఉంది, నీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. నువ్వు విను’ అని చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ సినిమా అవకాశానికి నీరజ కంటే ముందు నితిన్‌గారికే థాంక్స్ చెప్పాలి” అని సిద్దు చెప్పారు. అంటే “తెలుసు కదా”లో హీరోగా మొదట నితిన్ ఉండాల్సింది! ఆయన ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం సిద్దుకి దక్కింది. ఇప్పుడు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో నితిన్ ఆ సినిమా మిస్ చేసుకోవడం పెద్ద లాస్‌గా మారిందనే కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో నితిన్ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటూ కాస్త కష్టమైన దశలో ఉన్నాడు. అటువంటి సమయంలో “తెలుసుకదా” లాంటి ఫీల్‌గుడ్, కంటెంట్ డ్రైవన్ సినిమా అతని చేతులారా జారిపోవడం తో అభిమానులు షాక్ అవుతున్నారు. “ఇలాంటి స్క్రిప్ట్‌ను వదులుకున్నాడంటే నిజంగా దురదృష్టమే”, “నితిన్ చేస్తే కూడా హిట్ అయ్యేదే కానీ, సిద్దు చేసాడు కాబట్టి సినిమా ఫ్రెష్‌గా అనిపించింది” అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక సిద్దు విషయానికి వస్తే – ఈ సినిమా తర్వాత అతని మార్కెట్ మరింత పెరిగింది. స్టైల్, హావభావాలు, డైలాగ్ డెలివరీతో యువతలో మాస్ క్రేజ్ పెరిగిపోయింది. మొత్తానికి నితిన్ వదిలిన “తెలుసుకదా” సిద్దుకి గోల్డెన్ హిట్‌గా మారింది అంటున్నారు సినీ వర్గాలు.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!